twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchi Rojulu Vachayi movie Review మారుతి మార్కు ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా

    |

    Review: 2.75/5

    భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు, ప్రతీ రోజు పండగే తదితర లాంటి లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడు మారుతి మరోసారి మంచి రోజులు వచ్చాయి అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ముందుకు వచ్చారు. టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్‌కేఆన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై మంచి హైప్‌ను పెంచాయి. దీపావళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి రోజులు వచ్చాయి చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని, వినోదాన్ని అందించారనే విషయంలోకి వెళితే..

    మంచిరోజులు వచ్చాయి కథ

    మంచిరోజులు వచ్చాయి కథ

    జీవితాన్ని చాలా సంతోషంగా ఆస్వాదించే గోపాలం (అజయ్ ఘోష్)కు కూతురు పద్మ (మెహ్రీన్ ఫిర్జాదా)ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. తన కూతురు పెంపకం, జీవితానికి సంబంధించిన విషయంలో అనేక భయాలను మనసులో పెట్టుకొని జీవిస్తుంటాడు. అయితే బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేసే పద్దు తన తోటి ఉద్యోగి (సంతోష్)తో ప్రేమలో ఉంటుంది. ఇదిలా ఉండగా, హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో తన కాలనీలోని స్నేహితులు పాలసీ మూర్తి (శ్రీనివాసరావు), కోటేశ్వరరావులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కూతురు పద్దు ప్రేమ విషయంలో గోపాలానికి లేనిపోని అనుమానాలు కలిగిస్తారు. కూతురుపై అనుమానాలను పెంచుకొన్న గోపాలం.. పద్దు, సంతూ ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు.

    కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..


    ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురుపై ఎలాంటి పరిస్థితుల్లో గోపాల అనుమానాలు పెంచుకొంటాడు. జీవితంలో అతిభయం ఉండటం కారణంగా గోపాలంకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తన కూతురుకు మంచి భర్తను తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. తన ప్రియురాలు పద్దు ప్రేమను కాపాడుకోవడానికి గోపాలాన్ని సంతోష్ ఎలా మెప్పించేందుకు ప్రయత్నం చేశాడు. స్వచ్ఛమైన మనసు ఉన్న గోపాలం బుర్రలో పాలసీ మూర్తి ఎలాంటి అనుమానం బీజాలను నాటాడు? గోపాలం మనసులో పాలసీ మూర్తి ఎందుకు భయాన్ని సృష్టించాలనుకొంటాడు? చివరకు అతిభయం అనే లక్షణాన్ని గోపాలం వదిలించుకొన్నాడా? పద్దు, సంతోష్ ప్రేమను ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించాడు అనే ప్రశ్నలకు వినోదాత్మకంగా చెప్పిన సమాధానాలే మంచి రోజులు వచ్చాయి సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    గోపాలం మనసులో పాలసీ మూర్తి అనే ఎల్‌ఐసీ ఏజెంట్ అనుమానపు బీజాలు నాటడంతోపాటు, పద్దు, సంతూ ప్రేమకథ అంశాలతో సినిమా ఫుల్ ఫన్‌ ఎలిమెంట్స్‌ కథ మొదలవుతుంది. మారుతి మార్కు కామెడీ పంచులు, రొమాంటిక్ ఎలిమింట్స్‌తో సన్నివేశాలు సరదాగా సాగిపోతుంటాయి. సంతూతో కూతురు ప్రేమ గురించి గోపాలం తెలుసుకొన్న తర్వాత జరిగే పెళ్లి చూపులు ఎపిసోడ్స్ హిలేరియస్‌గా ఉంటాయి. క్రికెట్ ఎపిసోడ్ లాంటివి ఆకట్టుకొనేలా ఉంటాయి. ఎమోషన్స్, కామెడీని మేలవించడానికి ప్రయత్నించడం వల్ల కథ గురించి, హీరో, హీరోయిన్లు, మిగితా క్యారెక్టర్ల గురించి పట్టించుకోకపోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఫన్ అనే సింగిల్ ఎజెండాపైనే తొలిభాగం ముగుస్తుంది. ఒక సింపుల్ అండ్ ఎమోషనల్ ట్విస్ట్‌తో మంచి రోజులు వచ్చాయి ముగుస్తుంది.

    సెకండాఫ్ ఇలా..

    సెకండాఫ్ ఇలా..

    ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే క్లైమాక్స్ ఏమిటో సాధారణ ప్రేక్షకుడికి అర్దమైపోతుంది. అయితే తన కథాగమనంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి దర్శకుడు మారుతి రాసుకొన్న సన్నివేశాలు సినిమాకు సపోర్ట్‌గా నిలిచాయి. సెకండాఫ్‌లో కమెడియన్ ప్రవీణ్‌తో చేయించిన 'అప్పడాల విజయలక్ష్మీ' ఎపిసోడ్ కొంత నాసిరకంగా అనిపించినప్పటికీ.. మాస్ ఆడియెన్స్‌లో నవ్వులు పువ్వులు పూయించేలా ఉన్నది. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి సున్నితమైన హస్యంతో సరదాగా సాగిపోతుంది. అయితే కథ, కథనాలు రొటీన్‌గా ఉండటంతో, స్టోరీలో పెద్దగా కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల సినిమాపై కొంచెం ఆసక్తి తగ్గుతుంది.

    దర్శకుడు మారుతి టేకింగ్..

    దర్శకుడు మారుతి టేకింగ్..

    మంచి రోజులు వచ్చాయి సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు మారుతి చాలా సింపుల్‌గా, ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా రెగ్యులర్ ఫార్మాట్‌లో రొటీన్ కథతో తన మార్కు మేకింగ్‌లో కథను చెప్పడానికి ప్రయత్నించారు. ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కరోనా పరిస్థితులను కథకు వాడుకొని పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారనే విషయం సినిమా ఆరంభంలో రెండు, మూడు సీన్లతో అర్ధమవుతుంది. సాధారణంగా హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌తో సినిమాను లాగించడం చూశాం. కానీ ఈ సినిమా విషయానికి వస్తే చిన్న యాక్టర్ల ప్రధానంగా మార్చి వారితోనే సినిమాను నడిపించడం మారుతి ప్రతిభకు అద్దం పట్టింది. గోపాలం, పాలసీ మూర్తీ, కోటేశ్వరరావు లాంటి ఆర్టిస్టులతో మంచి ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో తాను రూపొందించిన సినిమాలకు భిన్నంగా అంటే కథ విషయంలో మారుతి ఓ సాహసం చేశారని చెప్పవచ్చు.

    మెహ్రీన్, సంతోష్ శోభన్

    మెహ్రీన్, సంతోష్ శోభన్

    పద్దుగా మెహ్రీన్ పిర్జాదా, సంతోష్‌గా సంతోష్ శోభన్ పాత్రల్లో పెద్దగా వైవిధ్యం ఏమీ కనిపించదు. కథకు కేవలం సపోర్టింగ్‌గా మారడం వల్ల వారు తమ పాత్రలకే పరిమితమయ్యారు. మెహ్రీన్ అతిగా బరువు తగ్గడం వల్ల స్క్రీన్‌పై ఆమెలోని ఛార్మ్ పోయిందని స్పష్టంగా కనిపించింది. హాస్పిటల్ సీన్లలో మెహ్రీన్ తనవంతుగా మెప్పించింది. ఇక సంతోష్ పాత్ర పరంగా గొప్పగా చెప్పుకోవాల్సినంతగా స్టఫ్ కనిపించలేదు. తొలి భాగంలో మెహ్రీన్, సంతోష్ మధ్య రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. సెకండాఫ్‌లో కథాపరంగా వారి మధ్య సన్నివేశాలు పెద్దగా లేకపోవడం యూత్‌కు కొంత అసంతృప్తిగానే ఉండొచ్చనే అభిప్రాయం కలుగుతుంది.

    మిగితా పాత్రల్లో ఎవరెవరు ఎలా ఎంటే..

    మిగితా పాత్రల్లో ఎవరెవరు ఎలా ఎంటే..

    మంచి రోజులు వచ్చాయి సినిమా ద్వారా పాలసీ మూర్తి‌గా శ్రీనివాసరావు గొప్పగా తన ప్రతిభను చాటుకొన్నారు. కొన్ని సీన్లలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ హవభావాలను కాపీ చేయడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. కాకపోతే శ్రీనివాసరావు పాలసీ మూర్తి పాత్రలో అద్భుతంగా నటించడమే కాకుండా జీవించాడని చెప్పవచ్చు. ఇక అజయ్ ఘోష్ కూడా గోపాలంగా పలు వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్‌ను పండించారు. కోటేశ్వరరావు పాత్రను పోషించిన నటుడు (పేరు తెలియదు) సరైన న్యాయం చేశాడు. అజయ్ ఘోష్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు ప్రవీణ్, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్ తమ మార్క్ కామెడీని అందించారు.

    టెక్నికల్ అంశాలు గురించి

    టెక్నికల్ అంశాలు గురించి


    ఇక టెక్నికల్‌గా విషయాలకు వస్తే.. కామెడీ సన్నివేశాలు సినిమాకు బలంగా మారాయి. నాటు డైలాగ్స్‌ మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఈ సినిమాకు పాటలు మంచి జోష్ ఎలిమెంట్స్. అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్ల మూడ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. ఉద్దవ్ ఎడిటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది.

    ప్రోడక్షన్ వాల్యూస్

    ప్రోడక్షన్ వాల్యూస్

    మంచి రోజులు వచ్చాయి సినిమా వీ సెల్యూలాయిడ్, SKN బ్యానర్లపై రూపొందింది. నిర్మాత SKN అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రల ప్రాధాన్యతను అనుసరించి నటీనటుల ఎంపిక బాగుంది. కథ, సీన్లలో ఎమోషన్స్‌ విషయంలో జాగ్రత్తపడి ఉంటే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    అతిభయం అనే చిన్న పాయింట్‌ను తీసుకొని దాని చుట్టూ ఫ్యామిలీ వ్యాల్యూస్, లవ్, కామెడీ లాంటి అంశాలను జోడించి పక్కాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలిచిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. కథ, కథనాలు రొటీన్‌గా ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. గోపాలం తన తల్లి వద్దకు వెళ్లి పడుకోవడం, అలాగే కూతురు కోసం గోపాలం పడే తపన లాంటి కొన్ని సీన్లలో ఎమోషన్స్ ఆకట్టుకొంటాయి. దీపావళీకి మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అందించాలనే నిర్మాతల ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. లాజిక్స్‌ను పక్కన పెట్టి.. పండుగ వేళ వినోదాన్ని పొందాలనుకొనే వారికి మంచి రోజులు వచ్చాయి సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది.

    Recommended Video

    Bigg Boss Sarayu బోల్డ్ Comments On Sudarshan, Maruthi | Manchi Rojulochaie
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    న‌టీన‌టులు: సంతోష్ శోభ‌న్‌, మెహ్రీన్ ఫిర్జాదా, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి, వైవా హ‌ర్ష‌, శ్రీనివాస‌రెడ్డి, అజ‌య్ ఘోష్‌, ప్ర‌వీణ్, శ్రీనివాసరావు, సుదర్శన్, రజిత త‌దిత‌రులు
    ద‌ర్శ‌క‌త్వం: మారుతి
    నిర్మాత: SKN (శ్రీనివాస కుమార్)
    సంగీతం: అనూప్‌ రూబెన్స్
    ఎడిటింగ్: ఉద్ధ‌వ్‌
    సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌
    బ్యానర్స్: వీ సెల్యులాయిడ్‌, ఎస్‌.కె.ఎన్‌.
    రిలీజ్ డేట్: 4.11.2021

    English summary
    Manchi Rojulochaie is a romantic entertainer movie directed by Maruthi and jointly produced by V Celluloid banner and SKN. The movie casts Santosh Shobhan and Mehreen Pirzada in the main lead role while Anup Rubens scored music for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X