Good Night Review: 'గురక' జీవితాన్ని శాసిస్తే.. ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ 'గుడ్ నైట్' రివ్యూ

రేటింగ్: 2.75/5

టైటిల్: గుడ్ నైట్
నటీనటులు: మణికందన్, మీతా రఘునాథ్, రమేష్ తిలక్, రేచల్ రెబెకా, బాలాజీ శక్తివేల్, భగవతి పెరుమాళ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జయంత్ సేతు మాధవన్
ఎడిటర్: భరత్ విక్రమన్
సంగీతం: సీన్ రోల్డన్
నిర్మాతలు: యువరాజ్ గణేశన్, మహేశ్ రాజ్ పసిలన్, నజీరత్ పసిలన్
కథ, దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్
ఓటీటీ విడుదల తేది: జూలై 3, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

హీరోకు ఒక లోపం ఉండే కథతో వచ్చిన సినిమాలు కొన్ని హాయిగా నవ్విస్తే.. మరికొన్ని అరే ఏంట్రా ఇది అనేలా చేస్తాయి. తెలుగులో వచ్చిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు పర్వాలేదనిపించగా.. హీరోకు నత్తి పెట్టి పూరీ జగన్నాథ్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అయితే తాజాగా హీరోకు గురక సమస్యను పెట్టి తెరకెక్కించిన ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ గుడ్ నైట్ (Good Night). తెలుగు, తమిళం, కన్నడ, మలాయళం, హిందీ భాషల్లో జూలై 3న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో విడుదలైన గుడ్ నైట్ సినిమా (Good Night Movie Review Telugu) ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: మధ్యతరగతి యువకుడైన మోహన్ (మణికందన్) సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. అతనికి బిగ్గరగా గురక పెట్టే సమస్య ఉంటుంది. ఆ గురక దెబ్బకు మోహన్ ప్రేమించిన అమ్మాయి లవ్ రెజెక్ట్ చేసి పారిపోతుంది. లవ్ ఫెయిల్యూర్ బాధలో ఉన్న మోహన్ కు అను (మీతా రఘునాథ్) పరిచయం అవుతుంది. పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటారు మోహన్, అను. ఫస్ట్ నైట్ రోజు మోహన్ కు గురక ఉందనే విషయం అనుకు తెలుస్తుంది. తర్వాత మోహన్-అను జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? గురక వల్ల వారి బంధంలో ఎలాంటి మార్పులు జరిగాయి? తలెత్తిన సమస్యలను పరిష్కరించగలిగారా? చివరికీ ఏం జరిగింది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే గుడ్ నైట్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: ప్రతి మనిషికి ఏదో ఒక లోపం, సమస్య ఉండటం సహజమే. కానీ, వాటి తీవ్రతను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. మనకున్న లోపాలను, పర్సనల్ సమస్యలను యాక్సెప్ట్ చేసి ముందుకు సాగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమని చెప్పే సినిమానే గుడ్ నైట్. మూవీలో మోహన్ కు గురక సమస్య ఉండటం, దాని వల్ల అతనికి జరిగే అవమానాలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి గురక ఉందని తెలిసిన అమ్మాయి అను ఎలా రిసీవ్ చేసుకుంది అనే అంశాలతో కామెడీగా, ఎమోషనల్ గా చూపించారు డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖర్.

Good Night Movie Review

అదే మైనస్ : మోహన్ కు గురక సమస్యతో స్టార్ట్ చేసి కథలోకి తీసుకెళ్లారు. ఎప్పుడు కంగారు పడే మోహన్ కు ఉన్న గురక ద్వారా కామెడీ జెనరేట్ చేశారు. ఇక ఇంట్రావర్ట్, అమాయకపు అకౌంటెంట్ గా అను క్యారెక్టర్ బాగుంది. వీరి ఇద్దరి పరిచయంతో మూవీ ఇంకాస్తా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. డైలాగ్స్ లేకుండా ఎక్స్ ప్రెషన్స్ తోనే నవ్వించే సీన్లు ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా బాగానే ఉన్నా సెకండాఫ్ లో కాస్తా ల్యాగ్ అయింది.

Good Night Movie Review

క్లైమాక్స్ ట్విస్ట్: గురక తగ్గడం కోసం మోహన్ చేసే ప్రయత్నాలు రిపీట్ గా రావడం వంటి కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి. సినిమాలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉండే హరాస్ మెంట్, మధ్య తరగతి ఇళ్లల్లో పట్టించుకునే మూఢచారాలు వంటివి లైట్ గా టచ్ చేశారు. దాదాపుగా సీన్లన్నీ గెస్ చేయొచ్చు. ఇక క్లైమాక్స్ ఊహించినట్లుగానే ఉంటుంది. కానీ అక్కడ వచ్చే కామెడీ ట్రాక్ మాత్రం నవ్విస్తుంది. క్లైమాక్స్ కు 20 నిమిషాల ముందు వచ్చే సీన్ ఎమోషనల్ గా హత్తుకుంటుంది.

Good Night Movie Review

సాంకేతిక అంశాలు: పాటలు సినిమా చూస్తున్నంతసేపు బాగుంటాయి. కానీ తర్వాత ఒక్కపాట గుర్తుండదు. బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, సాంకేతిక, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కు కాస్తా పని చెప్పాల్సింది. కానీ ఎమోషన్ క్యారీ అవ్వడానికి అన్నట్లుగా సీన్స్ పెట్టినట్లు అనిపించింది. కానీ సినిమా పూర్తయ్యక మాత్రం మంచి ఫీలింగ్ వస్తుంది.

Good Night Movie Review

ఎవరెలా చేశారంటే?: మోహన్ పాత్రలో మణికందన్ ఆకట్టుకున్నాడు. కామెడీ, ఎమోషనల్ సీన్లలో మెస్మరైజ్ చేశాడు. ఇంట్రావర్ట్ అమ్మాయిగా మీతా రఘునాథ్ గుర్తుండిపోయేలా నటించింది. మణికందన్, మీతాలను హీరో హీరోయిన్లుగా ఎక్కడా చూస్తున్నట్లుగా కానీ, సినిమాలా అనిపించదు. ఆ పాత్రలతో మనం ట్రావెల్ అయ్యేలా చేశారు. ఇక హీరో బావగా రమేష్ తిలక్ కామెడీతో అలరించాడు. మిగతా అంతా బాగా చేశారు.

ఫైనల్ గా చెప్పాలంటే? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్నట్లుగా పరిచయమైన మోహన్-అను పాత్రలతో క్లైమాక్స్ కు వచ్చేసరికి మనం కూడా ప్రేమలో పడిపోతాం. చాలా నీట్ గా కుటుంబంతో కూర్చుని చూసే ఫ్యామిలీ, కామెడీ అండ్ ఎమోషనల్ సినిమా గుడ్ నైట్. వీకెండ్ లో చూసేందుకు గుడ్ నైట్ మంచి ఆప్షన్. (Good Night Review)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X