twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Masooda Review ఫర్‌ఫెక్ట్ హారర్, సస్పెన్స్ థ్రిలర్.. తిరువీర్, సంగీత ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating:
    3.0/5

    సినిమా పరిశ్రమలో సస్పెన్స్, హారర్ చిత్రాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. కంటెంట్ బాగుంటే.. చిన్న చిత్రమా? భారీ బడ్జెట్ చిత్రమా? స్టార్ హీరోలున్నారా? లేరా అనే విషయాన్ని పట్టించుకోకుండా అన్ని వర్గాల ఆదరించిన సందర్భాలు కోకోల్లలు. నిర్మాణ పరంగా మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా గతంలో మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సత్తా చాటుకొన్నాడు. జార్జిరెడ్డి లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నటుడు తిరువీర్‌తో కలిసి రాహుల్ నక్కా తాజాగా మసూద అనే హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? రాహుల్‌ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడా? అని విషయాలను తెలుసుకొందాం.

    మసూద సినిమా కథ..

    మసూద సినిమా కథ..

    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ గోపి (తిరువీర్) మహా భయస్తుడు, పిరికివాడు, మొహమాటస్థుడు. తన కంపెనీలో పనిచేసి మిన్ని (కావ్య కల్యాణ్ రామ్) అంటే పిచ్చి ప్రేమ. కానీ మనసులో మాట చెప్పడానికి వెనుకాడుతుంటాడు. ఇదిలా ఉంటే.. తన పొరుగింటిలో నీలం అనే టీచర్ (సంగీత) భర్తతో సపరేట్ అయి.. కూతురు నజియా హాసన్ (బాంధవి శ్రీధర్)తో జీవితం ముందుకు లాగడానికి కష్టాలు పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీలం కూతురుకు మసూద అనే దెయ్యం ఆవహిస్తుంది. దాంతో నీలంకు గోపి అండగా నిలువాలని అనుకొంటాడు.

    మసూద మూవీలో ట్విస్టులు

    మసూద మూవీలో ట్విస్టులు

    అసలే పిరికి వాడైన గోపి దెయ్యాల, పిశాచాల విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. నీలం, ఆమె కూతురు నజియాకు ఎలా అండగా నిలిచాడు? నీలం కుటుంబానికి సహాయం చేయడం వల్ల గోపికి ప్రియురాలి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. నీలం తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాశ్)కు ఎందుకు దూరమైంది? నజియాను మసూద అనే దెయ్యం ఎందుకు పట్టి పీడించింది. మసూదను వదిలించేందుకు పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లా ఉద్దీన్ (సత్యం రాజేశ్) ఎలాంటి చర్యలు తీసుకొన్నారు? ఇంతకు మసూద ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే మసూద సినిమా కథ.

    ఫస్టాఫ్ నిదానంగా..

    ఫస్టాఫ్ నిదానంగా..

    మసూద సినిమా భయంతో కూడిన హారర్ సన్నివేశాలతో ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి, కథను ప్రేక్షకులకు రుచి చూపించడానికి కాస్త ఎక్కువగానే తీసుకోవడం వల్ల సినిమా స్లో నేరేషన్‌లో సాగుతుందనే ఫీలింగ్ కలుగుంది. కానీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కారణంగా సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్టాఫ్‌లో తిరువీర్, కావ్య మధ్య లవ్ ట్రాక్ సున్నితంగా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. కమెడియన్ కృష్ణ తేజ సెన్సిబుల్ కామెడీ కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇక సంగీత కూతురికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో అసలు సినిమా కథ మొదలవ్వడమే కాకుండా మంచి లీడ్‌తో ఫస్టాఫ్‌ ముగియడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని రేపుతుంది.

    సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా

    సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా

    ఇక సెకండాఫ్‌లో సంగీత, తిరువీర్, కావ్య, శుభలేఖ సుధాకర్ లాంటి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేస్తుంది. మసూద ఎవరు అనే శోధన మొదలైన తర్వాత సినిమా పీక్స్‌కు వెళ్తుంది. ఫస్టాఫ్ క్వశ్చన్ పేపర్ అయితే.. సెకండాఫ్ ఆన్సర్ పేపర్‌లో ఉంటుంది. చివరి 20 నిమిషాలు సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

    కాంప్లికేటెడ్ కథతో దర్శకుడు సాయికిరణ్

    కాంప్లికేటెడ్ కథతో దర్శకుడు సాయికిరణ్

    దర్శకుడు సాయికిరణ్ రాసుకొన్న కథ లేయర్లు లేయర్లుగా ఉంటుంది. కథకు సంబంధించిన ప్రతీ పొర కూడా క్యూరియాసిటిని కలిగించేలా ఉంది. అయితే ట్విస్టులను రివీల్ చేసుకుంటూ పోయిన విధానం సాయికిరణ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. కథ, కథనాలు, ఆర్టిస్టులపై కమాండ్ స్పష్టంగా కనిపిస్తుంది. కత్తి మీద సాములాంటి చాలా కాంప్లికేటెడ్ కథను బాగా డీల్ చేశాడని చెప్పవచ్చు.

    తిరువీర్, సంగీత ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    తిరువీర్, సంగీత ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    దర్శకుడు సాయికిరణ్ విజన్‌కు అనుగుణంగా ఆర్టిస్టులు తిరువీర్, సంగీత, కావ్య, శుభలేఖ సుధాకర్, మిగితా ఆర్టిస్టులు తమ పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారని చెప్పవచ్చు. తిరువీర్ విషయానికి వస్తే.. పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో పరకాయ ప్రవేశమే చేశారనిపిస్తుంది. సెకండాఫ్‌లో తిరువీర్ మెచ్యురిటీతో కూడిన నటన హైలెట్‌ అని చెప్పవచ్చు. సంగీత కూడా నీలం పాత్రలో ఎమోషన్స్ చక్కగా పండించింది. భర్త పైశాచికత్వాన్ని భరించే భార్య, కూతురు సమస్యను పరిష్కరించే తల్లిగా తన పాత్రలో ఒదిగిపోయింది. తిరువీర్, సంగీత పోటీ పడ్డారనే కంటే.. వారిద్దరూ సమన్వయంతో కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పవచ్చు. కావ్య కల్యాణ్ రామ్ ఫీల్ గుడ్ పాత్రతో ఆకట్టుకొన్నది.

    ఆర్ట్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సూపర్..

    ఆర్ట్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సూపర్..

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మసూద సినిమాకు లోకేషన్లు స్పెషల్ ఎట్రాక్షన్. కథకు కావాల్సిన వాతావరణ, మూడ్ కేవలం లోకేషన్లతోనే వచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత నగేష్ బానెల్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్. లైటింగ్ ఉపయోగించిన విధానం, వాడుకొన్న కలర్ ప్యాలెట్ సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన మ్యూజిక్, ముఖ్యంగా రీరికార్డింగ్‌తో అదరగొట్టేశాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫి కాంబినేషన్ పలు సన్నివేశాలు భయాన్ని కలిగించాయి. ఇక ఈ సినిమాకు నిడివి పెద్ద కంప్లైయింట్. కొత నిడివి తగ్గించి ఉంటే.. సినిమాలో మరింత వేగం ఉండేదనిపిస్తుంది. ఎడిటర్ జెస్విన్ ప్రభుకు ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో ఏమో కానీ.. నిడివిని కాస్త ఎక్కువగానే పెంచేశాడనిపిస్తుంది.

    రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మసూద లాంటి కథను తెరకెక్కించాలంటే.. నిర్మాతకు గట్స్ ఉండాలి. పూర్తిగా ముస్లిం బ్యాక్ డ్రాప్‌తో సాగే కథను రాహుల్ యాదవ్ నక్కా నమ్మాడు కాబట్టే మంచి అవుట్‌పుట్ కనిపించింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పాత్రలకు తగినట్టుగా ఎంచుకొన్న నటీనటులను చూస్తే సినిమాపై వారికి ఉన్న ప్రేమ, అభిరుచి తెలియజేస్తుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    కథ, కథనం
    డైరెక్షన్,
    సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్
    నటీనటులు ఫెర్ఫార్మెన్స్
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    సినిమా నిడివి
    స్లో నేరేషన్
    మితిమీరిన హింస

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఫ్యామిలీ ఎలిమెంట్స్, భావోద్వేగం, లవ్, నటీనటుల ఫెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక అంశాల మేళవింపు మసూద సినిమా. సీట్లకు అత్తుకుపోయే కథనం, టేకింగ్, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాకు బలమైన అంశాలు. స్లో నరేషన్, నిడివి ఓ వర్గం ప్రేక్షకులకు కొంత ఇబ్బంది పెట్టే అంశాలుగా కనిపిస్తాయి. అయితే ఓవరాల్‌గా ఫర్‌ఫెక్ట్ సస్సెన్స్, థ్రిల్లర్‌కు ఈ సినిమా అడ్రస్. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సస్పెన్స్, థ్రిల్లింగ్, దెయ్యాల సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందనే హింట్ కూడా ఇచ్చారు. కాబట్టి.. మంచి థ్రియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలంటే.. మసూదను థియేటర్‌లోనే చూడండి..

    మసూదలో తెర ముందు.. తెర వెనుక

    మసూదలో తెర ముందు.. తెర వెనుక


    నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
    నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
    రచన, దర్శకత్వం: సాయికిరణ్
    బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
    ఆర్ట్: క్రాంతి ప్రియం
    సినిమాటోగ్రఫి: నగేష్ బానెల్
    స్టంట్స్: రామ్ కిషన్, స్టంట్ జాషువా
    సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
    ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
    పీఆర్వో: బి.వీరబాబు
    రిలీజ్ డేట్: 2022-11-18

    English summary
    Malli Rava, Agent Sai Srinivas Athreya fame, Producer Rahul Yadav Nakka's Latest film is Masooda. This movie hits the Theatres on November 18th. Here is Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X