Mass Jathara Movie Review: మాస్ జాతర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, నవ్య స్వామి తదితరులు
రచన, దర్వకత్వం: భాను భోగవరపు
డైలాగ్స్: నందూ సావిరిగణ
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫి: విధూ అయ్యన్న
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-10-31

చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన లక్ష్మణ్ భేరి (రవితేజ) తన పెదనాన్న (రాజేంద్రప్రసాద్) పెంపకంలో పెరిగి రైల్వేలో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా వరంగల్‌లో పనిచేస్తుంటాడు. అయితే ఊహించని విధంగా ఉత్తరాంధ్రలో గంజాయి దందా విపరీతంగా జరిగే అడవివరం రైల్వేస్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ కేజీ రెడ్డి (నవీన్ చంద్ర) ముఠా గంజాయి మాఫియాను కొనసాగిస్తూ అరాచకాలు సృష్టిస్తుంటాడు. ఆ గ్రామానికి చెందిన కాలేజీ స్టూడెంట్ తులసి (శ్రీలీల)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే రెడ్డి ముఠాతో లక్ష్మణ్‌కు వైరం పెరుగుతుంది. ఆ క్రమంలో రెడ్డి గ్రూప్ కలకత్తాకు భారీగా తరలించే గంజాయిని లక్ష్మణ్ స్వాధీనం చేసుకొని భారీ దెబ్బ కొడుతాడు.

Mass Jathara Movie Review and Rating

రవితేజ తన పెదనాన్నతో ఎలాంటి లైఫ్ లీడ్ చేశాడు? వయసు పెరిగినా పెళ్లి కాకపోవడానికి కారణం ఏమిటి? అడవివరం రైల్వే స్టేషన్‌కు ఎవరు ట్రాన్స్‌ఫర్ చేశారు? కాలేజీ స్టూడెంట్‌గా భావించిన తులసి నుంచి లక్ష్మణ్‌కు ఎదురైన షాకింగ్ సంఘటన ఏమిటి? తులసికి రెడ్డి నుంచి జరిగిన అన్యాయం ఏమిటి? తులసికి అన్యాయం చేసిన రెడ్డి లక్ష్మణ్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు? రెడ్డి సాగించే గంజాయి దందాకు లక్ష్మణ్ ఎలా మంగళం పాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే మాస్ జాతర సినిమా కథ.

దర్శకుడు భాను భోగవరపు తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమవుతూ ప్రయోగాలకు సిద్దపడలేదనే విషయం సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే అర్ధం అవుతుంది. రవితేజ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథ, కథనాలను అల్లుకొన్నాడనిపిస్తుంది. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా, స్టోరి, స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి సాహసం చేయకుండా రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల, యాక్షన్ ఎపిసోడ్స్‌తో మాస్ జాతరను నింపేశాడనిపిస్తుంది. రొటీన్ కథలో కూడా డైలాగ్స్‌తో పెన్ పవర్ చూపించే ప్రయత్నం చేశాడు.

ఇక రవితేజకు కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేకపోయింది. తాను ఇంతకు ముందు చేసిన విక్రమార్కుడు, క్రాక్ తరహాలోనే ఉండే పాత్రను చాలా సులభంగా, తన మేనరిజాన్ని మిక్స్ చేసి అలా చేసుకోంటూ పోయాడు. పాటలు, ఫైట్స్‌లో అదే ఎనర్జీని చూపించాడు. కొత్తగా తన అభిమానులకు అందించే సాహసం చేసినట్టు అనిపించడు. ఇక శ్రీలీలది కూడా అదే పరిస్థితి. నటించాలని ఉన్నా.. నటించడానికి స్కోప్ లేని పాత్రలో కనిపించారు. అక్క (నవ్య స్వామి)తో ఉన్న ఎమోషనల్ సీన్‌లో ఆకట్టుకొన్నది. కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే పరిమితమయ్యారు. గ్లామర్‌తో స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చింది.

ఇక మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. పవర్‌ఫుల్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించినట్టు అనిపించారు. విలన్‌గా వైవిధ్యం ప్రదర్శించలేని సాదాసీదా పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. హైపర్ ఆది, అజయ్ ఘోష్, వీటీవీ గణేష్ అలా చాలామంది కమెడియన్లు ఉన్నా వెరైటీ కామెడీ కనిపించదు. నవ్యస్వామి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. దర్శకుడే రచయిత కావడం కొంత ఊరట కలిగించే అంశం. డైలాగ్స్‌ మాస్ ఎలిమెంట్స్, కామెడీని పండించేందుకు శ్రమపడ్డారు. ఇక సినిమాకు భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్, పాటలు ప్లస్ పాయింట్స్. విధూ అయన్న సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లు, పాటలను కలర్‌ఫుల్‌గా చిత్రీకరించాడు. ఇక నాగవంశీ తదితరులు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్‌గా మాస్ జాతర గురించి చెప్పాలంటే.. రవితేజ మార్క్ మాస్, యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియెన్స్‌కు మాస్ మహారాజ్, శ్రీలీల కాంబో అలరించే అవకాశం ఉంది. కేవలం రవితేజ, శ్రీలీల ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలతో రూపొందించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే టైంపాస్ చేసే సినిమా. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్ ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి..

More from Filmibeat

Read more about: Mass Jathara ravi teja sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X