twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మారుతి బ్రాండురా...( "లవ్ యురా బంగారం'' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.0/5

    'నేను ఇప్పటికి ఎన్నో...ఓపెన్ చేసాను, 'పెళ్ళంటే తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోవటం...సెక్స్ అంటే సెలూన్ కి వెళ్లి షేవ్ చేయించుకోవటం' వంటి మారుతి ట్రైడ్ మార్క్ డబుల్ మీనింగ్ డైలాగులతో ఆయన బ్యానర్ నుంచి మరో చిత్రం థియోటర్ లోకి దూకేసింది. అయితే మారుతి డైరక్ట్ చేయని చిత్రాలలో బూతు మాత్రమే స్ధానం ఉంటోంది కానీ, కథ,కథనాలకు ఉండటం లేదు. దాంతో ఇదీ ఇంతకు ముందు అదే బ్యానర్ నుంచి వచ్చిన రొమాన్స్ చిత్రం లాగే కష్టమనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య అనుమానం ప్రవేశిస్తే జరిగే పరిణామాలు ఏమిటనే అంశంతో వచ్చిన ఈ చిత్రం అడల్ట్ డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. ఫస్టాఫ్ ఓకే అనిపించినా..సెకండాఫ్ కి వచ్చే సరికి విషయం లేక పూర్తిగా తేలిపోయింది.

    మొబైల్ కంపెనీలో పనిచేసే ఆకాష్(రాహుల్),మీనాక్షి(శ్రావ్య)తో ప్రేమలో పడతాడు. అయితే వాళ్ళ ప్రేమని పెద్దలు మధ్య పొలిటకల్ విభేదాలు ఉండటంతో ఒప్పుకోరు. దాంతో ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొంతకాలానికి ఆమె జాబ్ లో జాయిన్ అవుతుంది. అప్పటినుంచి వారి జీవితం మలుపు తిరుగుతుంది. వారి జీవితంలోకి మదన్ (రాజీవ్) రావటంతో సమస్యలు వస్తాయి. ఇన్ సెక్యూర్ ఫీలింగ్ తో ఉండే రాహుల్ కి ఆమెపై అనుమానం మొదలవుతుంది. మీనాక్షి కూడా దానికి తగినట్లే బిహేవ్ చేస్తుంది. దాంతో ఆకాష్ లో అనుమానం పెరిగి పెద్దదై తీవ్రరూపం దాలుస్తుంది. ఇంతకీ మదన్ ఎవరు..ఆమె కూడా అలా అనుమానం కలిగేలా ఎందుకు బిహేవ్ చేసింది...చివరకు ఏమైందనే విషయం తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

     Maruthi's Love You Bangaram Review

    సినిమాలో చెప్పుకోవటానికి కానీ, చూడటానికి పెద్ద ఏమీ లేదు. మారుతి బ్రాండ్ నేమ్ తో ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రంలో దర్శకుడు కథ,కథనాలపై కన్నా సాధ్యమైనంత బూతుని డైలాగుల్లో చొప్పించటానికే ఎక్కువ శ్రమపడ్డారు. స్క్రీన్ ప్లే చాలా బోర్ గా తయారు చేసుకోవటంతో ఎక్కడా ఆసక్తి లేకుండా తెరపై సీన్స్ నడుస్తూంటాయి. అలాగే సీన్స్ లో డెప్త్ కానీ, చెప్పుకోతగ్గ విషయం గానీ లేకుండా సోసోగా నడిచిపోతూంటాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ కోసం మిగిలిన స్క్రీన్ టైం మొత్తం బలిచేసేసాడు దర్శకుడు. అలాగని ఎంటర్టైన్మెంట్ మీద అయినా ఆధారపడ్డాడా అంటే అదీ లేదు. ఉన్న కాస్తా బూతు ప్రవాహంలో కొట్టుకుపోయింది.

    ఇక దర్శకుడు సాఫ్ట్ వేర్ కంపినీ అంటూ చూపింది మరీ దారుణంగా ఉంటుంది. మహిత్ నారాయణ పాటలు అసలు ప్లస్ కాలేదు...సరికదా విసిగించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేస్తే సినిమాకి వెళ్లిన వారు కొద్దిలో కొద్ది సేవ్ అవుదురు. చాలా చోట్ల సినిమా మ్యూజిక్ ఆల్బం ని తలపించింది అంటే అది ఎడిటర్, దర్శకుడు అజాగ్రత్తే. కెమెరా వర్క్ కూడా సినిమా కంటెంట్ కి తగ్గట్లే పూర్ గా ఉంది.

    ఏదైమైనా క్రియేటివ్ కమర్షియల్ వంటి బ్యానర్ నుంచి ఇలాంటి సినిమాని ఊహించం. దమ్ము సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పి..ఇలా చిన్న సినిమాలు చేస్తున్నమని ఇలాంటి సినిమాలు చేస్తే బ్యానర్ వ్యాల్యూ పోవటం తప్ప మరేమీ ఉండదు. సి గ్రేడ్ సినిమాలను సి సెంటర్లలో కూడా ప్రేక్షకులు ఆదరించటం లేదనే విషయం దర్శకుడు ఈ సినిమా ఫలితం తో అయినా గ్రహిస్తే బాగుంటుంది.

    బ్యానర్ :క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ మారుతి టాకీస్
    నటీనటులు:రాహుల్ , రాజీవ్, శ్రావ్య తదితరులు
    సంగీతం: మహిత్,
    నేపథ్య సంగీతం: జె.బి.,
    ఎడిటింగ్: ఉద్ధవ్,
    కెమెరా: అరుణ్,
    నిర్మాతలు: వల్లభ, మారుతి,
    సమర్పణ :కె.యస్.రామానారావు
    కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోవి.

    English summary
    K.S.Rama Rao and Maruthi have jointly produced ‘Love You Bangaram’. This movie released today with divide talk.Rahul and Sravya have teamed up for this romantic film ‘Love You Bangaram’. The movie has been directed by Govi and Mahith Narayan has scored the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X