twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maro Prasthanam movie review.. తనీష్ అల్లాడి ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

    |

    Rating: 2.75/5

    నచ్చావులే, రైడ్, రంగు లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకొన్న యువ హీరో తనీష్. ఇటీవల కాలంలో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తూ.. మరో ప్రస్థానం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా తనీష్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించిందంటే..

    మాఫియా కార్యక్రమాలు నిర్వహించే రాణే భాయ్ (కబీర్ సింగ్) ముఠాలో శివ (తనీష్) క్రిమినల్ కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు. డబ్బు కోసం ఎలాంటి దారుణానికి ఒడిగట్టడానికి సిద్దపడే తనీష్ జీవితంలోకి నైనీ (అర్చన ఖన్నా) ప్రవేశిస్తుంది. అయితే నైనీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సమయంలో ఆమె దారుణ హత్యకు గురవుతుంది.

    తన ప్రేయసి నైనీ మరణించిన తర్వాత శివ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఏ పరిస్థితుల్లో నైనీ హత్యకు గురైంది. నైనీ హత్య తర్వాత రాణే భాయ్ ముఠాపై తనీష్ పగ తీర్చుకోవాలని అనుకొన్నాడు? నైనీ హత్యకు కారణం ఏమిటి? చివరకు శివ జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది. ఈ కథలో జర్నలిస్టు (భాను శ్రీ మెహ్రా) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మరో ప్రస్థానం సినిమా కథ.

     Maro Prasthanam movie review and Rating

    మరో ప్రస్థానం మూవీ రాణే భాయ్ మాఫియా కార్యకలాపాలతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. క్రైమ్, అండ్ వయోలెన్స్ ఎలిమింట్స్‌తో ఎమోషనల్‌గా కథ సాగుతుంది. అయితే తనీష్ ప్రేమ కథ మొదలైన తర్వాత మరింత భావోద్వేగంగా మారుతుంది. తన ప్రియురాలు నైనా కోసం తీసుకొన్న కీలక నిర్ణయం సినిమా కథను మలుపుతిప్పుతుంది. చివర్లో సినిమా యాక్షన్ పార్ట్‌తోపాటు తనీష్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌తో ఎమోషనల్ నోట్‌తో ముగుస్తుంది. దర్శకుడు యాక్షన్ అంశాలకు బదులుగా మరింత ఎమోషనల్ పాయింట్స్ జోడించి ఉంటే డెఫినెట్‌గా తనీష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అయి ఉండేదనిపించింది.

    తనీష్ యాక్టింగ్ విషయానికి వస్తే.. క్రైమ్, వయెలెన్స్ సీన్లతోపాటు లవ్ అండ్ ఎఫెక్షన్ సీన్లతో అద్బుతంగా నటించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌కు ముందు ప్రదర్శించిన భావోద్వేగం సినిమాకు హైలెట్‌గా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా క్లైమాక్స్‌లో మరణించిన నైనీ ముందు రోదిస్తూ.. చెప్పిన డైలాగ్స్ కానీ.. హావభావాలు ఆకట్టుకొంటాయి.

    ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ముస్కాన్ సేథి, భాను శ్రీ మెహ్రా, అర్చన ఖన్నా పాత్రల పరిధి తక్కువే అయినప్పటికీ.. వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. అర్చన ఖన్నా లవ్ సీన్లో బాగా నటించింది. ఇక భాను శ్రీ మెహ్ర జర్నలిస్టు పాత్రలో ఒదిగిపోయారు. కబీర్ సింగ్ రాణేగా పాత్రకు న్యాయం చేశాడు. కథకు అవసరమైన విలనిజాన్ని ప్రదర్శించాడని చెప్పవచ్చు.

    ఇక జానీ రాసుకొన్న ఎమోషనల్ సింగిల్ పాయింట్ బాగానే ఉంది. అయితే దానిని పూర్తిస్థాయి లవ్, యాక్షన్ సినిమాగా మలచడంలో కొంత తడబాటు గురయ్యాడని చెప్పవచ్చు. తనీష్, అర్చన ఖన్నా సీన్లు, అలాగే క్లైమాక్స్ సన్నివేశాలను తనదైన శైలిలో తెర మీద భావోద్వేగాన్ని పండించాడు. యాక్షన్, క్రైమ్ అంశాలను కాస్త తగ్గించి.. తనీష్, అర్చన మధ్య ఎమోషనల్ కంటెంట్ గురించి దృష్టిపెడితే.. కథ మరింత భావోద్వేగంగా మారి ఉండేదనిపిస్తుంది. కథకు సరిపోయే రీరికార్డింగ్, అలాగే మాస్ పాటతో సునీల్ కశ్యప్ ఆకట్టుకొన్నాడు. కొన్ని సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా మారింది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. క్రాంతికి ఇంకాస్త పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. మాటలు, ఫైట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

    ఫైనల్‌గా మరో ప్రస్థానం సినిమా విషయానికి వస్తే.. లవ్ బ్యాక్ డ్రాప్‌గా క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అయితే దర్శకుడు సరికొత్త పంథాలో సినిమాను ప్రొజెక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నంలో తడబాటు కనిపిస్తుంది. కాకపోతే తనీష్ నటన సినిమాకు బలంగా మారింది. యాక్షన్, క్రైమ్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పుకుండా నచ్చుతంది.

    నటీనటులు: తనీష్, భానుశ్రీ మెహ్రా, ముస్కాన్ సేథి, అర్చనా ఖన్నా, కబీర్ దుహాన్ సింగ్, అమిత్, గగన్ విహారి తదితరులు
    సాంకేతిక నిపుణులు:
    దర్శకత్వం: జాని
    మాటలు: వసంత కిరణ్, యానాల శివ
    పాటలు: ప్రణవం
    సంగీతం: సునీల్ కశ్యప్
    సినిమాటోగ్రఫి: ఎంఎన్ బాల్ రెడ్డి
    ఎడిటర్: క్రాంతి (ఆర్కే)
    కొరియోగ్రఫి: కపిల్
    ఫైట్స్: శివ

    Recommended Video

    Maro Prasthanam Movie Team Chit Chat | Tanish, Muskan Sethi

    రిలీజ్ డేట్: 2021-09-24

    English summary
    Maro Prasthanam movie review and Rating. Tanish Alladi's latest movie is Maro Prasthanam. This movie hits the screen on September 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X