Martin Luther King Review ఓటు విలువ చెప్పే మార్టిన్ లూథర్ కింగ్.. వైఎస్ జగన్‌పై సెటైర్లతో!

Rating:
2.5/5

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా
ఎడిటింగ్, దర్శకత్వం: పూజ కొల్లూరు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా
స్టోరి: మడోన్ అశ్విన్
సినిమాటోగ్రఫి: దీపక్ యరగెరా
మ్యూజిక్: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
కాస్ట్యూమ్ డిజైనర్: జీఎన్ఎస్ శిల్ప
బ్యానర్: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయానా మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-10-27

 Martin Luther King Telugu Review and Rating: Sampoornesh Babu film preaches value of Vote

ఆంధ్రప్రదేశ్‌లోని పడమరపాడు గ్రామ సర్పంచ్‌కు ఉన్న ఇద్దరు భార్యలకు ఇద్దరు కుమారులు జగ్గూ (వీకే నరేష్), లోకమాన్య తిలక్ అలియాస్ లోకి (వెంకటేష్ మహా) ఉంటారు. గ్రామంలోని ఉత్తర దిశలో ఉన్న ఓ కులం వారికి జగ్గూ, దక్షిణ ప్రాంతంలో ఉన్న కులం వారికి లోకీ ప్రాతినిత్యం వహిస్తుంటారు. సోదరులైనప్పటికీ జగ్గు, లోకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. అలాంటి గ్రామంలో చెప్పులు కుట్టుకొనే అమాయకుడైన ఎడ్డోడు (సంపూర్ణేష్ బాబు) అందరికీ సాయం చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ రావడంతో ఎడ్డోడు కీలకంగా మారుతాడు.

 Martin Luther King Telugu Review and Rating: Sampoornesh Babu film preaches value of Vote

వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరిని సర్పంచ్ ఎందుకు పెళ్లి చేసుకొన్నాడు? ఇద్దరు కుమారులు జగ్గు, లోకి వారసత్వ రాజకీయాలు, అధిపత్య పోరు చూసి సర్పంచ్ ఎందుకు మనస్తాపం చెందాడు. చెప్పులు కుట్టుకొనే ఎడ్డోడికి ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఎందుకు కావల్సి వచ్చింది? ఎడ్డోడిగా పిలిచే మోచీకి మార్టిన్ లూథర్ కింగ్ అని పోస్టు మాస్టర్ (శరణ్య) ఎందుకు పేరు పెట్టింది? మార్టిన్ లూథర్ కింగ్‌కు ఆధార్, ఓటర్ కార్డు వచ్చిన తర్వాత వచ్చిన ఎదురుపడిన సమస్యలు ఏమిటి? సర్పంచ్ ఎన్నికలు మార్టిన్ లూథర్ కింగ్‌ ప్రాణాల మీదకు రావడానికి కారణం ఏమిటి? సర్పంచ్ ఎన్నికల్లో మార్టిన్ లూథర్ కింగ్ ప్లాన్ వర్కవుట్ అయిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కథ.

 Martin Luther King Telugu Review and Rating: Sampoornesh Babu film preaches value of Vote

పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి ప్రారంభోత్సవం లాంటి సన్నివేశంతో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ కథ మొదలవుతుంది. ఆ సన్నివేశం చుట్టూ జరిగిన పరిణామాలతో నేరుగా అసలు కథ చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. కథకు మూలమైన సమస్యతో ఎడ్డోడి పాత్రను తీసుకొచ్చి సెంటర్ పాయింట్ చేయడంతో ఆ రోల్ చుట్టూ కథ తిరిగేలా చేశారు. గ్రామాల్లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని చక్కగా చూపించారు. పోస్ట్ మాస్టర్ పాత్రతో కథ మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. అయితే సన్నివేశాల్లో బలంగా లేకపోవడం, కొన్ని సీన్లను ఎమోషనల్‌గా మార్చకపోవడంతో సాదాసీదా సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబందించి ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో ఫస్టాఫ్ పూర్తవుతుంది.

 Martin Luther King Telugu Review and Rating: Sampoornesh Babu film preaches value of Vote

సెకండాఫ్‌లో కథలో ఏదైనా ఎమోషన్స్, డ్రామా, మార్టిన్ లూథర్ కింగ్ క్యారెక్టర్‌పై సింపథి పడుతుందా? అని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురవుతుంది. కానీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అనుకరించే జగ్గూ పాత్ర ద్వారా సెటైర్లు వేయడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఎన్నికల ప్రచారంలో, పాదయాత్రలో వైఎస్ జగన్ మహిళలు, వృద్ధులపై ముద్దులు కురిపించే సీన్లను గుర్తు చేసే విధంగా సన్నివేశాలు మంచి హ్యుమర్ పడించాయి. చివర్లో కథలో డ్రామా, ట్విస్టులు ఆకట్టుకొనేలా ఉండటం ఫీల్‌గుడ్‌గా మారినట్టు కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓటు విలువ గురించి ప్రేక్షకుడిపై బలమైన ప్రభావం చూపించాలనే ప్రయత్నం మొత్తంగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

 Martin Luther King Telugu Review and Rating: Sampoornesh Babu film preaches value of Vote

చెప్పులు కుట్టుకొంటూ.. బిక్షాటన చేసి జీవితాన్ని గడిపే చర్మకారుడిగా సంపూ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఏ మాత్రం గ్లామర్‌కు ఛాన్స్ లేని పాత్రతో ప్రేక్షకులకు చైతన్యం కలిగించే పాత్రలో నటించి మెప్పించాడని చెప్పాలి. సంపూ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇప్పటి వరకు చూడని సంపూని నటనపరంగా చూసే అవకాశం లభించింది. జగ్గూగా వీకే నరేష్, లోకేష్‌గా వెంకటేష్ మహా సినిమాకు బలంగా మారారు. సంపూ అసిస్టెంట్‌గా నటించిన అబ్బాయి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకొన్నాడు. శరణ్య, సర్పంచ్‌గా నటించిన వ్యక్తితోపాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

సాంకేతిక విభాగాల పనీతిరు విషయానికి వస్తే.. వెంకటేష్ మహా రాసిన డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే, సీన్లను ఇంకా బెటర్‌గా రాసుకొని ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండటానికి ఛాన్స్ ఉండేదనిపిస్తుంది. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫి, స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉండే డెఫినెట్‌గా మంచి పొలిటికల్ సెటైర్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. మండేలా ప్రభావం పడకుండా దర్శకురాలు పూజా కొల్లూరు చేసిన ప్రయత్నం బాగుంది.

 Martin Luther King Telugu Review and Rating: Sampoornesh Babu film preaches value of Vote

ఏపీలో రెండు కులాల మధ్య రాజకీయ, అధిపత్య పోరాటం నేపథ్యంగా రూపొందిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. తమిళంలో ఘన విజయం సాధించిన మండేలా సినిమాకు రీమేక్. సంపూ, వీకే నరేష్, వెంకటేష్ మహా పాత్రలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పొలిటికల్ సైటర్ మూవీ అంటే మంచి పంచ్‌లు, ఆలోచింపజేసే సన్నివేశాలు, డైలాగ్స్, పాటలను ఆశిస్తారు. దానికి తగినట్టే ఓటు కోసం ఉచిత హామీలు, డబ్బులు పంచడం, వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టడం లాంటి అంశాలు ఈ సినిమాలో బాగానే కనిపిస్తాయి. స్క్రిప్టు పరంగా ఇంకా కొంత వర్క్ చేసి ఉంటే.. దాసరి నారాయణ రావు తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు లాంటి సినిమా అయి ఉండేదనిపిస్తుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే తెలంగాణ, ఏపీ ఎన్నికల వేళ ఓటరను జాగృతం చేయడానికి చేసిన ప్రయత్నం బాగుంది. గ్రామ రాజకీయాలు, రాజకీయ నేతలపై సెటైర్లు, ఎలక్షన్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి మార్టిన్ లూథర్ కింగ్ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X