twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Matti Kusthi Review ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్ రైడ్.. విష్ణు విశాల్, రవితేజ కాంబినేషన్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ, శత్రు, అజయ్ కాళి వెంకట్, రెడిన్ కింగ్స్‌లే, హరీష్ పెరడీ, శత్రు, అజయ్ తదితరులు
    రచన, దర్శకత్వం: చెల్ల అయ్యవు
    నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్, సుభద్ర, ఆర్యన్ రమేష్
    సినిమాటోగ్రఫి: రిచర్డ్ ఎం నాథన్
    ఎడిటింగ్: ప్రసన్న జీకే
    మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
    బ్యానర్: ఆర్టీ టీమ్ వర్క్స్, వీవీ స్టూడియోజ్
    రిలీజ్ డేట్: 2022-12-02

    మట్టి కుస్తీ కథ ఏమిటంటే?

    మట్టి కుస్తీ కథ ఏమిటంటే?


    బాబాయ్ ‌కలను సాకారం చేయడానికి కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) కుస్తీ క్రీడలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. కుస్తీ కారణంగా పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇక ఊరిలో పనీపాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే వీర (విష్ణు విశాల్) కబాడ్డీ ప్లేయర్. రెండు అబద్దాలు ఆడి వీరతో కీర్తి పెళ్లిని ఆమె కుటుంబం జరిపిస్తుంది. అయితే ఓ సంఘటన కారణంగా ఇద్దరికి అభిప్రాయభేదాలు తలెత్తి విడిపోతారు.

    మట్టి కుస్తీ కథ ట్విస్టులు

    మట్టి కుస్తీ కథ ట్విస్టులు

    కుస్తీ క్రీడాకారిణి కావడం వల్ల కీర్తి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? కీర్తీ బాబాయ్ కల ఏమిటి? కీర్తి పెళ్లి కోసం రెండు అబద్దాలు ఏమిటి? కీర్తీ, వీర ఎందుకు విడిపోయారు? భర్తతో విడిపోయిన తర్వాత కీర్తీ మళ్లీ కుస్తీని ఎందుకు మొదలుపెట్టింది? కీర్తి కోసం వీర ఎందుకు కుస్తీ క్రీడను ఎంచుకొన్నాడు? కుస్తీ క్రీడలో వీర ఛాంపియన్ అయ్యాడా? కీర్తీని వీర అర్ధం చేసుకొన్నాడా? చివరకు కీర్తీ, వీర ఎలా కలుసుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే మట్టి కుస్తీ సినిమా కథ.

    మట్టి కుస్తీ  ఎలా ఉందంటే?

    మట్టి కుస్తీ ఎలా ఉందంటే?

    హాస్యం, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో మట్టి కుస్తీ చిత్రం కథ మొదలువుతుంది. కుస్తీ క్రీడాకారిణి కావడంతో కీర్తీ పెళ్లికి ఎదురైన ప్రతీకూలత మధ్య కథ ముందుకెళ్తుంది. ఫన్ ఎలిమెంట్స్ మధ్య వీర, కీర్తి పెళ్లి తంతు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇక పెళ్లి తర్వాత సన్నివేశాలు ఫన్ హిలేరియస్‌గా సాగుతుంది. ఓ ఎమోషనల్ పాయింట్‌తో తొలి భాగం ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథలో జరిగే ట్విస్టులు ఆసక్తిని రేపుతాయి. కీర్తీ కోసం 15 రోజుల్లోనే కుస్తీ నేర్చుకోవాలనుకోవడం చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌కు ఆ పాయింట్ బలంగా మారిందని చెప్పవచ్చు.

    దర్శకుడి గురించి..

    దర్శకుడి గురించి..

    మహిళా చైతన్యం అనే కాన్సెప్ట్‌కు పూర్తి కామెడీతో దర్శకుడు చెల్ల అయ్యావు రాసుకొన్న పాయింట్ బాగుంది. అయితే ఫస్టాఫ్‌లో కథలోకి వెళ్లడానికి ఎక్కువగానే సమయం తీసుకొన్నప్పటికీ.. ఫన్ మాత్రం మిస్ కాకుండా చూసుకొన్నాడు. ఫస్టాఫ్‌లో తొలి 15 నిమిషాలు రొటీన్‌గా, నిదానంగా సాగడం కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఇక కతలో కీర్తీ, వీర పాత్రలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. గ్రామీణ నేపథ్యంతో ప్రతీ ఫ్రేమ్‌లో నేటివిటిని జొప్పించే ప్రయత్నం బాగుంది. సెకండాఫ్‌లో కీర్తీ, వీర రోల్స్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. రెగ్యులర్ కథ అయినప్పటికీ.. రొటీన్‌‌కు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశాడు.

    విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ

    విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ

    ఇక నటీనటుల విషయానికి వస్తే.. విష్ణు విశాల్ తొలిసారి ఊర మాస్ అవతారంలో రెచ్చిపోయాడు. యాక్షన్, ఓ తరహా పాత్రలో కనిపించిన విష్ణు విశాల్ ఈ సారి కామెడీతో అదరగొట్టాడు. సెకండాఫ్‌లో విష్ణు విశాల్ కథను తన భుజాన మోసే ప్రయత్నం చేశారు. తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాలో విష్ణు విశాల్ కొత్తగా కనిపిస్తాడు. ఇక ఐశ్వర్య లక్ష్మీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు పెద్దగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ పాత్రలకే పరిమితమైంది. కానీ మట్టి కుస్తీలో మాత్రం కథ మొత్తం తన మీద సాగే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. కుస్తీ పోటీలలో, యాక్షన్ సీన్లలో హీరోకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకొనే ప్రయత్నం చేసింది. ఎమోషనల్ సీన్లలో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

    మిగితా క్యారెక్టర్ల గురించి

    మిగితా క్యారెక్టర్ల గురించి

    మట్టి కుస్తీ చిత్రంలో మిగితా పాత్రలను కూడా దర్శకుడు బలంగా రాసుకొన్నారు. కాళీ వెంకట్, విష్ణు విశాల్ మామ పాత్ర, అలాగే కీర్తీ బాబాయ్ పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్. ఈ పాత్రలన్నీ కామెడీ పండించడంతో కథను ఎమోషనల్‌గా మార్చేందుకు పనికి వచ్చాయి. శత్రు, అజయ్ సాఫ్ట్ విలనిజం బాగుంది. మిగితా పాత్రల్లో కనిపించిన వారు.. తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    తెర వెనుక నిపుణుల గురించి

    తెర వెనుక నిపుణుల గురించి

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రిచర్డ్ ఎం నాథన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కుస్తీ, కబాడ్డీ క్రీడలకు సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి. గ్రామీణ వాతావారణాన్ని చక్కగా కెమెరాలో బంధించాడు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ మైనస్. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా పాటలు లేవు. సినిమాలో ఎక్కువగా తమిళ వాసన గుభాలించింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని పాటలు కంపోజ్ చేసి ఉంటే మరీ బాగుండేది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. రవితేజ, విష్ణు విశాల్ బ్యానర్ల నిర్మాణ విలువలు బాగున్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    విష్ణు విశాల్, ఐశ్వర లక్ష్మీ
    కామెడీ ఎలిమెంట్స్

    మైనస్
    రోటీన్ కథ, రెగ్యులర్‌గా కథనం
    ముందే ఊహించేలా క్లైమాక్స్
    మ్యూజిక్

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    రూరల్ నేటివిటితో స్ప్రోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఆద్యంతం వినోదంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మట్టి కుస్తీ. కథ, కథనాలు కొత్తగా లేకపోవడం ఈ సినిమా కొంత మైనస్. కానీ ఫన్, కామెడీతో కూడిన సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఓవరాల్‌గా కథ చూస్తే..యావరేజ్‌గా అనిపిస్తుంది. కానీ సీన్లు సీన్లుగా సినిమా హిల్లేరియస్‌గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే మంచి వినోదంతోపాటు చక్కని ఫ్యామిలీ డ్రామాను ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరిస్తే ఈ సినిమా విజయం నల్లేరు మీద నడుకే. ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఉన్న చిత్రం మట్టి కుస్తీ. థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా ఛాన్స్ ఉంది.

    English summary
    Mass Maharaj Ravi Teja and Vishnu Vishal's Matti Kusthi released in Theatres on Dec 2nd. Aishwarya Lekshmi played crucial role. Here is the Telugu Filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X