twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంత్ర-సినిమా సమీక్ష

    By Staff
    |

    Mantra
    నటీనటులు-చార్మీ, శివాజీ, చిత్రం శ్రీను, యాంకర్ విజయ్, కౌష తదితరులు.
    మాటలు-సురేంద్ర కృష్ణ, రవి కొలికపూడి
    సంగీతం-ఆనంద్
    సమర్పణ-ఉమాప్రకాష్
    నిర్మాతలు-సిహెచ్.కళ్యాణ్ రామ్, రవిప్రకాష్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-ఓషో తులసిరామ్
    పతాకం-జెనరేషన్ నెక్ట్స్ మూవీస్
    విడుదల-14-12-2007

    చానాళ్లుగా ఎదురుచూస్తున్న చార్మీ సినిమా మంత్ర ఎట్టకేలకు విడుదల అయింది. పోయిన సంవత్సరం అక్టోబర్ 27న ప్రారంభం అయిన ఈ సినిమా పలు ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ ఇబ్బందులతో అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎలాగైతేనేమీ విడుదల అయింది. చార్మీ కోసమే అన్నట్టుగా రూపొందిన ఈ సినిమాకు ఆమె సినిమా కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సినిమా తుది కంటా సస్పెన్స్ ను కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించాడు. రీ-రికార్డింగ్ కూడా ఈ సినిమాకు ప్రత్యేకతను సంతరింపచేసింది.

    మంత్ర(చార్మీ)కి నగర శివార్లలో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. తనను మోసం చేసినా పలువురికి సాయపడే తత్వం ఆమె తండ్రిది. ఈ సాయపడే తత్వమే ఆయనను అప్పుల ఊబిలోకి నెడుతుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఆయన చనిపోతాడు. మంత్ర నిలయం పేరుతో ఉన్న ఫామ్ హౌస్ ను అమ్మి తన తండ్రి చేసిన అప్పులు తీరుస్తానని మంత్ర అందరికీ చెబుతుంది. అయితే అంతదాకా ఆ పౌమ్ హౌస్ లో నివాసమున్న ముగ్గురు విచిత్ర పరిస్థితులలో మరణించడంతో ఆ ఫామ్ హౌస్ కు దయ్యాల మేడ అనే పేరు వస్తుంది. ఈ పేరు ఉండడంతో ఫామ్ హౌస్ ను కొనడానకి ఎవరూ ముందుకు రారు. మంత్ర తండ్రికి అప్పు ఇచ్చిన వ్యక్తి స్థానిక గూండాను కలిసి డబ్బు తిరిగి వచ్చేలా చూడాలని కోరతాడు. ఆ గూండా డబ్బు రికవరీ కోసం హీరో (శివాజీ)ని పంపుతాడు. ఫామ్ హౌస్ అమ్ముడుపోగానే డబ్బు చెల్లిస్తానని చెబుతుంది. హీరో కూడా ఫామ్ హౌస్ ను అమ్మడానికి సాయం చేస్తానని మాట ఇస్తాడు. అందుకు కమిషన్ ముట్టచెబుతానని మంత్ర హీరోకు చెబుతుంది. హీరో తనన ముగ్గరు మిత్రులతో కలిసి ఫామ్ హౌస్ కు వెళతాడు. అక్కడికి వెళ్లిన తరువాత హీరో మిత్రుడు మునుస్వామి(చిత్రం శ్రీను) అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతాడు. ఇందుకు బెదరని హీరో దీని వెనకాల ఉన్న రహస్యాన్ని కనుగొనాలని సిద్ధపడతాడు. దీన్ని చాలెంజ్ గా తీసుకుంటాడు. హీరోకు సాయం చేయడానికి మాణిక్యం(జీవా)అనే వ్యక్తి కలుస్తాడు. అయితే కొద్దిరోజులకే దయ్యం ఉందని భయపడి పారిపోతాడు. ఇది ఇలా ఉండగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి ఒక ప్రొఫెసర్ ఫామ్ హౌస్ కొంటాడని మంత్రాకు ఫోన్ వస్తుంది. మరోవైపు మంత్ర స్నేహితురాలు తీవ్ర గాయాలపాలై ఫామ్ హౌస్ బిల్టింగ్ కనిపిస్తుంది. ఆమెను హీరో ఆసుపత్రిలో చేరుస్తారు. హీరో వెను తిరిగి వచ్చే సమయానికి మంత్రను చంపడానికి ప్రయత్నిస్తూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయనెవరో కాదు..హత్యలకు ముందు ఇదే బిల్డింగ్ లో రెంటుకున్న వ్యక్తి బావమరిది. ఆ తరువాత ఏమైందన్నది తెరమీదే చూడాలి.

    స్క్రిప్ట్ పక్కాగా ఉంది. స్క్రీన్ ప్లే, రీ-రికార్డింగ్ లు అద్భుతం. చార్మీ ప్రతిభ, శివాజీ మాస్ హీరో యాక్షన్ సినిమాకు వన్నె తెచ్చాయి. రొటిన్ సినిమాలకు ఇది కచ్చితంగా భిన్నమైన సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాను చూస్తున్నంతసేపు హాలీవుడ్ సినిమాను వీక్షిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడిగా ఓషో తులసిరామ్ తన సత్తా చాటుకున్నాడు. స్సస్పెన్స్ తుదికంటా కొనసాగడంతో ప్రేక్షకులు మునివేళ్ల మీద కూర్చునేలా చేస్తాయి. చార్మీ పై చిత్రీకరించిన పాప్ సాంగ్ చాలా బావుంది. సినిమా ఆద్యంతం చార్మీ తన చేస్టలతో ఆకట్టుకుంది. సినిమాలో ఏదైనా బాలేదు అంటే అది సస్పెన్సే. ఆద్యంతం దర్శకుడు సస్పన్స్ మీదే దృష్టి పెట్టడంతో సినిమాలో వినోదం లేకుండా పోయింది. ఇదే కాస్తా బోర్ కొట్టించే అంశం.

    శంషాబాద్ లో వేసిన మంత్రా నిలయం సెట్ లోనే సినిమా షూటింగ్ మొత్తం జరిగింది. అనుకోకుండా ఒక రోజు తరువాత చార్మీ ఈ సినిమాలో మార్కులన్నీ కొట్టేసింది. సినిమాను రక్తి కట్టించింది. పాటలో కనిపించిన కౌష సెక్సీగా కనిపించింది. ఈ సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. విడుదల అయిన థియేటర్లన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. టికెట్లు బ్లాక్ లో కూడా అమ్ముడయ్యాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X