Mass Jathara Twitter Review: మాస్ జాతర ట్విట్టర్ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. నవీన్ చంద్ర విలన్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం కావడంతో మాస్ జాతరపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం. అక్టోబర్ 31న మాస్ జాతర సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో అక్టోబర్ 31వ తేదీ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాల్లోకి వెళితే..

Mass Jathara Twitter Review in Telugu  Ravi Teja steal the show with powerful role

బ్లాక్ బస్టర్ మూవీ... మన రవితేజ గారు పోలీస్ యూనిఫాం వేసిన ప్రతిసారి హిట్. మూవీ చాలా బాగుంది, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మెయిన్ అట్రాక్షన్, ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయ్, సాంగ్స్ కూడా గుడ్. ఓవరాల్‌గా మూవీ బ్లాక్‌బస్టర్ అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చారు.

మాస్ జాతర ఫస్ట్ రివ్యూ : పక్కా మాస్ మహారాజా కమర్షియల్ ఎంటర్‌టైనర్. మాస్ మహారాజా రవితేజ పవర్ ప్యాక్డ్ వింటేజ్ పర్ఫార్మెన్స్ అయితే ర్యాంపేజ్. నవీన్ చంద్ర కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్. శ్రీలీల తన పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు భాను భోగవరపు డైలాగ్స్ అయితే ఫైరే అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

మాస్ జాతర ఫస్టాఫ్ ఫుల్ మాస్ ట్రీట్. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, థండరింగ్ బీజీఎం, ఎలివేషన్ మూవ్‌మెంట్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అయి స్క్రీన్‌పై ఫైర్ కనిపించింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

మూవీ మాత్రం సూపర్బ్ ఉంది. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్, రవితేజ పోలీస్ క్యారెక్టర్ పీక్స్ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

సూపర్బ్ వింటేజ్ మాస్ మహారాజా. ఫస్టాఫ్ బ్లాస్టింగే.. బీమ్స్ సిసిరోలియో బీజీఎం, మ్యూజిక్ అయితే బ్టాస్ట్. నవీన్ చంద్ర అదిరిపోయ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని ఓ యూజర్ కామెంట్ చేశారు

మాస్ జాతర ఫస్టాఫ్ రివ్యూ... మాస్ మూవ్‌మెంట్స్‌తో నింపేశారు. పవర్‌ఫుల్ బీజీఎం, ఇంటర్వెల్ బ్యాంగ్‌ బాగుంది. ఫస్టాఫ్ సాలీడ్ ఎంగేజింగ్‌గా ఉంది. నవీన్ చంద్ర బెస్ట్ ఇచ్చాడు, బీమ్స్ సిసిరోలియోది నెక్ట్స్ లెవల్ డ్యూటీ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

మాస్ జాతర ఫస్టాఫ్ బ్లాక్‌బస్టర్. విక్రమార్కుడు రేంజ్ కామెడీ, సాంగ్స్, బీజీఎం, ఫైట్స్, ఇంటర్వెల్ సీన్ బాగున్నాయి. 200 కోట్ల క్లబ్ మూవీ. వింటేజ్ రవితేజ అన్న ఈజ్ బ్యాక్ అని ఓ అభిమాని రాసుకొచ్చాడు.

మాస్ + కామెడీ + యాక్షన్ = రవితేజ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్. ఎంట్రీ సీన్ అయితే ఫైర్. థియేటర్‌లో నాన్ స్టాప్ సెలబ్రేషన్ అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

మాస్ జాతర రిలీజ్ సందర్భంగా దర్శకుడు భాను భోగవరపు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ జర్నీ అంతా ఒకరిపై ఆధారపడి నడిచింది. ఆయనే నా హీరో మాస్ మహారాజ్ రవితేజ గారు. ఈ సినిమాకు రవితేజ సర్ డ్రైవింగ్ ఫోర్స్. సెట్‌లో మీ ఎనర్జీ, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం, మీతో కలిసి పనిచేయడం అనేది నా కల నెరవేరడం మాత్రమే కాదు. ఇది ఓ పాఠం. నా కథకు మెరుపులా, మొత్తం క్యాస్ట్ అండ్ క్రూకు మద్ధతుగా నిలిచినందుకు శ్రీలల గారికి ధన్యవాదాలు. నిర్మాత నాగవంశీ గారి వల్లే నాకు ఈ అవకాశం లభించింది. నా అద్భుతమై టీమ్ భీమ్స్ సిసిరిలియో గారు, విధు అయ్యన్న గారు, నవీన్ నూలీ, నాగేంద్ర తంగల, నందు సవిరిగనలు రేయింబవళ్లు కష్టపడటం వల్లే ఈ అద్భుతమైన క్షణాలు సాధ్యమయ్యాయి. సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ భాను భోగవరపు తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

ప్రీమియర్స్ బుకింగ్స్ మామూలుగా లేవు.. థియేటర్స్‌లో జాతరే. రవన్న కమ్ బ్యాక్ మూవీ ష్యూర్‌గా అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

మాస్ జాతర సెన్సార్ ఇన్ఫో: ఫస్టాఫ్ కంప్లీట్‌గా వింటేజ్ రవితేజ స్వాగ్, స్టైల్, కమెడీ టైమింగ్, పవర్‌ ప్యాక్డ్ ఇంటర్వెల్ సీక్వెన్సే. సెకండాఫ్‌లో పూర్తిగా యాక్షన్ బ్లాక్స్, ఎనర్జిటిక్ సాంగ్స్, హై ఓల్టేజ్ క్లైమాక్స్‌. కంప్లీట్‌గా ఇది ఎంటర్‌టైనింగ్ బొమ్మ అంటూ ఓ రవితేజ అభిమాని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Read more about: ravi teja sreeleela Mass Jathara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X