Masthu Shades Unnai Ra ఫన్, ఎమోషన్స్‌తో అభినవ్ గోమటం.. మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ సమీక్ష!
Rating: 2.5/5
బాల్యం నుంచే మనోహర్ (అభినవ్ గోమటం) టాలెంటెడ్ పెయింటర్. పేదరికంతో బాధపడుతూ గోడలపై పెయింట్స్ వేసుకొంటూ జీవితాన్ని లాగించేస్తుంటాడు. ఈ క్రమంలో ఉమాదేవి (వైశాలి రాజ్)తో పరిచయం ఆమెపై ప్రేమగా మారుతుంది. చిన్ననాటి స్నేహితుడుడు, రిచ్ ఫ్యామిలీలో పుట్టిన రాహుల్ (అలి రెజా) మనోహర్‌ను చూసి అవహేళన చేస్తుంటాడు. అయితే తన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు బ్యాంకు రుణం తీసుకొని ఫ్లెక్సి ప్రింటింగ్ బిజినెస్ మొదలుపెట్టాలని మను వేస్తాడు. అయితే తీరా ప్రింటింగ్ బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల వ్యాపారం బెడిసి కొట్టి మధ్యలోనే ఆగిపోతుంది.
మనోహర్ మొదలుపెట్టిన ఫ్లెక్సి ప్రింటింగ్ బిజినెస్‌కు ఆదిలోనే ఎలాంటి దెబ్బ పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి మనోహర్ ఆడిన నాటకం ఆయనను ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టింది? తాను ప్రేమించే ఉమాదేవితో ఎలాంటి విభేదాలు ఏర్పడ్డాయి. మనోహర్‌ను బిజినెస్‌ను రాహుల్ దెబ్బ తీయాలని ఎందుకు అనుకొన్నాడు? చివరకు మనోహర్ తన ముందు ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదురించి బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడా? ఫ్లెక్సి ప్రింటింగ్ బిజినెస్ ఎలా సాగింది? అనే ప్రశ్నలకు సమాధానమే మస్త్ షేడ్స్ ఉన్నాయిరా? సినిమా కథ.

మనోహర్ చిన్ననాటి ఎపిసోడ్‌తో కథ మంచి హ్యుమర్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత మనోహర్ పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లికూతురు మరో వ్యక్తితో లేచిపోవడం సీన్లు కథలో ఏదో విషయం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితేపెయింటింగ్ కష్టాలు, బిజినెస్ తదితర అంశాలు చాలా రొటీన్‌గా సాగడం.. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం వల్ల రెగ్యులర్ సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ నుంచి దర్శకుడు తిరు సెకండాఫ్‌లో తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం బాగుంది. చివరి 20 నిమిషాలు కథలో ఎమోషన్స్, డ్రామా పండటంతో ఫర్వాలేదు.. ఎలాంటి ఆర్బాటాలు, హింస, బోల్డ్ కంటెంట్ లేని మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడు తిరు రాసుకొన్న పాయింట్ బాగుంది. కానీ ఫోటోషాప్ నేర్చుకోవడం ఎలా అనే పాయింట్ సినిమాను సాగదీసిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొత్తం సింగిల్ పాయింట్‌పైనే సాగడం.. సెంటిమెంట్, ఎమోషన్స్ సాదాసీదాగా ఉండటం ఈ సినిమాకు మైనస్. స్క్రిప్టుపరంగా లోపాలు ఉన్నప్పటికీ.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ వాటిని కప్పిపుచ్చేలా చేసింది.

ఇక ఇప్పటి వరకు కమెడియన్‌గా రాణించిన అభినవ్ గోమటం ఒక సినిమాను లీడ్ చేసే క్యారెక్టర్‌లో తన వంతు వరకు మెప్పించాడు. మనోహర్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. సినిమా భారాన్ని తన భుజాల మీద మోస్తూ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. ఉమాదేవిగా వైశాలి రాజ్ ఆకట్టుకొన్నది. మనోహర్ మేనమామగా చక్రపాణి ఆనంద పాత్ర కామెడీ, ఎమోషన్స్ పండించింది. లైట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటనపరంగా ఆయన తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. రాహుల్‌గా అలి రెజా తదితరులు ఆకట్టుకొన్నారు.

మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాలో సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అంశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎడిటింగ్ విభాగానికి ఇంకా భారీగానే పని ఉంది. ముఖ్యంగా నిర్మాతలు భవానీ కాసుల, ఆర్ఎమ్ రెడ్డి, ప్రశాంత్ అనుసరించిని నిర్మాణ విలువలు బాగున్నాయి. కామెడీ, ఎమోషన్స్ కంటెంట్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











