Max Movie Review: మ్యాక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: సుదీప కిచ్చ, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, శరత్ లోహితస్వ, ఆడుకాలమ్ నరేన్, ఇలవరసు తదితరులు
దర్శకత్వం: విజయ్ కార్తికేయ
నిర్మాత: కలైపులి థాను, సుదీప
సినిమాటోగ్రఫి: శేఖర్ చంద్ర
ఎడిటింగ్: ఎస్ఆర్ గణేష్ బాబు
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
బ్యానర్: వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2024-12-27

నిజాయితీతోపాటు కఠినంగా వ్యవహరించే పోలీస్ ఆఫీసర్ అర్జున్ (సుదీప కిచ్చ) ట్రాన్స్‌ఫర్‌ అయి తెల్లారితే డ్యూటీ ఛార్జ్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. తాను విధిలో చేరాల్సాని పోలీస్ స్టేషన్ పరిధిలో పలుకుబడి ఉన్న బిజినెస్ మ్యాన్ ఘని (సునీల్) ఇచ్చిన పార్టీలో మంత్రులు (శరత్ లోహితాస్వ, ఆడుకాలమ్ నరేన్) కొడుకులిద్దరిని అర్జున్ అరెస్ట్ చేస్తాడు. అయితే అనుమానాస్పద పరిస్థితుల్లో మంత్రుల కొడుకులిద్దరు లాకప్‌లో మరణిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మంత్రులు కొడులిద్దరిని విడిపించుకొనేందుకు మంత్రుల సైన్యం పోలీస్ స్టేషన్‌పై దాడికి సిద్దమవుతారు.

Max Movie Review in Telugu  Sudeepa Kichcha terrific performance

మంత్రుల కొడుకులను అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? మంత్రుల కొడులిద్దరి అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? పోలీస్ స్టేషన్‌లో మంత్రుల కొడుకులు ఎలా మరణించారు? మినిస్టర్ కొడుకుల మరణం తర్వాత అర్జున్‌కు ఎదురైన సవాళ్లు ఏమిటి? అర్జున్‌కు వ్యతిరేకంగా ఇన్స్‌పెక్టర్ రూప (వరలక్ష్మీ శరత్ కుమార్) ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేసింది? ఈ వ్యవహారంలో ఘని పాత్ర ఏమిటి? మంత్రుల అనుచరుల దాడిని అర్జున్ తిప్పి కొట్టాడు? మంత్రుల కొడుకుల మరణాల వెనుక అసలు మిస్టరీ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మ్యాక్స్ (Max Movie) సినిమా కథ.

మంత్రుల కొడుకుల అరెస్ట్‌తో ఆలస్యం చేయకుండా దర్శకుడు విజయ్ కార్తికేయ కథలోకి డైరెక్టుగా వెళ్లిపోయి యాక్షన్‌కు తెరలేపాడు. ఫస్టాఫ్‌లో లాజిక్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్ ఉన్నాయనిపించినా.. హై ఓల్టేజ్ ఫైట్స్ మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్కించేలా ఉంటాయి. అయితే ఫస్టాఫ్ నిండా యాక్షన్ కొరియోగ్రఫికి ఎక్కువ పెద్ద పీట వేయడం వల్ల రొటీన్ అనిపిస్తుంది. కానీ ఆడియెన్స్‌కు మంచి ఫీల్ ఇచ్చే విధంగా సీన్లను డిజైన్ చేయడంతో దర్శకుడు రెగ్యులర్ ప్యాటర్న్‌ను బ్రేక్ చేశాడనే ఫీలింగ్ కలిగిస్తుంది.

మ్యాక్స్ సినిమా సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎమోషనల్ సీన్లతో దర్శకుడు ట్విస్టులను క్రియేట్ చేసిన విధానం.. ఆ ట్విస్టుల ముడిని విప్పిన విధానంతో సినిమాపై అటు దర్శకుడు, ఆడియెన్స్‌ పట్టు బిగించడానికి అవకాశం ఏర్పడిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఓ టీనేజ్ అమ్మాయి కథను యాక్షన్ డ్రామాలోకి తీసుకొచ్చి.. అప్పటి వరకు ఉన్న మాస్ సినిమాను పూర్తిగా హ్యుమన్ ఎమోషన్ స్టోరీగా మార్చడంతో సినిమా ఫ్లేవర్ పూర్తిగా మారిపోతుంది. డైరెక్టర్ ఇంటెలింజెంట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలంగా మారిందని ఫీలింగ్ కలుగుతుంది.

ఇక సుదీప కిచ్చకు ఉన్న మాస్ ఇమేజ్ తగినట్టుగా దర్శకుడు విజయ్ అర్జున్ క్యారెక్టర్‌ను టైలర్ మేడ్ క్యారెక్టర్‌గా డిజైన్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్, యాటిట్యుడ్‌కు తగిన పాత్రలోకి సుదీప పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకు మాస్‌ హీరోగా కొత్త అవతారాన్ని చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలోను అలాగే క్లైమాక్స్‌లో ఇచ్చిన వేరియేషన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, ఆడుకాలమ్ నరేన్, శరత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ సిబ్బందిగా సంయుక్త హోర్నాడే, సుకృత వాగ్లే, రావణ్‌గా ఇలవరసు తమ నటనతో మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ విషయానికి వస్తే.. మ్యాక్స్ మూవీకి సినిమాటోగ్రఫి, స్టంట్స్, మ్యూజిక్ హైలెట్‌గా నిలిచాయి. సినిమా మొత్తం ఒకరాత్రి జరిగే కథ కావడంతో నైట్ ఎఫెక్ట్ విజువల్స్‌ను బాగా డిజైన్ చేశారు. శేఖర్ చంద్ర విజువల్స్‌ను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను బాగా తీశారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫి ఈ సినిమా అదనపు ఆకర్షణగా మారాయి. వీ క్రియేషన్ బ్యానర్‌పై కలైపులి థాను అనుసరించిన, పాటించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

హ్యూమన్ ఎమోషన్స్‌తో సాగే హై ఓల్డేజ్ ఎనర్జీ యాక్షన్ మూవీ మ్యాక్స్. సుదీప ఫెర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి, యాక్షన్ అంశాలు సినిమాకు బలంగా మారాయి. యాక్షన్ లవర్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఫైట్స్‌తో భావోద్వేగమైన ఓ పాయింట్ సినిమా కథను ఉద్వేగంగా మార్చడమే మాత్రమే కాకుండా ఆడియెన్స్‌ను ఓ ఎమోషన్‌కు గురి చేస్తుంది. థ్రియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఈ సినిమాను మ్యాగ్జిమమ్ ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఈ సినిమాను మీ లిస్ట్‌లో హ్యాపీగా వేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X