Matka Censor Review: మట్కా సెన్సార్ బోర్డు రివ్యూ.. మరో 20 ఏళ్లపాటు వరుణ్‌తేజ్ గురించే!

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన చిత్రం మట్కా. ఉత్తమ కథా చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీన భారీగా రిలీజ్ అవుతున్నది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

మట్కా జూదాన్ని ముంబైలో ప్రారంభించిన రతన్ ఖాత్రి జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని రూపొందించిన చిత్రమిది. అయితే ఈ సినిమా వాసు అనే 30 ఏళ్ల జీవితం గురించిన స్టోరి. సాధారణ యువకుడు అసాధ్యుడిగా మారిన తీరును కరుణ కుమార్ తెరపైన ఆవిష్కరించారు. బర్మా నుంచి శరణార్థిగా వచ్చిన ఓ చిన్నాడు.. వైజాగ్‌ను తన కనుసన్నల్లో ఎలా ఏలాడు అనేది ఈ సినిమా కథ.

Matka Censor Board Review  Varun Tej performance and Karuna Kumar vision are highlight

70వ దశకం నుంచి 90వ దశకం వరకు వైజాగ్‌లో ఉన్న పరిస్థితులను తెరపైన చూపించడానికి అప్పటి వాతావరణంతో సెట్స్ వేశాం. చాలా వరకు పిరియాడిక్ మూవీ ఫీల్ కలిగించే విధంగా కలర్ టోన్ వాడుకొన్నాం. వైజాగ్‌లో ఆ సమయంలోని క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ అన్నీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. మట్కా పక్కా కమర్షియల్ సినిమానే కాకుండా స్టయిలీష్ ఫిల్మ్‌గా రూపొందింది.

అయితే ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు. కథను రాసిన విధానం, కరుణ కుమార్ స్విల్లర్ స్క్రీన్‌పై చూపించిన విధానంపై అధికారులు ప్రశంసలు గుపించారు. అలాగే వరుణ్ తేజ్ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన తీరు, ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్‌ గురించి దర్శకుడితో సెన్సార్ అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. మీనాక్షి చౌదరీ పాత్ర ద్వారా ఎమోషన్స్ దట్టించిన విధానం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చెప్పినట్టు తెలిసింది.

Matka Censor Board Review  Varun Tej performance and Karuna Kumar vision are highlight

అయితే ఈ మూవీలో కొంత ఘాటైన డైలాగ్స్, సన్నివేశాలు ఉన్నాయి. కానీ అలాంటి సన్నివేశాలు, మాటలు కథ డిమాండ్ మేరకు ఉండటంతో వాటిని తొలగించకుండా వదిలేశారు. ఒక మంచి విషయాన్ని చెప్పేందుకు వాడటంలో తప్పేమీ లేదన్నారు. చివరకు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

సెన్సార్ రిపోర్టు ప్రకారం.. మట్కా సినిమా వరుణ్ తేజ్‌కు కమ్ బ్యాక్ సినిమానే కాకుండా కెరీర్‌లో 20 ఏళ్లపాటు గుర్తు చేసుకొనేలా ఉంటుంది. జీవీ ప్రకాశ్ అందించిన పాటలు, మ్యూజిక్, యాక్షన్ సీన్లకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవర్‌ఫుల్‌గా ఉందని విషయం బయటకు వచ్చింది. ఏది ఏమైనా సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అఫీషియల్స్ ఇచ్చిన రిపోర్టుతో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.

More from Filmibeat

Read more about: varun tej karuna kumar matka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X