Matka Movie Review: మట్కా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహి, సలోని అశ్విని,సత్యం రాజేశ్, పీ రవిశంకర్, కన్నడ కిషోర్,నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు
కథ, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజేందర్ రెడ్డి తీగల,రజనీ తాళ్లూరి
సినిమాటోగ్రఫి: కిషోర్ కుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-11-14
బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్‌కు వచ్చిన వాసు (వరుణ్ తేజ్) అనే యువకుడు స్థానికంగా జరిగిన గొడవలో జైలుకు వెళ్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) వద్ద చేరుతాడు. ఆ తర్వాత నాని బాబు (కన్నడ కిశోర్)తో చేతులు కలిపి వ్యాపారాన్ని విస్తరిస్తాడు. రాజకీయాలు, మాఫియాను ఎదురిస్తూ వైజాగ్‌ను శాసించే స్థాయికి ఎదుగుతాడు.

అయితే వైజాగ్‌లో కొబ్బరికాయల దుకాణంలో పనిచేసే వాసు బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వర్కవుట్ అయిందా? బట్టల కోసం ముంబై వెళ్లిన వాసును మలుపు తిప్పిన సంఘటన ఏంటి? సుజాత (మీనాక్షి చౌదరీ)తో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు ఎలా వెళ్లింది? సోఫియా (నోరా ఫతేహి)తో వచ్చిన సమస్య ఏమిటి? కేబీ (జాన్ విజయ్)తో ఉన్న వైరం ఏమిటి? చిన్న వ్యాపారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే మట్కా కింగ్‌గా వాసు ఎలా మారాడు? అలాగే చట్టవ్యతిరేకంగా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్న వాసును అరెస్ట్ చేయడానికి వచ్చిన సాహు (నవీన్ చంద్ర) సక్సెస్ అయ్యాడా? చివరకు వాసు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే మట్కా మూవీ కథ.
మట్కా కింగ్ రతన్ ఖాత్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ వైజాగ్ పరిస్థితులకు అనుగుణంగా రాసుకొన్న కథ.. డిజైన్ చేసుకొన్న పాత్రలు చాలా బాగున్నాయి. 70 దశకంలో పాత్రలు బిహేవియర్, యాటిట్యూడ్, వారి దుస్తులు, హెయిర్ స్టయిల్ లాంటి వాటి గురించి తీసుకొన్న జాగ్రత్తలు ఎక్సలెంట్ అనిపిస్తాయి. ఈ విషయాలను ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డాయి. అయితే కథలో వేగం లేకపోవడం, కథనం ఫ్లాట్‌గా ఉండటం వల్ల ప్రేక్షకుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు.

వాసు జీవితం చుట్టు జరిగే పాత్రలతో ముడిపడి ఉన్న ఎమోషన్స్ పూర్తిగా ఎలివేట్ కాకపోవడం.. డైలాగ్ పార్ట్ ఎక్కువ కావడంతో విజువల్ డ్రామా తగ్గినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా టేకింగ్ పరంగా తన సత్తాను చాటుకొనేందుకు రాసుకొన్న కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటే.. మరికొన్న సన్నివేశాలు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. వరుణ్ తేజ్‌తో సుమారుగా 5 నిమిషాలు చెప్పిన కథ లాంటి సీన్లు ఆకట్టుకోలేకపోయాయి. కాకపోతే కొత్తదనం, స్టోరీలో నావెల్టీ వెతుక్కొనే ప్రేక్షకులను మాత్రం కరుణ కుమార్ సంతృప్తి పరిచాడనే చెప్పొచ్చు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ప్రమోషన్స్‌లో దర్శకుడు కరుణ్ కుమార్ చెప్పినట్టే వరుణ్ తేజ్ పెర్ఫారెన్స్ విషయంలో ఇరుగదీశాడు. వాసు తప్ప వరుణ్ తేజ్ ఎక్కడా కనిపించలేదంటే.. నటుడిగా ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేశాడో స్క్రీన్ మీద చూడాల్సిందే. రకరకాల గెటప్స్, గెటప్‌కు తగినట్టు బాడీ లాంగ్వేజ్, సన్నివేశానికి తగినట్టు హావభావాలు చక్కగా పలికించాడు. మీనాక్షి చౌదరీ ఉన్నంత సేపు ఆకట్టుకొనే విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
మట్కా మూవీలో కన్నడ కిషోర్, జాన్ విజయ్, సత్యం రాజేశ్, అజయ్ ఘోష్, నవీన్ చంద్ర అందరూ కొత్తగా కనిపిస్తారు. వారందరికీ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలో ఆలరించారు. నోరా ఫతేహికి గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో మెప్పించారు. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఆర్ట్ వర్క్ చూస్తే అద్బుతంగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్‌లోను కళ ఉట్టిపడేలా ఉండటమే కాకుండా ఆ పిరియాడిక్ జోన్‌లో ఉన్నామా? అనే ఫీల్ కల్పించింది. ఇక సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఎడిటింగ్, క్యాస్టూమ్ విభాగాలు సినిమాకు బలంగా నిలిచాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
అతి సాధారణంగా ఉండే వ్యక్తి వాసు వ్యవస్థను శాసించే అసాధారణ వ్యక్తిగా ఎలా మారాడనే జర్నీనే మట్కా సినిమా. లవ్, ఎమోషన్స్, యాక్షన్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథలో వైవిధ్యం, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకుండా ఫ్లాట్‌గా కథ సాగడం మైనస్. అయితే చరిత్రలో మంచిగానో.. చెడుగానో సమాజాన్ని ప్రబావితం చేసిన వ్యక్తుల జీవితాలపై వచ్చి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కరుణ కుమార్ విజన్ బాగుంది.. కానీ స్క్రిప్టు స్క్రీన్‌పైకి తీసుకు రావడంలో కరుణ కుమార్‌లో అక్కడక్కడ తడబాటు కనిపించినా.. ప్రేక్షకుడిని మాత్రం నిరాశపరచడు.


Click it and Unblock the Notifications











