మెకానిక్ రాకీ రివ్యూ అండ్ రేటింగ్

రేటింగ్ : 3.25

నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, సునీల్, విశ్వదేవ్ రాచకొండ, హర్ష చెముడు, హైపర్ ఆది.
దర్శకుడు:రవితేజ ముళ్ళపూడి
నిర్మాతలు: రామ్ తళ్లూరి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
ఎడిటర్: అన్వర్ అలీ
బ్యానర్: ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్ డేట్: 22/11/2024

హైదరాబాద్ లోనే కాలేజీ చదువుతూ చదువుతూ తనకి ఆ చదువు సరిగా అబ్బకపోవడంతో రాకీ(విశ్వక్ సేన్) ని తన గ్యారేజ్ లోనే మెకానిక్ గా పెట్టేస్తాడు వాళ్ళ నాన్న(నరేష్). అలా తన గ్యారేజిలో మెకానిక్ పనులు , ఇంకోపక్క డ్రైవింగ్ స్కూల్ పెట్టుకొని వచ్చే కస్టమర్స్ కి డ్రైవింగ్ నేర్పిస్తూ విశ్వక్ సేన్ లైఫ్ లీడ్ చేస్తాడు. ఈ సమయంలో మాయ(శ్రద్దా శ్రీనాథ్) ఓ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ని అంటూ అక్కడ డ్రైవింగ్ నెక్కుర్చుకోవడం కోసం వస్తుంది. ఆమెకి డ్రైవింగ్ నేర్పించే సమయంలో విశ్వక్ సేన్ తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు.

అందులో తన లవ్ ప్రియా (మీనాక్షి చౌదరి) తో లవ్ ట్రాక్ ఏంటి? అలాగే ఆమె అన్నయ్య(విశ్వదేవ్ రాచకొండ) తో స్నేహం, వాళ్ళ కుటుంబానికి జరిగిన విషాదం అలాగే విశ్వక్ సేన్ కి కూడా జరిగిన ఓ విషాదం తర్వాత మరిన్ని సమస్యల్లో పడతాడు. హైదరాబాద్ లోనే పేరు మోసిన ల్యాండ్ బ్రోకర్ రంకిరెడ్డి(సునీల్) తో వైరం ఏంటి? దానికి మించి విశ్వక్ సేన్ ఎదుర్కొన్న పీకల్లోతు కష్టాల నుంచి ఎలా బయటపడతాడు అనేది సినిమాలో మెకానిక్ రాకీ అసలు కథ..

Mass Ka Das Vishwak Sen Mechanic Rocky Movie Review in Telugu

విశ్వక్ సేన్ కి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే తన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా బాగుంటుంది అని ఒక మార్క్ కూడా ఉంది. కానీ తన లైనప్ పరమ రొటీన్ గా మారింది ఏంటని చాలా మంది ఈ సినిమా ట్రైలర్ చూసి అనుకోని ఉంటారు. అయినప్పటికీ ఏదో చేసి రిలీజ్ కి తీసుకొచ్చాడు మాస్ కా దాస్. కాగా ఆ ట్రైలర్ లలో చూపించినట్టుగానే పరమ రొటీన్ గా చికాకు తెప్పించేలా వెరీ బిలో యావరేజ్ గా ఫస్టాఫ్ అంతా సాగుతుంది.

కొన్ని సీన్స్ అంత నవ్వు కూడా తెప్పించవు, పాటలైతే అనవసరంగా సినిమాని సాగదీసినట్టుగా అనిపిస్తాయి. అలాగే అంతా ఫ్లాట్ కథనంలా కొనసాగుతూ ఒక బోర్ ఫస్టాఫ్ లా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ కి వచ్చే నాటికి చిన్నగా ఓ ట్విస్ట్ తో ఆత్రుత మొదలవుతుంది. ఇలా ఒక డల్ ఫస్టాఫ్ చూసిన తర్వాత ఆడియెన్ కి సెకండాఫ్ నుంచి మొదలవుతుంది అసలు ట్రీట్మెంట్. పూర్తిగా ఫస్టాఫ్ కి భిన్నంగా క్రేజీ లెవెల్లో సెకండాఫ్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది.

ఇక్కడ విశ్వక్ సేన్ స్క్రిప్ట్ సెలక్షన్ తప్పు కాదు అని థియేటర్ లో ఆడియెన్స్ తమ మైండ్ సెట్ మార్చుకొని ఆద్యంతం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. కాగా ఈ క్రమంలో వచ్చే కొన్ని మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని రోల్స్ ని అయితే అసలు ఆ రేంజ్ లో ఊహించలేం. వీటితో మాత్రం ఒక పక్కా పైసా వసూల్ సినిమా చూసిన అనుభూతి. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కి ఈ సినిమా బాగా ఎక్కుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని దర్శకుడు రవితేజ ముళ్ళపూడి సాలిడ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసి మంచి ట్రీట్ అందించాడు. వీటి అన్నిటిని మించి వీరు ఇచ్చిన ఆన్లైన్ స్కామ్ అలర్ట్ మెసేజ్ దానిని మాస్ స్క్రీన్ ప్లే తో చెప్పడం బాగుంది.

Mass Ka Das Vishwak Sen Mechanic Rocky Movie Review in Telugu

ఇక నటీనటుల పెర్ఫామెన్స్ ల విషయానికి వస్తే.. ఈ సినిమాలో మెయిన్ లీడ్ అంతా మంచి నటన అందించారు అని చెప్పాలి. సినిమాలో హైలైట్స్ అండ్ సర్ప్రైజ్ మాత్రం విశ్వక్ సేన్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ లు అని చెప్పాలి. సెకండాఫ్ లో తమ రోల్స్ లో వారు చూపించిన షేడ్స్ అయితే అదిరిపోయాయి. అప్పటి వరకు ఒక యాంగిల్ లో కనిపించిన వీరు తర్వాత వారిలోని గ్రే షేడ్ ని అద్భుతంగా పండించారు.

విశ్వక్ సేన్ అయితే తన మాస్ కా దాస్ అనే ట్యాగ్ కి పక్కా నిర్వచనంగా కనిపిస్తాడు. తన డైలాగ్స్ కానీ లుక్స్, ఫైట్స్ ఇంకా పలు ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా చేసాడు. ఇంకా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి మంచి రోల్ డీసెంట్ నటనతో పాటు సెకండాఫ్ లో విశ్వక్ తో ఓ సాంగ్ లో డాన్స్ అదరగొట్టి గ్లామర్ షో కూడా చూపించి ఆకట్టుకుంటుంది. ఇక 35 చిన్న కథ కాదు ఫేమ్ యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ ఈ సినిమాలో మంచి రోల్ లో కనిపించాడు. అలాగే విలన్ రోల్ లో సునీల్ ఇంప్రెస్ చేస్తాడు. ఇంకా నరేష్, హైపర్ ఆది, వైవా హర్షలు నవ్విస్తారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా గ్యారేజీ సెట్స్, మిడిల్ క్లాస్ ఇంట్లో సెటప్ లు ఇలా ఆర్ట్ వర్క్ బాగుంది. అలాగే ఎడిటింగ్ లో పాటలు అన్నీ తీసేసినా పర్వాలేదు. అలా చేస్తుంటే కథనం ఇంకా గ్రిప్పింగ్ గా మారి ఉండొచ్చు. జేక్స్ బీట్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే నడిపించిన విధానం బాగుంది. ఇంకా నటీనటుల కాస్ట్యూమ్స్, డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీలో కొన్ని షాట్స్ కొత్తగా ట్రై చేశారు.

Mass Ka Das Vishwak Sen Mechanic Rocky Movie Review in Telugu

ఫైనల్ గా చూస్తే.. ఓ సాధారణ మెకానిక్ షెడ్ లో మెకానిక్ డ్రైవింగ్ స్కూల్ నడుపుకునే కుర్రాడు ఇచ్చిన మాస్ ఎంటర్టైనర్ ఇది అని చెప్పొచ్చు. ఎక్కువ రివీల్ చేయకూడదు కానీ సెకండాఫ్ లో విశ్వక్ రోల్ హైలైట్ గా కనిపిస్తుంది. సినిమాలో టచ్ చేసిన సోషల్ ఇష్యూ దాని అనుగుణంగా మాస్ ట్రీట్మెంట్ డెఫినెట్ గా థ్రిల్ చేస్తుంది. కాకపోతే సినిమాలో ఫస్టాఫ్ మాత్రం ఆకట్టుకోదు. ఇది పక్కన పెడితే థియేటర్స్ లో క్రేజీ ట్విస్ట్ లతో మాస్ కథనంని ఇష్టపడే ఆడియెన్స్ మెకానిక్ రాకీ ని తప్పకుండా వీక్షించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X