For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మను’ మూవీ రివ్యూ, రేటింగ్

  By Bojja Kumar
  |
  Manu Movie Review | మను సినిమా రివ్యూ | Phanindra Narsetti | Chandini Chowdary

  Rating:
  1.5/5
  Star Cast: రాజా గౌతమ్, చాందినీ చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌
  Director: ఫణీంద్ర నార్శెట్టి

  తెలుగు సినిమా పరిశ్రమలో రోటీన్ సినిమాలకు మెల్లిమెల్లిగా కాలం చెల్లుతూ కొత్తదనంతో కూడిన, ప్రయోగాత్మక కథలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్న ఈ రోజుల్లో చాలా మంది కొత్త దర్శకులు తమ టాలెంటుకు పదును పెడుతూ సరికొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నార్శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'మను'. ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఫణీంద్ర షార్ట్ ఫిల్మ్ నచ్చి 115 మంది ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. క్రౌడ్ ఫండింగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మను'లో ఏముంది? దర్శకుడు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఓ లుక్కేద్దాం.

  కథ విషయానికొస్తే...

  కథ విషయానికొస్తే...

  మను(రాజా గౌతమ్) ఒక పేయింటర్. అతడి పేయింటింగ్స్‌కు వీరాభిమాని అయిన నీల(చాందినీ చౌదరి) ఓ బార్లో అతడిని కలుస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల మనును నీల అపార్థం చేసుకుంటుంది. అతడిని ఛీ కొట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత తన తప్పు తెలుసుకుని అతడిపై ప్రేమ పెంచుకుంటుంది. మరో వైపు ఓ వజ్రాల వ్యాపారి తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగికి విలువైన వజ్రాన్ని కానుకగా ఇస్తారు. అమర్, అక్బర్, ఆంటోనీ దాన్ని కొట్టేయాలని చూస్తారు. మరి మను, నీల ప్రేమ కథకు....ఈ వజ్రానికి లింక్ ఏమిటి? ఆ వజ్రం వీరి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేది తర్వాతి కథ.

   పెర్ఫార్మెన్స్

  పెర్ఫార్మెన్స్

  మనుగా రాజా గౌతమ్ పర్వాలేదనిపించాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. భవిష్యత్తులో మను పాత్ర అంటే రాజా గౌతమ్ గుర్తుకు వచ్చేంత స్థాయిలో అయితే లేదు. నీల పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. క్యూట్‌గా కనిపించడంతో పాటు ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు తమ తమ పాత్రలకు బాగా సెట్టయ్యారు.

   టెక్నికల్ అంశాల పరంగా

  టెక్నికల్ అంశాల పరంగా

  సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ కంటే టెక్నికల్ అంశాలే బాగా హైలెట్ అయ్యాయి. థ్రిల్లర్ సినిమాలకు కెమెరా, మ్యూజిక్ అనేవి చాలా కీలకం. విశ్వనాథ్‌ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి సచిన్ సుధాకరన్, హరిహరన్ సౌండ్ డిజైన్ చేశారు. నరేష్‌ కుమారన్‌ సంగీతం అందించారు. సంగీతం, సౌండ్ డిజైన్ సినిమాకు ప్రాణం తెచ్చాయి. ఆర్ట్ డైరెక్టర్ శివ్‌కుమార్‌ పనితనం కూడా చాలా బావుంది. అయితే ఎడిటింగ్ చాలా పూర్‌గా... అనవసర సీన్లు చాలా ఉన్నాయి. సినిమాను ఓ అరగంట ట్రిమ్ చేస్తే ఇంకాస్త బావుండేదేమో?

  స్క్రీన్ ప్లే

  స్క్రీన్ ప్లే

  కథ ఎలా ఉన్నా సినిమా ప్రేక్షకులకు నచ్చడం, నచ్చక పోవడం అనేది స్క్రీప్లే మీద ఆధారపడి ఉంటుంది. ‘మను' లాంటి థ్రిల్లర్ సినిమాలకు స్క్రీప్లే ఎంతో ముఖ్యం. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే... రొటీన్ సినిమాకు భిన్నంగా ఉంది. అయితే ఈ భిన్నత్వం మరీ ఎక్కువైతే అదే సినిమాకు పెద్ద మైనస్‌గా మారుతుంది. ‘మను' సినిమా విషయంలో అదే జరిగింది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే స్థాయిలో భరించలేనంతగా నేరేషన్ స్లోగా ఉండటం కూడా పెద్ద మైనస్.

  కన్ ఫ్యూజన్ మరీ ఎక్కువైంది

  కన్ ఫ్యూజన్ మరీ ఎక్కువైంది

  ప్రేక్షకులను థ్రిల్ చేయడం అంటే వారిని సినిమా అర్థం కాకుండా ఏం జరుగుతుందో అని జుట్టు పీక్కునేలా చేయడం కాదు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సినిమా మొదలై గంటసేపయినా అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ప్రేక్షకుడు ఉండిపోయేలా చేయడం చూసే వారికి ఇబ్బందికర అంశమే.

  డైరెక్షన్ ఎలా ఉంది

  డైరెక్షన్ ఎలా ఉంది

  ఫణీంద్ర నార్శెట్టి పని తనం చూస్తుంటే మంచి విషయం ఉన్నోడే అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ.... తొలి సినిమా కావడం వల్లనో? ఇంకేంటో తెలియదు కానీ తనలో ఎంత టాలెంట్ ఉందో అంతా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులపై గుమ్మరించే ప్రయత్నం చేశారు. దీంతో అనవసరమైన సీన్లు, సీక్వెన్సులు ఎక్కువయ్యాయి.

  ఫస్టాఫ్, సెకండాఫ్

  ఫస్టాఫ్, సెకండాఫ్

  ‘మను' మూవీ ఫస్టాఫ్ దాదాపు గంటన్నర పాటు సాగుతుంది. థ్రిల్లర్ అంశాలతో మొదలై, ఆ తర్వాత హారర్ మూవీగా రూపాంతరం చెంది చిన్న ట్విస్టుతో ఇంటర్వెల్ పడుతుంది. తర్వాత హీరో హీరోయిన్ ప్రేమాయణం మొదలై క్లైమాక్స్‌లో మనం ఊహించని ఆసక్తికరమైన సీన్లతో ముగుస్తుంది.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  చాందినీ చౌదరి

  కెమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్
  క్లైమాక్స్‌లో వచ్చే సీన్లు


  మైనస్ పాయింట్స్

  స్లో నేరేషన్
  విసుగు తెప్పించే స్క్రీన్ ప్లే
  ఎడిటింగ్

  విశ్లేషణ

  విశ్లేషణ

  థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌కు చిన్న లవ్ స్టోరీ జోడించి రాసుకున్న కథ ఫర్వాలేదనే విధంగా ఉన్నప్పటికీ దాన్ని ప్రేక్షకులు అర్థమ్యే విధంగా, సరళంగా మలచడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ప్రయోగాత్మక సినిమాలు, కొత్త కాన్సెప్టులు అవసరమే... అయితే అవి ప్రేక్షకులకు మెచ్చే విధంగా, మరో నలుగురికి సినిమా బావుందిరా... అని చెప్పే విధంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. కేవలం తనలోని సృజనాత్మకతను ప్రదర్శించుకుంటే చాలు... అది ప్రేక్షకులకు ఎక్కక పోయినా ఫర్వాలేదు అనే ధోరణి ఉన్నపుడు షార్ట్ ఫిల్మ్ మాధ్యమమే బెటర్.

  చివరగా

  చివరగా

  థ్రిల్లర్, హారర్ కాన్సెప్టుతో తెరకెక్కిన ‘మను' రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్నప్పటికీ స్లో స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనానికి ఒక పరీక్ష. సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరచడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.

  నటీనటులు, తెర వెనక

  నటీనటులు, తెర వెనక

  నటీనటులు: రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు.

  కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి
  ఆర్ట్‌: శివ్‌కుమార్‌
  సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌
  సంగీతం: నరేష్‌ కుమారన్‌
  నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌ (115 మెంబర్స్‌)
  రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్శెట్టి
  విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2018

  English summary
  Manu movie review and rating. Manu is a Telugu feature film, a Mystery Romance Drama, Written and Directed by Phanindra Narsetti, the maker of short films Backspace and Madhuram. Manu is produced by 115 different individuals who are excessively passionate about films which made it the highest and fastest crowd-funded movie ever in the history of Telugu Cinema, raising over 1,00,00,000 INR in 4 days. Cast : Raja Goutham, Chandini Chowdary, John Kottoly, Aberaam, Mohan Bhagath.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X