Matka Twitter Review: మట్కా సినిమా ట్విట్టర్ రివ్యూ.. వరుణ్ తేజ్‌కు హిట్టు పడిందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరీ జంటగా నటించిన చిత్రం మట్కా. పలాస, శ్రీదేవి డ్రామా సెంటర్ లాంటి హిట్స్ అందించిన కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు.

నవంబర్ 14వ తేదీన రిలీజైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఒక రోజు ముందే అంటే 13వ తేదీ రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

Matka Telugu Movie Twitter Review

మట్కా సినిమా కథ ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు అనే వ్యక్తి బర్మా నుంచి వైజాగ్‌కు ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్‌లో ఉన్న పెద్ద మనుషులుగా ప్రభావితమయ్యే వాళ్లంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. వైజాగ్‌లో ఆ పెద్దలకు, వాసుకు మధ్య అధిపత్య పోరు ఎలా సాగింది మట్కా గ్యాబ్లింగ్ గేమ్ అంటే ఏమిటి? దాన్ని ఎలా కొనసాగించారు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్‌ను ఎలా పంపించారనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

మట్కా సినిమా గురించి వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. కొన్ని నెలల కఠిన శ్రమ, అంకిత భావానికి ప్రతిరూపం ఈ సినమిా. మట్కా మూవీని ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి మీ ముందుకు తెచ్చాం. మేము అన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేసే విధంగా రూపొందించిన మీకీ ఈ మూవీ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.


మట్కా సినిమా రిలీజ్ సమయంలో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేసి.. బాబూ వరుణ్ తేజ్. ఈసినిమా మీకు భారీ విజయం అందిస్తుందని భావిస్తున్నాను. వాసు రోల్ కోసం నీవు ఎంత చెమట చిందించావో నాకు తెలుసు. స్క్రీన్ మీద నువ్వు అద్బుతంగా ఉన్నావు. నీ బ్లాక్ బస్టర్ విజయం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మట్కా ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.వరుణ్ తేజ్ తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్పార్మెన్స్‌ను ఇచ్చారు. అతడి కెరీర్‌లో కనీసం 20 ఏళ్లు గుర్తుంచుకొనేలా ఉంటుంది. వరుణ్ తేజ్ పేరు గుర్తుకు వస్తే.. తప్పకుండా మట్కా సినిమా గుర్తుకు వస్తుంది అనే విషయాన్ని కరుణ కుమార్ చెప్పినట్టు ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X