Mathu Vadalara 2 Twitter Review: మత్తు వదలరా 2 సినిమా ట్విట్టర్ రివ్యూ.. సత్య చంపేశాడట!

తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా 2019 సంవత్సరంలో రిలీజైన మత్తు వదలరా సినిమా భారీ విజయం అందుకొన్నది. ఆ సినిమాకు సీక్వెల్‌గా మత్తు వదలరా 2 చిత్రం సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. శ్రీ సింహ కోడూరి హీరోగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించారు.

అందాల భామ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయం, రివ్యూల వివరాల్లోకి వెళితే..

Mathu Vadalara 2 Movie Twitter Review

మత్తు వదలరా 2 సినిమా చూశాను. హిలేరియస్ కామెడీ వర్కవుట్ అయింది. మూవీ అంతా కమెడియన్ సత్య కోసమే చూడాలి. ఈ సినిమాకు సత్య కామెడీ, ఫన్ బలంగా మారింది. ఆయన తన హాస్యంతో అదరగొట్టాడు అనే అభిప్రాయాన్ని ఓ నెటిజన్ పోస్టు చేశాడు.

మత్తు వదలరా 2 మూవీలో సత్య రచ్చ రంబోలా? తన కామెడీతో ఇరుగదీశాడు. వెర్రితనంతో ఇచ్చిపడేశాడు. ఈ జనరేషన్ యాక్టర్ ఆయనే. నవ్వి నవ్వి కడుపు పగిలిపోతుంది. ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మత్తు వదలరా రెడ్ కార్పెట్ షో చూశాను. ఫస్టాఫ్ బాగుంది. ప్యూర్‌గా సత్య కామెడీ రాంపేజ్. నవ్వలేక పొట్ట నొప్పి వచ్చింది. సత్య మనకు దొరికిన ఆణిముత్యం. ఈ సినిమాలో నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్. సెకండాఫ్ హాఫ్ బాగుంది. ఈ రేంజ్‌లో ఉంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మత్తు వదలరా 2 సినిమా చూశాను. కామెడీతో ఉన్న మాస్ థ్రిల్లర్. సీక్వెల్ అంటే ఇలా ఉండాలి. సత్య వన్ మ్యాన్ షో, వాటే టైమింగ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మత్తు వదలరా 2 వెరీ గుడ్ సీక్వెల్. క్లైమాక్స్‌లో ట్విస్ట్ బాగుంది. సత్య కామెడీ అద్బుతంగా ఉంది. ఫరియా గ్లామరస్‌గా కనిపించింది. ఈ సినిమాలో చిరంజీవి రెఫరెన్స్ బాగా వర్కవుట్ అయింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు బాస్ ఫ్యానిజంతో కుమ్మేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మత్తువదలరా చిత్రం సత్య వన్ మ్యాన్ కామెడీ షో. అద్బుతమైన యాక్టర్ అతడు. యేసుదాస్‌గా అందర్నీ నవ్వించేలా నటించాుడ. ఈ సినిమా చూసిన తర్వాత ఏం అయ్యా సత్య.. థియేటర్లలో అదరగొట్టేవు. రియల్లీ సూపర్బ్ టైమింగ్ అంటూ కామెంట్ చేశారు. రితేశ్ రానా డైరెక్షన్ బాగుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X