Martin Movie Review: మార్టిన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ధృవ్ సర్జా, వైభవీ శాండిల్య, అన్వేషి జైన్, సుక్రుత వాగ్లే, అచ్యుత్ కుమార్, నిఖ్తిన్ ధీర్ తదితరులు
దర్శకత్వం: ఏపీ అర్జున్
నిర్మాత: ఉదయ్ కే మెహతా
మ్యూజిక్: మణిశర్మ, రవీ బస్రూర్
కథ: అర్జున్ సర్జా
సినిమాటోగ్రఫి: సత్య హెగ్డే
ఎడిటింగ్: కేఎం ప్రకాశ్
రిలీజ్ డేట్: 2024-10-11
పలు దేశాలను అడ్డాగా చేసుకొని మాఫియా వ్యవహారాలు నడిపించే గ్యాంగ్‌స్టర్ మార్టిన్ ఇండియాకు సవాల్‌గా నిలుస్తాడు. అర్జున్ (అర్జున్ సర్జా) ఇండియన్ నేవీలో డబ్బుకు లొంగని నిజాయితీ ఆఫీసర్. కల్తీ మెడిసిన్, అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేసే మాఫియా డాన్ (నిఖ్తిన్ ధీర్)కు చెందిన కంటైనర్లను అర్జున్ పట్టుకొంటాడు. పాకిస్థాన్‌లో జరిగిన ఎటాక్‌లో అర్జున్ అక్కడి పోలీసులకు చిక్కుతాడు. ఆ క్రమంలో పాకిస్థాన్ పోలీసులు ఓ ఇంజెక్షన్ ఇవ్వడంతో అతడు తన మెమొరీని కోల్పోతాడు.

పాకిస్థాన్ నుంచి అర్జున్ ఇండియాకు ఎలా వచ్చాడు? కంటైనర్ల విషయంలో ఎలా నిజాయితీగా ఉన్నాడు? కంటైనర్ల విషయంలో మాఫియా డాన్‌తో మార్టిన్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకొన్నాడు? అర్జున్ లవర్ ప్రీతీ( వైభవీ శాండిల్య)ను మార్టిన్ కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది? మాఫియా డాన్ తన కంటైనర్లను చేజిక్కించుకొన్నాడా? అర్జున్‌కు మార్టిన్ ఎలాంటి సవాల్ విసిరాడు. అసలు మార్టిన్ ఎవరు? ఇండియాకు అనుకూలంగా ఉంటాడా? ప్రతికూలంగా ఉంటాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మార్టిన్ సినిమా కథ.
జాన్ విక్, ఇతర హాలీవుడ్ సినిమాల ప్రభావంతో పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఏపీ అర్జున్ రాసుకొన్న పాయింట్‌లో పెద్దగా కథ కనిపించదు. పక్కాగా, తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు కథ కంటే ఫైట్స్ నిరంతరంగా సాగిపోతుంటాయి. ఊపిరి సలపనంతగా యాక్షన్ ఎపిసోడ్, రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ పరుగులు పెడుతుంటుంది. ఎక్కడైనా సినిమా ఆగి ఏదైనా కొత్తగా కథ చెబుతాడా? అదేమీ కనిపించదు. ఫైట్స్‌తో ఎవరో తరుముతున్నట్టు హీరో చెప్పే డైలాగ్స్ కనిపిస్తాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించిన విధానం ఈ సినిమాకు హైలెట్.
ధృవ్ సర్జా పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో అద్బుతంగా స్టంట్స్‌తో ఆకట్టుకొన్నాడు. రామ్, రావణ్ లాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో తనదైన శైలిలో స్క్రీన్ మీద మెప్పించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఈ సినిమాలో ధృవ్ సర్జా తప్ప మరో క్యారెక్టర్ పెద్దగా కనిపించదు. ఉన్న పాత్రలన్నీ నామమాత్రంగానే కనిపిస్తాయి.

మార్టిన్ సినిమా యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్ కంటే.. టెక్నికల్ పరంగా స్టాండర్డ్స్ హై రేంజ్‌లో ఉంటాయి. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫి అదిరిపోతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఉదయ్ కే మెహతా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
కథ, కథనాలు లేకుండా కేవలం ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు యాక్షన్, స్టంట్స్, ఫైట్స్ మాత్రమే టార్గెట్ చేసుకొని రూపొందించిన సినిమా మార్టిన్. నకిలీ మందుల ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దుష్పలితాలు ఉన్నాయనే పాయింట్ చుట్టు అల్లుకొన్న గ్యాంగ్‌స్టర్ కథ. యాక్షన్ లవర్స్‌కు, మాస్ ఆడియెన్స్ ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. కేవలం ధృవ్ సర్జా ఫైట్స్‌ను, యాక్షన్ ఎపిసోడ్స్ చూడాలనుకొంటే మార్టిన్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications











