Marco Movie Review: మార్కో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తీ తరేజా, సిద్దిఖీ, జగదీష్, అభిమన్యు, కబీర్ సింగ్, అన్సన్ పాల్, ఇషాన్ షౌకత్, శ్రీజిత్ రవి, రియాజ్ ఖాన్ తదితరులు
రచన, దర్శకత్వం: హనీఫ్ అదేని
నిర్మాత: షరీఫ్ మహమ్మద్
సినిమాటోగ్రఫి: చందు సెల్వరాజ్
ఎడిటింగ్: షమీర్ మహమ్మద్
మ్యూజిక్: రవి బస్రూర్
బ్యానర్: క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2024-01-01

ఆడెట్టు ఫ్యామిలీకి రస్సెల్ (టోని ఐజాక్, రస్సెల్ ఐజాక్) కుటుంబానికి బిజినెస్‌ పరంగా వైరం కొనసాగుతుంటుంది. ఆడెట్టు ఫ్యామిలీకి దత్త పుత్తుడు మార్కో. ఫ్యామిలీ మొత్తం అవమానించినా.. తన తండ్రి తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవించి జార్జ్ (సిద్దిఖీ) తన సోదరుడిని గౌరవించడమే కాకుండా కుటుంబంలో భాగంగా చేస్తాడు. సెంట్ తయారీలో నిపుణుడైన మార్కో సొదరుడు విక్టర్ అంధుడు. మార్కో అంటే విక్టర్‌కు పంచ ప్రాణాలు. అయితే విక్టర్‌ను రస్సెల్ వ్యాపార వారసుడు రస్సెల్ ఐజాక్ (అభిమన్యు) దారుణంగా హత్య చేస్తాడు. అయితే విక్టర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు మార్కో సిద్దమవుతాడు.

Marco Movie Review in Telugu  Unni Mukundan s Ruthless Action Drama

ఆడెట్టు కుటుంబంలో మార్కో‌ ఎలాంటి అవమానాలను సహించాడు? తన ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే మార్కో‌పై జార్జ్‌కు ఎలాంటి ప్రేమ ఉంది? విక్టర్‌ను రస్సెల్ ఎందుకు చంపాడు? విక్టర్‌ను చంపిన రస్సెల్‌ను మట్టుపెట్టే ఛాన్స్ వచ్చిన మార్కో ఎందుకు వెనుకడుగు వేశాడు? చివరకు విక్టర్ ప్రేయసి కడుపులో పెరుగుతున్న బిడ్డను మార్కో రక్షించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మార్కో సినిమా కథ.

కుటుంబంలో అంతర్గత కలహాలు, విభేదాలు, వ్యాపారంలో ప్రత్యర్థి వర్గంతో శత్రుత్వం అనే చిన్న పాయింట్ చుట్టు అల్లుకొన్న అవుట్ అండ్ అవుట్ రస్టిక్, యాక్షన్ థ్రిల్లర్ మార్కో. భారీగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాల మధ్య ఎమోషనల్ అంశాలను జొప్పించిన తీరు బాగుంది. అయితే యానిమల్, పుష్ప తరహాలో ఎపిసోడ్స్‌గా డిజైన్ చేసుకొన్న ఫైట్స్ సన్నివేశాలు బాగా కుదరడంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా చేసింది. దర్శకుడు హనీఫ్ అదేని కథను అద్యంతం గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా నడిపించిన విధానం బాగున్నప్పటికీ.. క్లైమాక్స్‌లో కథ, కథనాల పరంగా భారీ తప్పిదమే చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది.

యశోద, శాకుంతలం, మల్లికాపురం, జనతా గ్యారేజ్, ఖిలాడి సినిమాల ద్వారా ఉన్న ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే ఆ సినిమాల్లో ఎలాంటి హీరోయిజం లేకుండా నెగిటివ్ షేడ్స్ చేసిన ఆయన మార్కో పాత్ర ద్వారా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. పాత్ర పరంగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చూస్తే మతిపోయేలా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్‌లో పెర్ఫార్మెన్స్ చూస్తే తెర మీద నుంచి చూపు తిప్పుకోకుండేలా ఉంటుంది. సిక్స్ ప్యాక్ బాడీతో స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. మార్కో‌గా ఉన్ని ముకుందన్ వన్ మ్యాన్ షో అనేలా నటించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు పూర్తి న్యాయ చేశారు.

మార్కో మూవీ కేవలం నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హై స్టాండర్డ్స్‌తో టెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. మ్యూజిక్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పించేలా చేశాడు. ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు ఎక్సలెంట్‌ అని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి.

విచ్చలవిడిగా హింస, మితిమీరిన రక్తపాతం, కొన్ని సన్నివేశాల్లో పైశాచికత్వం లాంటి అంశాలను పక్కన పెడితే.. భావోద్వేగంతో కూడిన ఫ్యామిలీ డ్రామా మార్కో. ఈ సినిమా తొలి సన్నివేశం నుంచి యాక్షన్ మూడ్‌తో డిజైన్ చేయడం వల్ల మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా పిల్లల్ని, మహిళలు, సున్నిమనస్కులు ఈ సినిమాకు దూరంగా ఉంటే చాలా మంచింది. యాక్షన్, మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మార్కో‌ సినిమా కేవలం యాక్షన్ లవర్స్ మాత్రమే చూడదగినది.

More from Filmibeat

Read more about: unni mukundan marco yukti thareja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X