twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్షల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5

    ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మేలు చేసే కొత్త వైద్య ఆవిష్కరణల అంశం ఎప్పడూ సెన్సేషనల్‌గాను ఉంటుంది. వైద్య పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ అనే అంశాలు ఇటీవల కాలంలో వివాదాలుగా మారుతున్నాయి. అయితే అలాంటి ఓ సెన్సేషనల్ సబ్జెక్ట్‌ను తీసుకొని దర్శకుడు జై రాజ్ సింగ్ రూపొందించిన చిత్రం మార్షల్. చిన్న చిత్రంగా ప్రమోషన్ మొదలై.. టీజర్లు, ట్రైలర్లు క్రేజీగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సినీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్నది. అయితే మార్షల్ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఏమిటంటే..

    మార్షల్ మూవీ కథ

    మార్షల్ మూవీ కథ

    శివాజీ (శ్రీకాంత్) టాలీవుడ్‌లో సూపర్‌స్టార్. అతడికి వీరాభిమాని అభి (అభయ్). ఒక్కసారైనా సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో ఉంటాడు. ఈ క్రమంలో తన సోదరికి జరిగిన ఓ అన్యాయం గురించి ఆరా తీస్తే సైటింస్టు ముసుగులో ఉన్న తన అభిమాన నటుడు అని తెలుస్తుంది.

    మార్షల్‌ మూవీలో ట్విస్టులు

    మార్షల్‌ మూవీలో ట్విస్టులు

    సినీ నటుడైన శివాజీ సైంటిస్టుగా అవతారం ఎత్తడానికి కారణమేమిటి? అభికి సోదరికి జరిగిన అన్యాయం, మోసం ఏమిటి? సైంటిస్ట్‌గా మారిన హీరో శివాజీ వల్ల ఎంతమందికి అన్యాయం జరిగింది? తాను అభిమానించే హీరో వచ్చి సెల్ఫీ తీసుకొనేంతగా అభి చేసిన పోరాటం ఏమిటీ అనే ప్రశ్నలకు సమాధానమే మార్షల్.

    మార్షల్ మూవీ విశ్లేషణ

    మార్షల్ మూవీ విశ్లేషణ

    మార్షల్ సినిమాకు ప్రధాన బలం కథ, కథనాలు. సంతాన లేమితో బాధపడే దంపతులను వైద్యులు ఎలా మోసానికి గురిచేస్తున్నారనే అంశాన్ని దర్శకుడు జైరాజ్ సింగ్ కళ్లకు గట్టినట్టు చూపించాడు. యువ దర్శకుడైనప్పటికీ జై రాజ్ సింగ్ అనుభవం ఉన్న డైరెక్టర్‌గా కథను డీల్ చేశాడు. మోస్ట్ కాంప్లికేటెడ్ క్లినికల్ ట్రయల్స్ (వైద్య పరిశోధనలు) అంశాన్ని ఎత్తుకొన్న తీరు, నడిపించిన విధానం ఆకట్టుకొంటుంది. అంతేకాకుండా క్లిష్టమైన సబ్జెక్ట్‌ను సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యే విధంగా చెప్పడంలోనే జైరాజ్ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు.

    శ్రీకాంత్, అభి, మేఘా యాక్టింగ్

    శ్రీకాంత్, అభి, మేఘా యాక్టింగ్

    శ్రీకాంత్ సూపర్‌స్టార్‌గా, సైంటిస్ట్‌గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను అవలీలగా పోషించాడు. హీరోగా ఎంత ఎమోషనల్‌గా యాక్టింగ్ చేశాడో అంతే మొత్తంలో డాక్టర్‌గా సాఫ్ట్ విలనిజాన్ని పండించాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ నటన అదనపు ఆకర్షణ. ఇక హీరో అభి కూడా కొత్తవాడైనప్పటికీ మంచి ఈజ్‌తో కనిపించాడు. ఫైట్స్, డ్యాన్స్‌లో గ్రేస్ ఉంది. నటనపరంగా కొన్ని లోపాలను సరిద్దిద్దుకుంటే మంచి నటుడు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక నిర్మాణంతోపాటు బలమైన పాత్రతో హీరోగా అభి పరిచయం కావడం అభినందనీయం. ఇక హీరోయిన్ మేఘా చౌదరీ గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆకట్టుకొన్నది. టీవీ జర్నలిస్టుగా, లవర్‌గా మంచి నటించింది.

    టెక్నికల్‌ పాయింట్స్

    టెక్నికల్‌ పాయింట్స్

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. ఎడిటింగ్ పనితీరు కూడా బాగుంది. ఫస్టాఫ్‌లో కొంత నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. వరికుప్పల యాదగిరి పాటలు, సాహిత్యం, సంగీతం బాగుంది. కేజీఎఫ్‌ ఫేమ్ రవి బాసురి రీరికార్డింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ భారీ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా రిచ్‌గా ఉన్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వైద్య పరిశోధనలు (క్లినికల్ ట్రయల్స్) కథా నేపథ్యంగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిలర్ మార్షల్. కథలో ట్విసులు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా థ్రిల్‌కు గురిచేస్తాయి. సినిమా హీరో మరో కోణాన్ని ఆవిష్కరించిన తీరు సినిమాకు హైలెట్. ఈ చిత్రంలోని అంశాలు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. సామాజిక అంశాలతో వినోదం పుష్కలంగా ఉన్నచిత్రం మార్షల్. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. సినిమా కథ, కథనాలు వాటిని మరుగునపడేశాయి.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు: మేక శ్రీకాంత్, మేఘా చౌదరీ, సుమన్, అభయ్ తదితరులు
    ఎడిటింగ్, దర్శకత్వం: జై రాజ్ సింగ్
    నిర్మాత: అభయ్ అడక
    మ్యూజిక్ డైరెక్టర్: వరికుప్పల యాదగిరి
    సినిమాటోగ్రఫి: ఆర్ఎం స్వామి

    English summary
    Marshal movie review and rating, Srikanth's Marshal released on September 13th. Abhay Adaka introduced as hero first time. Jai Raj singh is director. Varikuppala Yadagiri is the music director. AVL productions producing the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X