twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మనసుకు నచ్చింది’ రివ్యూ: ప్రేక్షకుడి సహనానికి పరీక్ష...

    By Bojja Kumar
    |

    Recommended Video

    మనసుకు నచ్చింది రివ్యూ

    Rating:
    2.0/5
    Star Cast: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి
    Director: మంజుల ఘట్టమనేని

    మంజుల ఘట్టమనేని.... సూపర్ స్టార్స్ ఫ్యామిలీలో పుట్టిన లక్కీ లేడీ. కానీ ఏం లాభం తన మనసుకు నచ్చిన కొన్ని పనులు చేయలేక పోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యంగ్ ఏజ్‌లో ఉన్నపుడు నటిగా, హీరోయిన్‍‌గా రాణించాలనేది ఆమె కల. అయితే అప్పటి పరిస్థితులు తన మనసుకు నచ్చిన పనికి అడ్డుగామారాయి. ఆ సమయంలో వాటిని ఎదురించలేక పరిస్థితులతో కాంప్రమైజ్ అయ్యారు.

    అయితే సినిమాలపై తన ఇష్టాన్ని చంపుకోలేక సినిమా రంగాన్ని ప్రొఫెషన్‌గా ఎంచుకున్నారు మంజుల. నటిగా రాణించాలనే తన కలకు దూరమైనా.... నిర్మాతగా మారి తన మనసుకు నచ్చిన సినిమాలు నిర్మించారు. ఇపుడు అంతకంటే ఇష్టమైన రచన, దర్శకత్వం వైపు అడుగులు వేశారు. 'మనసుకు నచ్చింది' అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల మనసును ఏమేరకు మెప్పింది? తొలి సారి మెగా ఫోన్ పట్టిన మంజుల ఏ మేరకు తన సత్తా చాటారు. అనేది రివ్యూలో చూద్దాం.

    కథ ఇలా మొదలవుతుంది...

    కథ ఇలా మొదలవుతుంది...

    సూరజ్(సందీప్ కిషన్), నిత్యా( అమైరా దస్తూర్) చిన్నతనం నుండి కలిసే పెరుగుతారు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ బాండింగ్ చూసి వీరు ప్రేమించుకుంటున్నారని అపోహపడిన పెద్దలు ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ ఇద్దరి మధ్య పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఉండదు. (ఇష్టం లేనపుడు అప్పుడే పెద్దలకు చెప్పి పెళ్లిని ఆపేయొచ్చు కదా? అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అలా చేస్తే మన సినిమా కథ ముందుకు సాగదు కదా) పెద్దల మాటను కాదనలేక పెళ్లి పిటల వరకు వెళతారు. తీరా ముహూర్తం సమయానికి ఇద్దరూ ఒకరితో ఒకరు లేచిపోతారు. కొంతకాలం తమకు నచ్చినట్లు ఉండాలని ఉద్దేశ్యంతో గోవా పారిపోతారు.

    కథలోని అసలు పాయింట్ ఏమిటంటే...

    కథలోని అసలు పాయింట్ ఏమిటంటే...

    ఈ సినిమా కథలోని అసలు పాయింట్ ఏమిటంటే.... మనం కళ్లతో చూసి ఇష్టపడినవి అన్నీ మన మనసు స్వీకరించదు. దానికంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి మనసు ఇష్టపడితే అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది. మనసు ఇష్టపడింది దక్కకపోతే ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది. మన మనసుకు నచ్చింది చేసినపుడే జీవితాంతం సంతోషంగా ఉంటారు అనే చెప్పే ప్రయత్నంచేశారు. హీరో హీరోయిన్...... తమ కళ్లకు నచ్చింది ఏది, మనసుకు నచ్చింది ఏది అని తెలుసుకోవడానికి పడ్డ సంఘర్షణే మిగతా కథ.

    సందీప్ కిషన్

    సందీప్ కిషన్

    సందీప్ కిషన్ ఈ చిత్రంలో పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనే కలలు కనే కుర్రాడి పాత్రలో కనిపించాడు. బికినీ పాపలంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటాడు. కానీ వాస్తవానికి అతడి మనసుకు నచ్చింది అది కాదు. కళ్లకు నచ్చిన అమ్మాయి వేరు, మనసుకు నచ్చిన అమ్మాయి వేరు..... ఇలా సంఘర్షణ పడే పాత్రలో సందీప్ కిషన్ బాగా నటించాడు.

    అమైరా దస్తూర్

    అమైరా దస్తూర్

    అమైరా దస్తూర్ పాత్ర విషయానికొస్తే....మనసు ఫిలాసఫీని ఫాలో అయ్యే పాత్ర. నేచర్ అంటే చాలా ఇష్టం. తన మనసుకు నచ్చింది ఇదే అని తెలిసినా దాన్ని అందుకోలేక, మనసులోని విషయాన్ని బయటపెట్టలేక తనలో తానే కుమిలిపోయే పాత్రలో హావభావాలు సహజసిద్ధంగా పండించింది.

    త్రిదా చౌదరి

    త్రిదా చౌదరి

    ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో త్రిదా చౌదరి నటించారు. ఈ బ్యూటీకి నటన పరంగా పెద్దగా అవకాశం లేక పోయినా.... బికినీ అందాలతో కనువిందు చేసింది. నటన పరంగా కూడా ఒకే అనిపించింది.

    జాను పాప....

    జాను పాప....

    మహేష్ బాబు కోడలు, మంజుల కూతురు జాహ్నవి ఈ చిత్రంలో జాను పాపగా తెరంగ్రేటం చేసింది. చాలా ముద్దుగా కనిపించింది. వచ్చి రాని తెలుగులో ఆమె మాటలు ఆకట్టుకుంటాయి.

    ఇతర పాత్రదారులు

    ఇతర పాత్రదారులు

    ఇతర పాత్రల్లో ప్రియదర్శి, పునర్నవమి, నాజర్, నవీన్, సంజయ్ స్వరూప్ నటించారు. ఇవన్నీ కథలో అక్కడక్కడే తగిలే పాత్రలు మాత్రమే. ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ పాత్రల గురించి ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు.

    టెక్నికల్ అంశాల పరంగా....

    టెక్నికల్ అంశాల పరంగా....

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే.... రవి యాదవ్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. గోవా అందాలను ఇదివరకు ఎప్పుడూ చూడనంత కొత్తగా చూపించారు. రాధన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ విషయానికొస్తే ఇంకా చాలా బెటర్‌గా చేయాల్సింది. సినిమాను ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.

    కథ, స్క్రీన్ ప్లే

    కథ, స్క్రీన్ ప్లే

    ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా మంజుల ఘట్టమేని అందించారు. కథలో అస్సలు కొత్తదనం లేదనే చెప్పాలి. ఇలాంటి రోటీన్ పాయింటుతో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సార్లు పాయింట్ రోటీన్ అయినా చెప్పే విధానం(స్క్రీన్ ప్లే) కొత్తగా ఉండి ప్రేక్షకులకు నచ్చేశాయి కూడా. అయితే ఈ విషయంలో మంజుల ఘట్టమనేని తడబడ్డారని చెప్పక తప్పదు. మనసు గురించి చాలా విషయాలు చెప్పిన ఆమె కథలోని సోల్ ప్రేక్షకుడి మనసుకు కనెక్ట్ చేయడంలో విఫలం అయ్యారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే...

    డైరెక్షన్ ఎలా ఉందంటే...

    ఇక డైరెక్షన్ విషయానిక్తే.... సినిమా టేకింగ్ పర్వాలేదు. ఎవరో కొత్త డైరెక్టర్ తీసిన ఫీలింగ్ అయితే రాదు. బహుషా టాప్ టెక్నీషియన్లు, అనుభవం ఉన్న నిర్మాతలు ఉండటం వల్ల మనకు డైరెక్షన్ బాగోలేదనే ఫీల్ కలగదు. డైరెక్షన్ అంటే కథను తెరపై ఇంపుగా చూపించడం కాదు, తెరపై ఆడే కథను ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేయడంతోనే సక్సెస్ అనేది ముడి పడి ఉంటుంది.

    ఫస్టాఫ్, సెకండాఫ్

    ఫస్టాఫ్, సెకండాఫ్

    ఫస్టాఫ్‌లో సినిమా మొదలైనపుడు ఏదో కొత్తగా చూపించబోతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ముందుకు సాగే కొద్దీ కొత్తదనం కనిపించక సెకండాఫ్ వరకు సాగదీసి సాగదీసి ప్రేక్షకుడు విసుగెత్తిపోయేలా చేశారు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    ఈ సినిమాకు పెద్ద ప్లస్ ప్రకృతి పాత్రలో మహేష్ బాబు వాయిస్ ఓవర్. సినిమా ప్రారంభంలో మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్రేక్షకుడికి ఇక మంచి ఫీల్ కలిగిస్తుంది. రవి యాదవ్ సినిమా సినిమాటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి కూడా ప్లస్సే.

    మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్

    కథ, సాగదీసినట్లు ఉండే స్క్రీన్ ప్లే.
    ఎంటర్టెన్మెంట్ లోపించడం
    కథ నేరేట్ చేసే విధానం చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉండటం.

    చివరగా

    చివరగా

    దర్శకురాలు మంజుల తన మనసుకు నచ్చిన విధంగా సినిమాను తీశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుడి మనసుకు కనెక్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమాను పకృతి రూపంలో కనిపించి వాయిస్ ఓవర్ రూపంలో వినిపించిన మహేష్ బాబే కాపాడాలి.

    మనసుకు నచ్చింది

    మనసుకు నచ్చింది

    తారాగణం: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, నాజర్, ప్రియదర్శి తదితరులు..
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
    నిర్మాతలు: సంజయ్ స్వరూప్, జెమిని కిరణ్
    సినిమాటోగ్రఫీ: రవి యాదవ్
    సంగీతం: రాధన్
    విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018

    English summary
    Manasuku Nachindi movie Review. Manasuku Nachindi directed by debutant Manjula Ghattamaneni and is being jointly produced by Sanjay Swaroop and P.Kiran under his banner Anandi Art Creations. It will feature Sundeep Kishan, Amyra Dastur, Tridha Choudhury and Adith Arun in the lead roles. Radhan is the Music Director .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X