Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు
రచన, దర్శకత్వం: వీఎస్ ముఖేష్
నిర్మాత: అఖిలేష్ కలారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్
కొరియోగ్రఫీ: రాకీ
ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి
బీజీఎం: సృజన శశాంక
మ్యూజిక్ జో ఎన్మవ్ మఅ
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-04-19

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి (కేదార్ శంకర్) తన కొడుకు (పార్వతీశం)ను మసాఫ్ట్ వేర్ ఇంజినీర్ చేస్తాడు. బాగా కట్నం ఇచ్చే వారిని చూసి మంచి అమ్మాయితో పెళ్లి చేయాలని తండ్రి అనుకొంటాడు.కానీ కొడుకు మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకొని అమ్మాయి మహాలక్ష్మీ (ప్రణీకాన్వికా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తన ప్రేమను తిరస్కరించినా వెంటపడి్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొంటాడు.
మహాలక్ష్మిలో ఏం చూసి సాఫ్ట్ వేర్ అబ్బాయి ప్రేమలో పడ్డాడు? తన అభిప్రాయాలకు భిన్నంగా కొడుకు ప్రేమలో పడటంతో తండ్రి పరిస్థితి ఏమిటి? మహాలక్ష్మీ మార్కెట్‌లో ఎందుకు కూరగాయలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది? మహాలక్ష్మీ ఎందుకు మొండిగా వ్యహరించింది? తన ప్రేమను గెలుచుకోవడానికి సాప్ట్ వేర్ ఇంజినీర్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? మహాలక్ష్మీ సోదరుడు క్వాటర్ కృష్ట (మెహబూబ్ బాషా) పాత్ర ఏమిటి? మహాలక్ష్మీ ప్రేమ కథలో కిషోర్ (ముక్కు అవినాష్), రైటర్ హర్షవర్ధన్ (హర్షవర్ధన్) క్యారెక్టర్లు ఏమిటి? చివరకు ప్రియుడి ప్రేమకు మహాలక్ష్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే మార్కెట్ మహాలక్ష్మీ సినిమా కథ.

మార్కెట్ మహాలక్ష్మీ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథ అనిపించినప్పటికీ.. క్యూట్ లవ్ స్టోరి, ఫ్యామిలీ తెఎమోషన్స్‌కు స్కోప్ ఉన్న సినిమా. అయితే కథలో ఎమోషనల్ పాయింట్స్ ఆకట్టుకొనే అంశం. కానీ ఫస్టాఫ్‌లో కథ స్లోగా, రొటీన్‌గా సాగడంతో సాదాసీదా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్‌లో కథను నడిపించిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో సన్నివేశాలను గ్రిప్పింగ్ మలిచిన తీరు దర్శకుడు ముఖేష్ ప్రతిభకు అద్దం పట్టింది. ఓ దశలో బొమ్మరిల్లు సినిమా కథను అనుసరించాడా? అనే సందేహం కలుగుతుంది.ఇక కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే డిఫరెంట్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది.
కేరింత సినిమాతో ప్రేక్షకులకు చేరువైన పార్వతీశం తన పాత్రను అర్దం చేసుకొని చేసిన ఫెర్ఫార్మెన్స్ బాగుంది. డిఫరెంట్ల డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. కేరింత తర్వాత మరోసారి మంచి రోల్‌లో మెప్పించేలా చేశాడు. ఇక సినిమా కథనే తన చుట్టూ తిరిగే పాత్రలో ప్రణీకాన్వికా ఒదిగిపోయింది. సినిమా భారాన్నంత తన భుజాలపై మోసిందనే చెప్పాలి. ముక్కు అవినాష్, హర్షవర్ధన్, మెహబూబ్ బాషా, కేధార్ శంకర్ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.



Click it and Unblock the Notifications











