Banda Review: దొంగ బాబాజీపై పోరాటం.. హైలెట్‌గా మనోజ్ నటన.. 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' రివ్యూ

రేటింగ్: 3/5

టైటిల్: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
నటీనటులు: మనోజ్ బాజ్ పాయ్, అద్రిజ సిన్హా, సూర్య మోహన్ కుల శ్రేష్ట, ప్రియాంక సీతియా, విపిన్ శర్మ, నిఖిల్ పాండే, జైహింద్ కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అర్జున్ కక్రీతి
ఎడిటింగ్: సుమీత్ కోటియాన్
సంగీతం: సంగీత్ సిద్ధార్థ్
కథ: దీపక్ కింగ్రాని
నిర్మాతలు: కమలేష్ భనుషాలి, వినోద్ భనుషాలి, విశాల్ గుర్నాని
దర్శకత్వం: అపూర్వ సింగ్ ఖర్కీ
ఓటీటీ విడుదల తేది: జూన్ 7, 2023
ఓటీటీ వేదిక: జీ5

సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ అందుకు భిన్నంగా నేరుగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' (Sirf Ek Bandaa Kaafi Hai). కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మొదటగా జీ5 వేదికగా మే 23న హిందీలో రిలీజే చేశారు.

Manoj Bajpayee Sirf Ek Bandaa Kaafi Hai Movie Review And Rating In Telugu

ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో ముంబయిలోని బోరివాలి, బాంద్రా, డోంబివిలి ప్రాంతాల్లోని థియేటర్లలో జూన్ 2న విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళంలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో (Sirf Ek Bandaa Kaafi Hai Telugu Review) చూద్దాం.

కథ: ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు ఆరాధించే బాబాజీ (సూర్య మోహన్ కుల శ్రేష్ట) తనను లైంగికంగా వేధించాడని మైనర్ బాలిక 'ను సింగ్' (అద్రిజ సిన్హా) పోలీసు స్టేషన్ లో కేసు పెడుతుంది. బాబాజీని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. 'ను సింగ్' తరఫున వాదించేందుకు లాయర్ పీసి సోలంకి (మనోజ్ బాజ్ పాయ్)ని కలుస్తారు.

'ను' కేసు వాదించేందుకు సిద్ధమైన పీసీ సోలంకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బాబాజీని కాపాడుకునేందుకు అతని గ్యాంగ్ చేసిన అరాచకాలు ఏంటీ? అసలు లాయర్ సోలంకినే వాదించమని బాలిక తండ్రికి పోలీసు అధికారిణి ఎందుకు చెప్పింది? ఈ కేసులో పీసీ సోలంకి గెలిచాడా? 'ను సింగ్'కు ఎన్నేళ్లకు న్యాయం జరిగింది? అనే అంశాలు తెలియాలంటే 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' చూడాల్సిందే

Manoj Bajpayee Sirf Ek Bandaa Kaafi Hai Movie Review And Rating In Telugu

విశ్లేషణ: 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' అంటే తెలుగులో 'కేవలం ఒక వ్యక్తి చాలు'. పోక్సో చట్టంలో నిందితుడికి శిక్ష పడేందుకు లైంగిక దాడి జరిగిన బాధితురాలు ఒక్కరు కోట్లు మెట్లు ఎక్కి చెబితే చాలు అని టైటిల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. వకీల్ సాబ్, జై భీమ్, వ్యవస్థ వెబ్ సిరీస్ తరహాలోనే ఇదొక కోర్డ్ రూమ్ డ్రామా. 2013లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆశారాం బాపు కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 'ను సింగ్' అనే మైనర్ బాలిక బాబాజీ తనను లైంగికంగా వేధించాడని కేసు పెట్టే తొలి సన్నివేశంతో నేరుగా కథలోకి తీసుకెళ్తారు.

ఆసక్తికర అంశాలు: మైనర్ బాలికకు పరిస్థితులు అనుకూలించని సమయంలో లాయర్ పీసీ సోలంకి ఎంట్రీతో కథ ఆసక్తిగా మారుతుంది. 2012లో అమలు చేసిన పోక్సో చట్టం నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన చర్యలు, చట్టం అవశ్యకత, అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది వంటి విషయాలను క్లుప్తంగా సినిమాలో హైలెట్ చేసి వివరించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు, బెయిల్ కోసం బాబాజీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించారు. మైనర్ బాలికను మేజర్ అని చూపించేందుకు చేసిన ప్రయత్నాలు సోలంకి ఎలా తిప్పికొట్టాడో ఆసక్తిగా ఉంటుంది.

Manoj Bajpayee Sirf Ek Bandaa Kaafi Hai Movie Review And Rating In Telugu

క్లైమాక్స్ అలా: హత్యలకు సాధారణ వ్యక్తిలా భయపడే సోలంకి బాలికకు న్యాయం చేయాలనే తపన, డైలాగ్స్ మెప్పిస్తాయి. ఎలాంటి మలుపులు లేకుండా ప్లాట్ గా కథ సాగిన కూడా ఆకట్టుకుంటుంది. సీరియస్ గా సాగే డ్రామాలో మనోజ్ బాజ్ పాయ్ హావా భావాలు, నటన అక్కడక్కడ నవ్వు తెప్పించి రిలాక్స్ చేస్తాయి. క్లైమాక్స్ లో మనోజ్ బాజ్ పాయ్ నటన హైలెట్ గా నిలుస్తుంది. అయితే తెలుగు డబ్బింగ్ లో చూస్తే ఆ ఫీల్ రాదు. హిందీలో చూస్తేనే కనెక్ట్ కాగలం. బాబాజీ తరఫున వినిపించే వాదనలు బలంగా ఉండవు. అవి కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే మూవీ మరో లెవెల్ లో ఉండేది.

Manoj Bajpayee Sirf Ek Bandaa Kaafi Hai Movie Review And Rating In Telugu

ఎవరెలా చేశారంటే?: మనోజ్ బాజ్ పాయ్ నటన ఎంత చెప్పిన తక్కువే. లాయర్ గా, బిడ్డకు తండ్రిగా, తల్లికి కొడుకుగా, మర్డర్స్ జరిగేటప్పుడు భయపడే సాధారణ వ్యక్తిగా ఒదిగిపోయారు. నిజానికి మనోజ్ బాజ్ పాయ్ ది వన్ మ్యాన్ షో. ఇక తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం తెలియని మిగతా పాత్రలు న్యాయం చేశాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు, సంగీత అంతా బాగున్నాయి.

Manoj Bajpayee Sirf Ek Bandaa Kaafi Hai Movie Review And Rating In Telugu

ఫైనల్ గా చెప్పాలంటే?: రెండు గంటల నిడివి ఉన్న 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ఎలాంటి మలుపులు లేకుండా సాగినా ఆకట్టుకుంటుంది. అపూర్వ సింగ్ ఖర్కీ, మనోజ్ బాజ్ పాయ్ నటన, పోక్సో చట్టం ఇంపార్టెన్స్ కోసం ఈ కోర్ట్ రూమ్ డ్రామాను సమయం చూసుకుని వీక్షించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X