Bird Box Barcelona Review: అలా చూస్తే చనిపోతారు.. 'బర్డ్ బాక్స్ బార్సిలోనా' రివ్యూ
రేటింగ్: 2.5/5
టైటిల్: బర్డ్ బాక్స్ బార్సిలోనా (స్పానిష్)
నటీనటులు: మారియో కాసాస్, అలెజాండ్రా హోవర్డ్, జార్జినా క్యాంప్బెల్, నలియా స్కుబెర్త్, లియోనార్డో స్బరాగిలా తదితరులు
సినిమాటోగ్రఫీ: డేనియల్ అరానీ
సంగీతం: జెల్షియా మోంటెస్
నిర్మాణ సంస్థ: నెట్‌ఫ్లిక్స్
కథ, దర్శకత్వం: డేవిడ్ పాస్తర్, అలెక్స్ పాస్తర్
ఓటీటీ విడుదల తేది: జూలై 14, 2023
ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్
2018లో విడుదలై సంచలానత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది 'బర్డ్ బాక్స్' (Bird Box Movie). బర్డ్ బాక్స్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. దీంతో తర్వాతి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందులో భాగంగానే సుమారు ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్ తో స్పిన్ ఆఫ్ (సీక్వెల్ కాదు) మూవీగా వచ్చింది 'బర్డ్ బాక్స్ బార్సిలోనా' (Bird Box Barcelona Movie). మరి జూలై 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్పానిష్, ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మొదటి మూవీ పెంచిన అంచనాలను రీచ్ అయిందా? లేదా? రివ్యూలో (Bird Box Barcelona Review Telugu) చూద్దాం.

కథ : బర్డ్ బాక్స్ లో చూపించినట్లుగా రష్యాలో నెలకొన్న విధ్వంసం వివిధ దేశాలకు పాకుతుంది. అలా స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో కథ మొదలు అవుతుంది. సెబాస్టియన్ (మారియో కాసాస్), అతని కూతురు అన్నా (అలెజాండ్రా హోవర్డ్) తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కళ్లకు గంతలు కట్టుకుని సిటీలో తిరుగుతుంటారు. ఆ సమయంలో వారికి వారిలాగే మరో గ్యాంగ్ కనపడుతుంది. ఆ గ్యాంగ్ కు జెనరేటర్ వెతకడంలో సాయం చేస్తానని చెప్పిన సెబాస్టియన్ వారితో చేరిపోతాడు.

ట్విస్టులు : ఇతర గ్యాంగ్ తో సెబాస్టియన్ చేరిన తర్వాత ఎదురైన సంఘటనలు ఏంటీ? గాల్లో కనిపిస్తున్న వింత జీవి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? సెబాస్టియన్ కు ఫాదర్ ఈస్టాబన్ (లియోనార్డో స్బరాగిలా) చేసిందేంటి? మరో గ్యాంగ్ లోని క్లైర్ (జార్జినా క్యాంప్బెల్), సోఫియా (నలియా స్కుబెర్త్) ఎక్కడికి చేరుకున్నారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ బర్డ్ బాక్స్ బార్సిలోనా (Bird Box Barcelona Review) చూడాల్సిందే.

విశ్లేషణ : బర్డ్ బాక్స్ మూవీలో రష్టాలో ఒక అపోకలిప్స్ (విధ్వంసం) ఏర్పడుతుంది. గాల్లో పక్షి రూపంలో ఓ వింత ఆకారాన్ని చూసిన మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతారు. దాని నుంచి రక్షించుకునేందుకు కళ్లకు గంతలు కట్టుకుని మనుగడ సాధిస్తారు. కానీ, కొందరు మనుషులు మాత్రం వారికి ఉన్న బ్లైండ్ ఫోల్డ్ తీసేస్తూ వింత జీవికి సహాయంగా ఉంటారు. అదే స్టోరీ లైన్ తో బర్డ్ బాక్స్ బార్సిలోనా సాగుతుంది. అయితే ఇది బర్డ్ బాక్స్ కు సీక్వెల్ కాదు.

సూపర్ ట్విస్ట్ : బర్డ్ బాక్స్ లో వింత జీవి సృష్టించిన విధ్వంసం రష్యాలో జరిగితే.. ఇక్కడ బార్సిలోనా సిటీలో జరుగుతుంటుంది. బర్డ్ బాక్స్ చూసిన వారికి ఈ రెండో సినిమా బాగా అర్థం అవుతుంది. లేకుంటే కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. ఇక బర్డ్ బాక్స్ బార్సిలోనా స్టోరీలోకి వెళితే.. సెబాస్టియన్, అతని కూతురు బ్లైండ్ ఫోల్డ్ తో సర్వైవల్ అవ్వడం చూపిస్తూ సినిమా స్టార్ట్ చేశారు. మూవీ మొదలైన 25 నిమిషాల్లోనే ఊహించని ట్విస్టుతో ఆశ్చర్యపరిచారు మేకర్స్.
మైనస్ లు : సర్ప్రైజ్ ట్విస్ట్ తో కథేంటో డైరెక్టర్ చెప్పేయడంతో తర్వాత అంత ఆసక్తిగా ఉండదు. అందులో హీరో సెబాస్టియన్ చేసే పనులకు (చెబితే స్పాయిలర్ అవుతుంది) సంబంధించిన గతమేంటో చూపించేవరకు ఎదురుచూడాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. హీరో రియలైజ్ అయ్యే సన్నివేశం అంత బలంగా లేదు. ఎమోషన్స్ కాస్తా ఓకే. కానీ, బాగా కనెక్ట్ అయ్యే విధంగా లేవు. వింత జీవికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ కథ ఇంకా కొనసాగుతుందన్నట్లుగా క్లైమాక్స్ లో చూపించారు. మరి అప్పుడైనా రివీల్ చేస్తారో చూడాలి.

ఫైనల్ గా చెప్పాలంటే : సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ కూడా భయపెట్టేలా ఉంది. నటీనటులు అంతా చాలా బాగా చేశారు. ఇక 'బర్డ్ బాక్స్ బార్సిలోనా' గురించి ఫైనల్ గా చెప్పాలంటే.. రెండు గంటల నిడివి ఉన్న 'బర్డ్ బాక్స్' మూవీ అంతలా మెప్పించకపోయినా పర్వాలేదనిపిస్తుంది. అడల్ట్ కంటెంట్ లేకుండా భయపెట్టే 'బర్డ్ బాక్స్ బార్సిలోనా'పై (Bird Box Barcelona Movie Review) టైమ్ ఉంటే ఓసారి లుక్కెయొచ్చు.


Click it and Unblock the Notifications











