Mathu Vadalara 2 Review: మత్తు వదలరా సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా, రోహిణి తదితరులు
దర్శకత్వం: రితేష్ రానాః
నిర్మాత: చిరంజీవి (మైత్రీ చెర్రి), హేమలత
సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం
ఎఢిటింగ్: కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్: కాల భైరవ
బ్యానర్: కాల భైరవ, మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2024-09-13

స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలో డెలీవరీ బాయ్స్‌గా పనిచేసే బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాసు (సత్య) పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో HE Team లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్‌గా పనిచేస్తుంటారు. కిడ్నాప్, క్రైమ్ కేసులను పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో రియా అనే అమ్మాయి కిడ్నాప్ గురి అవుతుంది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో యేసు, బాబు కార్లోనే ఆ అమ్మాయి శవం లభిస్తుంది. దాంతో ఆ ఇద్దరిపై ఆకాశ్ (అజయ్), మైఖేల్ (సునీల్) లాంటి ఆఫీసర్స్ అనుమానించి వారిని ఛేజ్ చేస్తుంటారు.

Mathu Vadalara 2 Review in Telugu  Satya  Sri Simha Comedy worked out In Partly

రియా అనే అమ్మాయి మరణానికి కారణం ఏమిటి? బాబు మోహన్, యేసుదాసును మైఖేల్ ఎందుకు అనుమానిస్తుంటాడు? రియా డెత్ కేసుకు సినీ హీరో యువ (వెన్నెల కిషోర్)కు సంబంధమేమిటి? షీ టీమ్ ఆఫీసర్ నిధి వీరికి 10 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చింది? రియా హత్య వెనుక హస్తం ఎవరిది? ఈ కేసును బాబు, యేసు ఎలా పరిష్కరించారు? అనే ప్రశ్నలకు ఫన్‌తో కూడిన సమాధానమే మత్తు వదలరా 2 సినిమా కథ.

మత్తు వదలరా సినిమా ఊహించని హిట్‌ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అందరి చూపు ఈ సినిమాపై పడింది. దానికి తోడు ఈ మూవీ టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ రావడంతో సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మత్తు వదలరా తగినట్టుగా మంచి వినోదాన్ని దట్టించి సన్నివేశాలను రాసుకోలేకపోవడం ఈ సినిమాకు కొంత మైనస్. అయితే సత్య కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాయి. కానీ కథలో బలమైన పాయింట్ లేకపోవడం.. ఒకే పాయింట్‌పై కథ నడవడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక టీవీ సీరియల్ వ్యవహారం సినిమాపై ఆడియెన్‌కు పట్టును కోల్పోయేలా అడ్డుపడిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగిన సన్నివేశాలు బాగుండటం వల్ల మూవీపై ఓ పాజిటివ్ ఫీలింగ్‌తో ఫర్వాలేదనిపిస్తుంది.

Mathu Vadalara 2 Review in Telugu  Satya  Sri Simha Comedy worked out In Partly

ఇక దర్శకుడు రితేష్ రానా మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లేలో కొత్తతనం లేకుండా అదే రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌లో ముందుకు వెళ్లాడు. ఈ సినిమాకు సెట్ ఆఫ్ ఆడియెన్స్ ఉండటంతో కొత్తగా ట్రై చేయడానికి వీలు కాలేదేమో అనిపించేలా ఈ సినిమాను అందించాడనిపిస్తుంది. మొదటి పార్ట్‌తో పోల్చుకొంటే.. ఫన్, డైలాగ్స్‌లో అంత ఇంపాక్ట్ కనిపించలేదని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్లు కొంత ఫ్రెష్ నెస్‌ను తీసుకొచ్చాయి.

మత్తు వదలరా 2 సినిమా నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సత్య యాక్టింగ్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను పాజిటివ్ అంశాలు. శ్రీ సింహా తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. సత్య క్యారెక్టర్ డామినేషన్ ముందు బాబు మోహన్ రోల్ తేలిపోయేలా చేసింది. ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ లేకపోతే సినిమా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. రోహిణి, సునీల్, అజయ్ తదితర క్యారెక్టర్లు కథలో భాగంగా ఉన్నాయే తప్పా.. స్టోరీని, సీన్స్ ఎలివేట్ చేసేలా కనిపించవు.

Mathu Vadalara 2 Review in Telugu  Satya  Sri Simha Comedy worked out In Partly

ఈ మూవీకి అత్యంత బలం టెక్నికల్ అంశాలే అని చెప్పవచ్చు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫి బాగుంది. సన్నివేశాలకు తగినట్టుగా వాడుకొన్న లైటింగ్ మూడ్ బాగా క్రియేట్ చేసింది. ఇక చాలా సన్నివేశాలను కాల భైరవ తన బీజీఎంతో చక్కగా ఎలివేట్ చేశారు. రేసే స్క్రీన్ ప్లేకు తగినట్టుగానే ఎడిటింగ్‌తో కార్తీక్ శ్రీనివాస్ తన ప్రతిభను మరోసారి చూపించాడు. చెర్రీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మూవీలో ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు.

ఫైనల్‌గా సత్య కామెడీ మాత్రమే ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించేలా చేసింది. మత్తు మదలరా ఇచ్చిన కిక్ దృష్టిలో పెట్టుకొని హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళితే నిరాశ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ అంచనాలతో వెళితే మంచి అనుభూతి పొందే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ రెఫరెన్స్ ఫ్యాన్స్‌కు ఫీస్టులా ఉంటాయి. ఈ వారం మంచి ఫన్ మూవీ చూడాలంటే.. ఈ సినిమాను ఎలాంటి అనుమానాలు లేకుండా ఎంచుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X