For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన్మథుడు 2 రివ్యూ అండ్ రేటింగ్

|
Manmadhudu 2 Movie Review And Rating || మన్మథుడు 2 రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Rating:
2.5/5
Star Cast: నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తీ సురేష్, వెన్నెల కిషోర్
Director: రాహుల్ రవీంద్రన్

2002లో మన్మథుడు సినిమాను దర్శకుడు విజయ్ భాస్కర్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సమయంలో మాటల గారడీ చేశారు. సొనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్వీక్వెల్‌గా రూపొందిన మన్మథుడు 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంలో కోడలు సమంత, మరో హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18, మనంపై రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిందవి. నాగార్జునకు కెరీర్‌లో మళ్లీ మన్మథుడు లాంటి సక్సెస్ చేరిందా? రకుల్ గ్లామర్ పరంగా ఎలా ఆకట్టుకొనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

మన్మథుడు 2 స్టోరి

మన్మథుడు 2 స్టోరి

పోర్చుగీసులో స్థిరపడిన కుటుంబానికి చెందిన సాంబశివరావు అలియాస్ సామ్ (నాగార్జున) ప్లే బాయ్. జీవితాన్ని శృంగారమయం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. వయసుపై పడినా పెళ్లి చేసుకోలేదనే బెంగ తల్లి, అక్కా చెల్లల్లను (లక్ష్మీ, ఝాన్సీ, దేవ దర్శిని) వెంటాడుతుంటుంది. ఎలాగైనా సామ్‌కు పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తారు. ఈ క్రమంలో పెళ్లిని తప్పించుకోవడానికి లవర్‌గా నటించమని అవంతిక (రకుల్‌ ప్రీత్ సింగ్)తో కాంట్రాక్టు చేసుకొంటాడు.

 మన్మథుడు 2 ట్విస్టులు

మన్మథుడు 2 ట్విస్టులు

కాంట్రాక్టు లవర్‌గా ఇంట్లోకి అడుగుపెట్టిన అవంతిక వేసిన ఎత్తులు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి. సాంబశివ రావు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేమిటి? అవంతిక జీవితంలో చోటు చేసుకొన్న విషాద పరిస్థితులు ఏమిటి? అవంతిక కాంట్రాక్టు లవర్‌గా ఎందుకు ఒప్పుకొన్నది. చివరకు సాంబశివ రావు పెళ్లి జరిగిందా? అవంతిక జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలకు పరిష్కారం లభించిందా అనే ప్రశ్నలకు సమాధానమే మన్మథుడు 2 సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

మన్మథుడు పోర్చుగీసులో స్థిరపడిన కసాంధ్రా అనే తెలుగు వారి చరిత్రతో మొదలవుతుంది. ఫెర్ఫ్యూమ్ వ్యాపారి అయిన సాంబశివరావు అమ్మాయిలతో సరదాగా జీవితాన్ని ఆస్వాదించే అంశాలతో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం చకచక జరిగిపోతాయి. కథ, కథనాల్లో బలం లేకపోవడం వల్ల సినిమాను ముందుకు తోసుకెళ్లే భారాన్ని సామ్ స్నేహితుడు వెన్నెల కిషోర్‌పై పడేశారా? అనే అనుమానం కలుగుతుంది. దీంతో అడపాదడపా హస్యపు సన్నివేశాలతో సాగిపోతుంది. కథలోకి అద్దె లవర్‌గా అవంతిక ప్రవేశించడంతో కొంత సీరియస్‌ కనిపిస్తుంది. ముందుగా చెప్పినట్టే బలమైన సన్నివేశాలకు చోటు లేకపోవడం సాదాసీదాగా ఇంటర్వెల్ కార్డు వేసి తొలిభాగాన్ని ముగించే ప్రయత్నం కనిపిస్తుంది.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక రెండో భాగంలో కూడా కథ, బలమైన సన్నివేశాలు లేకుండా కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు వెన్నెల కిషోర్ హాస్యాన్ని ప్రధానంగా చేసుకొని సినిమాను నెట్టుకొచ్చే ప్రయత్నం చేసినట్టు అర్ధమవుతుంది. ఇక రెండో భాగంలో చివర్లో వచ్చే లక్ష్మీపై ఉండే ఎమోషనల్ సీన్లు కొంత రిలీఫ్‌గా అనిపిస్తాయి. సినిమా మొత్తంలో ఎక్కడా భావోద్వేగాలు పడినట్టు కనిపించకపోవడం సినిమాకు ప్రధాన లోపంగా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. రెండో భాగంలో కూడా సినిమాను నిలబెట్టే సన్నివేశాలు లేకపోవడంతో మన్మథుడు 2 ఓ నాసిరకమైన ప్రయత్నంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్

దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్

నటుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చిలసౌ సినిమాతో అందర్నీ ఆకట్టుకొన్నాడు. ఇక 17 ఏళ్ల క్రితం మన్మథుడు సినిమా టైటిల్‌తో సినిమా, ఆపై నాగార్జునతో ప్రాజెక్ట్ అనగానే మరో ఫీల్‌గుడ్ సినిమా రావడం ఖాయమనే అభిప్రాయం ఏర్పడింది. అయితే మన్మథుడు 2 సినిమా విషయానికి వస్తే బలమైన కథ లేకుండానే బరిలోనికి దిగినట్టు కనిపించింది. మన్మథుడు టైటిల్ అనేగానే పోలికలు సహజం. అలాంటి అంచనాలను అధిగమించాలంటే డైలాగ్స్, కథనం మరింత బలంగా ఉంటాయనే ఫీలింగ్ కలుతుంది. అలాంటివేమీ లేకుండానే రాహుల్ రెండో ప్రయత్నాన్ని భుజానకెత్తుకున్నట్టు కనిపిస్తుంది. నాగార్జున ఇమేజ్‌కు దూరంగా సినిమాను తెరకెక్కించడమే తొలి తడబాటు అనే భావన కలుగుతుంది. దర్శకుడిగా రాహుల్ తన మార్కును చూపించలేకపోయారనే చెప్పాల్సి ఉంటుంది.

మన్మథుడిగా అక్కినేని నాగార్జున

మన్మథుడిగా అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున పేరు వినగానే టాలీవుడ్ మన్మథుడు అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. మన్మథుడు సినిమా చూసిన తర్వాత ఆ విషయంలో కొన్ని సందేహాలు తలెత్తుతాయి. నటనపరంగా ఎలాంటి సందేహాలు వద్దు. కానీ లుక్ పరంగా ఎక్కడా తగిన శ్రద్ధ చూపించినట్టు తెరపైన కనిపించదు. క్యాస్టూమ్స్ విషయంలోనూ అదే తీరు కనిపించింది. వయసు మళ్లీన పాత్ర కాబట్టి అలా చేశామని చెబితే అది నమ్మశక్యంగా అనిపించదు. కెరీర్ పరంగా నాగార్జున తన అభిమానులకు ముఖ్యంగా మహిళాభిమానులను మరోసారి నిరాశ పరిచారనే చెప్పవచ్చు.

సత్తా చాటిన రకుల్ ప్రీత్ సింగ్

సత్తా చాటిన రకుల్ ప్రీత్ సింగ్

స్వతంత్ర భావాలున్న యువతి పాత్ర అవంతికగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. ఈ సినిమాలో ఏదైనా గొప్పగా చెప్పాలనుకొంటే అవంతిక పాత్ర గురించే చెప్పుకోవాలి. రకుల్ ప్రీత్ సినిమాను రెండో భాగంలో తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు. గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రకుల్ పాత్రను దర్శకుడు బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ద్వారా మరోసారి రకుల్ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేసింది.

ఇతర పాత్రల్లో కీర్తి, సమంత

ఇతర పాత్రల్లో కీర్తి, సమంత

ఇక మిగితా పాత్రల్లో నాగార్జున మొదటి ప్రేయసిగా కీర్తి సురేష్, అవసరం లేని అతిథి పాత్రలో సమంత మెరిసింది. ఇక సీనియర్ నటి లక్ష్మీ, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు సినిమాకు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఎక్కడో కొడుతుందంటూ తన మార్కు డైలాగ్‌తో రావు రమేష్ ఆకట్టుకొన్నాడు. ఇక వెన్నెల కిషోర్ సినిమాకు ప్రధాన బలం. సినిమా ఓ మాదిరిగా ఎంజాయ్ చేయడానికి ఈ కిషోరా మాగ్జిమమ్ కృషి చేశాడు. మిగితా పాత్రలు అంతగా చెప్పుకొనే రేంజ్‌లో లేవనే చెప్పాలి.

 సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ గురించి

సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ గురించి

టెక్నికల్ విషయానికి వస్తే.. పోర్చుగల్ అందాలను సినిమాటోగ్రాఫర్ సుకుమార్ చక్కగా తెరకెక్కించారు. ఆర్ట్ విభాగం పనితీరు కూడా బాగుంది. దాంతో ప్రతీ ఫ్రేమ్ రిచ్ లుక్‌తో కనిపించేలా సుకుమార్ పనితీరు ఉంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, చోట కే ప్రసాద్, బీ నాగేశ్వరరెడ్డి జంటగా కత్తెర్లు వేశారు. నాసిరకంగా ఉండే సీన్లను కూడా చాలా షార్ప్‌గా ఉండేలా చేశారు. ఎక్కడా సాగదీత కనిపించలేదు. సన్నివేశాల బలహీనతను తమ ఎడిటింగ్‌తో సరిదిద్దారనే ఫీలింగ్ కలుగుతుంది.

మ్యూజిక్ గురించి

మ్యూజిక్ గురించి

ఇక మన్మథుడు 2 సినిమాకు మరో మైనస్ మ్యూజిక్. RX 100తో ఆకట్టుకొన్న చైతన్ భరద్వాజ్ ఈ సారి పేలవమైన పాటలను అందించాడు. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే అక్కడకక్కడా బలంగా పేలాయి.. కొన్ని చోట్ల తుస్ మనిపించాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కావాల్సిన మాటలు లేకపోవడంతో సన్నివేశాలు రక్తికట్టించలేకపోయాయని ఫీలింగ్ కలుగుతుంది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

మన్మథుడు 2 ఓ పెళ్లి కాని ప్రసాదు కథ. అయితే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, కథ, కథనాలపై కసరత్తు లేకుండా చేసిన ప్రయత్నంగా రూపొందిందని గట్టిగా చెప్పవచ్చు. మన్మథుడు సినిమాలో నాగార్జున లుక్ హైలెట్. ఇక మన్మథుడు 2 సినిమాకు వస్తే ఆ విషయమే మైనస్‌గా మారింది. మన్మథుడులో డైలాగ్స్ ఓ బలం. ఈ సినిమాలో డైలాగ్సే బలహీనతగా మారిందనే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా వెన్నెల కిషోర్ హాస్యం తప్ప ఏ రకంగా ఆకట్టుకొలేని సినిమాగా తెరకెక్కించారనే అభిప్రాయం కలుగుతుంది. ఓవర్సీస్, మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు చేరువైతే ఈ సినిమా కమర్షియల్‌గా నిలబడుతుంది. ఈ సినిమా విజయం ఏ రేంజ్ అనేది తెలియాలంటే వారాంతం ఆగితే తెలుస్తుంది.

 బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

రకుల్ ప్రీత్ ఫెర్ఫార్మెన్స్

వెన్నెల కిషోర్ కామెడీ

మైనస్ పాయింట్స్

కథ, కథనాలు

మాటలు, పాటలు

పేలవమైన సన్నివేశాలు

ఎమోషన్స్ లేని కంటెంట్

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తీ సురేష్, సమంత, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

కథ సహకారం: కిట్టు వాస్సాప్రగడ

స్క్రీన్ ప్లే సహకారం: సత్యానంద్

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రాఫర్: ఎం సుకుమార్

ఎడిటర్: నాగేశ్వర్‌రెడ్డి బీ

బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18, మనం

రిలీజ్ డేట్: 2019-08-09

English summary
Manmadhudu 2Shoot of King Nagarjuna's 'Manmadhudu 2' started today. Film is being Produced by Akkineni Nagarjuna, P. Kiran on Manam Enterprises, Anandi Art Creations banners Directed by Rahul Ravindran. Senior writer Satyanand handed over the Script to Director Rahul Ravindran. This movie is released on August 9th.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more