twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూత్ టార్గెట్ (ఈ రోజుల్లో రివ్యూ)

    By Srikanya
    |

    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    తారాగణం : శ్రీనివాస్ , రేష్మ,ఎమ్.ఎస్ నారాయణ తదితరులు.
    సంగిత డైరెక్టర్ : జే .బి
    దర్శకుడు : మారుతీ
    నిర్మాత : గుడ్ సినిమా గ్రూప్


    సినిమాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు.. ఇరవై లోపు కాలేజీ పిల్లలేనా, యూత్ కి నచ్చితే సినిమా హిట్టేనా...ఈ రోజుల్లో చిత్రం నిస్సందేహంగా అవుననే సమాధానమిస్తుంది. బడ్జెట్,స్టార్స్ తో సంభందం లేకుండా వచ్చిన ఈ చిన్న చిత్రం యువత రోజూ డిస్కస్ చేసుకునే ఆడా-మొగ రిలేషన్స్ ని తెరపై బోల్డ్ గా కుప్పగా పోసేసి టక్కున హిట్ కొట్టేసింది. పనిలో పనిగా పరిశ్రమవారికి మరోసారి ప్రేక్షకుడు ఎప్పుడూ పజిలే అని ఫిక్స్ అయ్యేలా చేసింది. అయితే పనిలో పనిగా ఈ సినిమాని ఆనుకరిస్తూ కుప్పలు తెప్పలుగా యూతూ,బూతూ కలగలిపిన సినిమాలు వస్తాయోమోననే భయాన్ని మాత్రం కూడా కలగచేసింది.

    శ్రీ(శ్రీనివాస్),శ్రేయ(రేష్మి)ఇద్దరూ తమ గత ప్రేమానుభవాలతో విసుగెత్తి పోయి...మళ్లీ పొరపాటున కూడా ప్రేమలో పడకూడని ఫిక్స్ అవుతారు. అయితే విధి(హ..హ..హ..సినిమాల్లో అంతే)వదలదు కదా...శ్రీ...ఆమె ఇంట్లోనే అద్దెకు దిగుతాడు. వద్దనుకుంటూనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా డిటోనే...ఈ స్ధితిలో వాళ్ల మనస్సులు ఎదురుతిరగలేదా...ఈ కొత్త ప్రేమ కథకు వాళ్ళ గత జీవితంలోని ప్రేమికులు ఎలా అడ్డం వచ్చారు...అనేది మిగతా కథ..కాదు..కాదు తెరపై కధనం.

    పై కథలో ఏముంది పాత కథే కదా..ఎన్ని సినిమాల్లో చూడలేదు అనిపించవచ్చు..కానీ దర్శకుడు అక్కడే మ్యాజిక్ చేసాడు. తనే స్వయంగా రాసుకున్న డైలాగులుతో సినిమాను పరుగెత్తించాడు. రోజూ వారి యువతకు కి ఎదురయ్యే సంఘటనల నుంచి డైలాగులు పుట్టించి...టప్పట్లు కొట్టించుకున్నాడు. అలాగే ఆ చిన్న స్టోరీ లైన్ కి కథనం,సస్పెన్స్ తో ముడివేసి ఎక్కడా బోరు కొట్టకుండా నడిపించటంలో సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు కొత్తగా పరిచయమైన నటీనటులు నుంచి అతను మంచి ఫెరఫార్మెన్స్ రాబట్టడంలో సఫలమవటం కూడా కలిసి వచ్చింది. ఇక హీరోయిన్ గా చేసిన రేష్మి...త్రిషకు నకలులాగ ఉండి ఆకట్టుకుంది. పాటల్లో రింగ్ ..ట్రింగ్ పాట బాగా పేలింది. ఆ పాటలో పాపులర్ స్టార్ హీరోల ఫేస్ మాస్క్ లతో డాన్స్ చేయించటం బాగా కుదిరింది. సాంకేతికంగా 5డి కెమెరాతో వర్మ తీసిన దొంగల ముఠా కన్నా చాలా బాగా తీసారు. ఇక ఈ దర్శకుడుకి పెద్ద బడ్జెట్ ఇస్తే ఇంతకన్నా మంచి చిత్రం తియ్యగలడనిపించింది.

    ఏదైమైనా శృతి మించిన బూతు సీన్స్ ,డబుల్ మీనింగ్ డైలాగులు బాగా ఎక్కువ అవటంతో ఓ వర్గం పూర్తిగా ఈ చిత్రానికి దూరం ఉంటుంది. అయితే యువతే నా టార్గెట్ వారిలోనూ ఆడపిల్లలు నా సినిమా చూడక్కర్లేదు అనుకుని పిక్స్ అయితే మాత్రం తన టార్గెట్ ని అనుకున్న దానికన్నా బాగా చేరవ అయినట్లే. బి,సి సెంటర్లలో బాగా వర్కవుట్ అయ్యే ఈ చిత్రం కొన్నిటిని భరించగలిగితే మంచి ఎంటర్టైనరే.

    English summary
    New Comers Ee Rojullo film released with hit talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X