Mangalavaaram Review సెక్సువల్ డిజార్డర్‌తో రస్టిక్ డ్రామా.. మంగళవారం మూవీ రివ్యూ!
Rating: 3.25/5
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్, తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్
ఆర్ట్ డైరెక్టర్: మోహన్ తాళ్లూరి
ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి
ఫైట్ మాస్టర్స్: రియల్ సతీష్, పృథ్వీ
సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ: 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్
కొరియోగ్రఫి: భాను
కాస్ట్యూమ్ డిజైనర్: ముదాసర్ మొహ్మద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి
బ్యానర్: A క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్
రిలీజ్ డేట్: 2023-11-17
గోదావరి జిల్లాలోని మా లక్ష్మీపురం గ్రామంలో అక్రమ సంబంధాలు పెట్టుకొన్న జంటలు ప్రతీ మంగళవారం మరణించడం ఆ ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అమ్మవారి జాతర జరిపించకపోవడం వల్లే ఈ అరిష్టాలకు కారణమని గ్రామస్థులు భావిస్తారు. అలాంటి సమయంలో ఓ మహిళా దెయ్యమే అందర్నీ చంపేస్తుందనే మూఢ నమ్మకంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఎస్ఐ (నందిత శ్వేత)గా వచ్చిన మరణాల వెనుక ఏదో మర్మం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపడుతుంది.
గ్రామంలో జరిగిన మరణాల వెనుక అసలు కారణం ఏమిటి? గ్రామంలోని శైలు (పాయల్ రాజ్‌పుత్)ను జమీందార్ ఆదేశాల మేరకు గ్రామస్థులు ఎందుకు శిక్షించాలని అనుకొంటారు? శైలుకు ఎవరు అండగా నిలుస్తారు? చివరకు గ్రామంలో జరిగేవి ఆత్మహత్యలా? హత్యలా? మంగళవారమే మరణాలు ఎందుకు సంభవించాయి? గ్రామంలోని మరణాలకు ఎవరు అడ్డుకట్ట వేశారు? అనే ప్రశ్నలకు జవాబు మంగళవారం సినిమా కథ.

శైలు అనే అమ్మాయి బాల్యానికి సంబంధించిన సంఘటనలతో కథను భావోద్వేగంతో దర్శకుడు అజయ్ భూపతి ఆరంభించిన విధానం బాగుంది. ఆ తర్వాత గ్రామంలో ఉండే కొన్ని క్యారెక్టర్లను ప్రధానంగా చేసుకొని హీరో, హీరోయిన్లు లేకుండా ఫస్టాఫ్ వరకు కథను పరుగులు పెట్టించిన విధానమే సగం సక్సెస్‌కు కారణమని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో జరిగే మరణాలు, వాటి చుట్టు సాగిన డ్రామాను డైరెక్టర్ రక్తి కట్టించారు. ప్రతీ క్యారెక్టర్‌పై అనుమానాలు వచ్చేగా రాసుకొన్న స్క్రిప్టు బాగుంది. శైలు పాత్రకు సంబంధించిన చిన్న ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ముగించడంతోపాటు సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచారు.
మంగళవారం సెకండాఫ్ విషయానికి వస్తే.. అసలు కథను మొదలుపెట్టి ప్రతీ ఎపిసోడ్‌తో ట్విస్ట్ ఇస్తూ ప్రతీ సీన్‌ను ఎమోషనల్‌గా మార్చారు. శైలు పాత్రను స్క్రీన్‌పై బోల్డుగా చూపిస్తూనే ఆ క్యారెక్టర్‌పై సానుభూతిని పెరిగేలా చేయడం ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. చివరి 45 నిమిషాల్లో ప్రతీ ట్విస్టును విప్పిన విధానంతో సినిమాను సక్సెస్ ట్రాక్‌ను ఎక్కించడమే కాకుండా పరుగులు పెట్టేలా చేశాడని చెప్పవచ్చు. ప్రతీ చిన్న క్యారెక్టర్‌ను రాసుకొన్న విధానం వారితో నటన రాబట్టుకొన్న విధానం ఆయన విజన్ ఏమిటో చెప్పింది. ఈ సినిమాకు దర్శకుడే హీరోలా చేసిందని చెప్పవచ్చు.
RX100 అద్బుతమైన ఫెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకొన్న పాయల్ రాజ్‌పుత్ ఆ స్థాయిలో రాణించలేక తడబాటుకు గురవుతున్నట్టు కనిపించింది. అయితే మరోసారి శైలు పాత్రతో నటనాపరంగా విజృంభించింది. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. ఎవరూ ధైర్యం చేయని పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఫెర్ఫార్మ్ చేసిన విధానం సూపర్బ్ అనిపించేలా చేసింది.
ఇక రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి, దయానంద్ రెడ్డి, నందిత శ్వేత, చైతన్య కృష్ణ, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమర్ పాత్రలు అన్నీ బలమైన పాత్రలే కావడంతో వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు రాణించారు. అజయ్ ఘోష్, లక్ష్మణ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు మంచి కామెడీని పండించాయి. దివ్య పిళ్లై సినిమాను సమూలంగా మార్చే పాత్రలో అద్బుతంగా రాణించారు. అజ్మల్ అమర్ అతిథి పాత్రకే పరిమితమయ్యారు.
మంగళవారం సినిమా ఫెర్ఫార్మెన్స్‌కు ఎంత బలంగా నిలిచిందో.. సాంకేతికంగా అంతకు రెండింతలు ఈ సినిమాలో భాగస్వామ్యమైంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ప్రతీ ఫ్రేమ్‌ను హైలెట్ చేసేలా, ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇచ్చేలా మ్యూజిక్ అందించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి మరో హైలెట్. ప్రతీ ఫ్రేమ్‌ను విజువల్ ట్రీట్‌గా మార్చారు. తల్లూరి కృష్ణ ఆర్ట్ విభాగం పనితీరు, గుల్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ సినిమాను ఎక్సలెంట్‌గా మార్చారు. నిర్మాతలు సురేష్ వర్మ, స్వాతి అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను విజువల్ ఫీస్ట్‌గా మార్చాయని చెప్పవచ్చు.
హైపర్ సెక్స్ డిజార్డర్ (HSD) అనే మానసిక, లైంగిక రుగ్మత ఆధారంగా రూరల్, రస్టిక్ డ్రామా మంగళవారం. స్క్రిప్ట్ పరంగా కొన్ని లోపాలు, లాజిక్‌కు దూరంగా ఉన్నా.. మేకింగ్, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ వల్ల అవన్నీ కనిపించుకుండా పోయాయి. డైరెక్టర్ బ్రిల్లియంట్ మేకింగ్, పాయల్, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్, అజనీష్ మ్యూజిక్, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ పాయింట్స్. అనుక్షణం కొత్త అనుభూతి, థ్రిల్లింగ్‌గా అనిపించే ట్విస్టులు ఈ సినిమాకు బలంగా నిలిచాయని చెప్పవచ్చు. థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా థియేటర్‌లో ఫీల్ అయ్యే సినిమాపై ఎలాంటి అంచనాలతో వెళ్లినా ఓ మంచి అనుభూతిని తప్పకుండా పొందుతారు.


Click it and Unblock the Notifications











