Mark Antony Review వినోదంతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసిన విశాల్, ఎస్‌జే సూర్య!
Rating: 3/5
నటీనటులు: విశాల్, ఎస్‌జే సూర్య, సునీల్, కే సెల్వరాఘవన్, రెడిన్ కింగ్‌స్లే, అభినయ, రీతూ వర్మ, వైజీ మహేంద్రన్ తదితరులు
దర్శకత్వం: అధిక్ రామచంద్ర
రచన: ఎస్జే అర్జున్, సావిత్రి ముత్తు, అధిక్ రవిచంద్రన్
నిర్మాత: వినోద్ కుమార్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: అభినంధన్ రామానుజం
ఎడిటింగ్: విజయ్ వేలుకుర్తి
ఆర్ట్: ఆర్కే విజమురుగన్
మేకప్: శక్తి
క్యాస్టూమ్: సత్య ఎన్‌జే, శ్రీను
ఫైట్స్: పీటర్ హెయిన్, కనల్ కన్నన్, దిలీప్, దినేష్ సుబ్బరాయన్
రిలీజ్ డేట్: 2023-09-15
హైదరాబాద్ నగరంలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లు ఆంటోని (విశాల్), జాకీ మార్తాండ (ఎస్‌జే సూర్య) ప్రాణ స్నేహితులు. వ్యాపారంలో తమకు శత్రువైన మరో గ్యాంగ్‌స్టర్ ఏకాంబరం (సునీల్) ముఠాతో వైరం కొనసాగుతుంటుంది. అయితే ఆంటోనిని ఏకాంబరం చంపేసి నగరం నుంచి పారిపోతాడు. ఆంటోని భార్య (అభినయ) కూడా చనిపోవడంతో వారి కుమారుడు మార్క్ (విశాల్)ను తన కుమారుడు మదన్ మార్తండ (ఎస్ఏజే సూర్య)తో సమానంగా పంచుతారు. ఈ క్రమంలో తన తల్లి, తండ్రి మరణాలకు కారణం ఏకాంబరం కాదని మార్క్ తెలుసుకొంటాడు.

ఆంటోనిని ఏకాంబరం ఏ పరిస్థితుల్లో ఎక్కడ చంపేశాడు? జాకీ మార్తండ పక్కన ఉండగానే ఆంటోని ఎలా చనిపోయాడు? ఆంటోని భార్య మరణానికి కారణం ఎవరు? తన కుమారుడి కంటే ఎక్కువగా మార్క్‌ను ప్రేమగా జాకీ ఎందుకు చూసుకొన్నాడు? తల్లిదండ్రుల మరణం వెనుక కారణాలు తెలుసుకొన్న మార్క్ ఏం చేశాడు? ఇలాంటి పరిస్థితుల మధ్య తన లవర్ (రీతూ వర్మ)తో మార్క్ లవ్ ట్రాక్ ఎలా నడిపాడు? చనిపోయారనుకొన్న ఆంటోని, జాకీ, చిరంజీవి (కే సెల్వ రాఘవన్) పాత్రలు ఎలా పుట్టుకొచ్చాయి? మాఫియా బిజినెస్‌లో ఆంటోని, జాకీ మార్తండ, చిరంజీవి పాత్రల మధ్య జరిగిందేమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మార్క్ ఆంటోని సినిమా కథ.

మార్క్ ఆంటోని సినిమా పక్కా కమర్షియల్ హంగులతో అధిక్ రామచంద్ర రాసుకొన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా. మాఫియా ఎలిమింట్స్‌కు టైమ్ మిషన్ జోడించి..ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ అధిక్ చేసిన మ్యాజిక్ తెరమీద పండిందని చెప్పవచ్చు. టైమ్ మిషన్‌తో గతంలోకి వెళ్లి.. తప్పులను సరిదిద్దుకొనే తీరుకు కామెడీని జోడించిన తీరు సినిమా సక్సెస్‌కు బాటలు వేసింది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ నాలుగు పాత్రలను తెర మీద ఆడించిన తీరు ఫెంటాస్టిక్‌గా ఉంటాయి. సన్నివేశాలు, డైలాగ్స్ యమా స్పీడ్‌గా దర్శకుడు పరుగులు పెట్టించిన తీరు బాగుంది. సెకండాఫ్‌లో సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ ఎదురులేని మనిషి ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెప్పవచ్చు.
విశాల్, జాకీ మార్తాండ్ పాత్రలను డిజైన్ చేసిన విధానంగా బాగుంది. క్రియేటివ్ లిబర్టీని ఉపయోగించి ఈ రెండు క్యారెక్టర్లను చంపుతూ, బతికిస్తూ స్క్రీన్ మీద పడించిన డ్రామా దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. అలాగే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను గ్యాంగ్‌స్టర్ డ్రామాలో బ్లెండ్ చేసిన తీరులో ఫర్‌ఫెక్షన్ కనిపించింది. ఏకాంబరం (సునీల్), చిరంజీవి (సెల్వ రాఘవన్) పాత్రలను కథలో వాడుకొన్న విధానం సినిమాకు ప్లస్ అయింది. కేవలం దర్శకుడి విజన్, స్టయిల్, టేకింగ్ కారణంగానే మార్క్ ఆంటోని ఆకట్టుకొనేలా ఉంది.

నటీనటులు విషయానికి వస్తే.. విశాల్, ఎస్‌జే సూర్య ద్విపాత్రాభినయంతో ఇరుగదీశారు. మార్క్, ఆంటోనిగా విశాల్ విజృంభిస్తే.. జాకీ, మదన్ పాత్రల్లో ఎస్‌జే సూర్య నట విశ్వరూపం చూపించాడు. కామెడీ, సీరియస్, లవ్, రకరకాల ఫ్లేవర్ ఉన్న పాత్రలను వీరిద్దరూ అాద్బుతంగా పండించారు. ఏకాంబరంగా సునీల్, చిరంజీవిగా సెల్వ రాఘవన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. విలన్‌గా డిఫరెంట్ సునీల్‌ను చూడటానికి అవకాశం కలిగింది. అభినయ, రీతూ వర్మ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. విశాల్, ఎస్‌జే సూర్యల పాత్రల ముందు మిగితా క్యారెక్టర్లు పెద్దగా ఎలివేట్ అయ్యే ఛాన్సే లేకుండా పోయింది.
మార్క్ ఆంటోని సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఈ మూవీకి పక్కాగా టెక్నికల్ అంశాలే అత్యంత బలంగా మారాయి. 1975 నుంచి 1995 మధ్య జరిగే పిరియాడిక్ డ్రామాకు తగినట్టుగా క్యాస్టూమ్స్, మేకప్స్‌తో కొత్త వరల్డ్‌ను క్రియేట్ చేయడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే ఆర్ట్ విభాగం పనితీరు కూడా బాగున్నది. సినిమా తొలి ఫ్రేమ్ నుంచి ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం వల్ల ప్రేక్షకుడిని కథకు, క్యారెక్టర్లకు కనెక్ట్ చేసేలా చేశారు. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఆర్ట్, మేకప్, క్యాస్టూమ్ సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా మారాయని చెప్పవచ్చు.

మార్క్ ఆంటోని.. రెగ్యులర్, రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. కానీ టెక్నికల్‌గా, స్క్రిప్ట్ పరంగా ఫుల్ డెప్త్ ఉన్న చిత్రంగా చెప్పుకోవచ్చు. అధిక్ రవిచంద్రన్ అనుసరించిన స్క్రీన్ ప్లే, టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. అయితే లాజిక్స్ వెతుక్కోకుండా సినిమా చూస్తే మంచి వినోదంతోపాటు న్యూ వరల్డ్‌లోకి వెళ్లి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. మాస్, కమర్షియల్ అంశాలను దట్టించి చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎక్స్‌పెరిమెంట్‌గా మార్క్ ఆంటోనిని చూడొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఫన్, హ్యుమర్‌తోపాటు మంచి యాక్షన్ డ్రామా చూసిన ఫీల్ కలుగుతుంది.


Click it and Unblock the Notifications











