Mayalo Review బోల్డుగా జ్ఞానేశ్వరి.. రోడ్ జర్నీలో గ్లామర్ షో వర్కవుట్ అయిందా? మాయలో సమీక్ష
నటీనటుుల: నరేష్ అగస్త్య, భావన వజపాండల్, జ్ఞానేశ్వరి కండ్రేగుల తదితరులు
రచన, దర్శకత్వం: మెఘా మిత్ర పెర్వార్
నిర్మాతలు: షాలిని నంబూ, ఆర్కే నంబూ
సినిమాటోగ్రఫి: మాయ వీ
ఎడిటింగ్: అరుణ్ తచోత్, టించూ ఫిలిప్
మ్యూజిక్: డెన్నిస్ నార్టన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సామ్యూల్ నీల్
అసోసియేట్ ప్రొడ్యూసర్: సంధ్య ఆదిత్య
బ్యానర్: ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్, ఆదిత్య క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-12-16
శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధూ (భావన), మాయ (జ్ఞానేశ్వరి కండ్రేగుల) చిన్ననాటి స్నేహితులు. తాను ప్రేమించిన పాల్‌ను పెళ్లి చేసుకోవాలని మాయ నిర్ణయించుకొంటుంది. తన పెళ్లికి రావాలని శివ్, సింధూను పిలుస్తుంది. మాయ పెళ్లికి వెళ్లకూడదని శివ్‌కు బామ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినా మాయ పెళ్లికి సింధూతో కలిసి శివ్ కారులో బయలుదేరుతారు.

మాయతో శివ్ కృష్ణ, సింధూ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మాయ, సింధూల మధ్య దూరం ఎందుకు పెరిగింది? మాయ పెళ్లికి శివ్ బామ్మ ఎందుకు అభ్యంతరం తెలియజేస్తుంది? శివ్ బామ్మ అంటే సింధూకు ఎందుకు కోపం? మాయ పెళ్లికి వెళ్తుంటే శివ్, సింధూకు మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? శివ్, సింధూ కారు ప్రయాణం ఎలా జరిగింది? చివరకు మాయ పెళ్లి జరిగిందా? మాయ పెళ్లికి సింధూ, శివ్ ఎలాంటి పరిస్థితుల మధ్య చేరారు అనే ప్రశ్నలకు సమాధానమే మాయలో సినిమా కథ.
ఫ్రెండ్ షిప్, లవ్, యూత్‌ఫుల్ ఎలిమింట్స్‌తో యూత్‌ను టార్గెట్ చేస్తూ దర్శకుడు మెఘా మిత్ర పెర్వార్ రాసుకొన్న కథ బాగుంది. నేటితరం ఆడియెన్స్‌కు కనెక్ట్ చేసేలా బోల్డ్ కంటెంట్, డైలాగ్స్‌తో సీన్లతో సినిమా కొంత ఘాటుగానే కనిపిస్తుంది. లవర్స్ మధ్య ఎమోషన్స్, స్వార్ధం కోసం లవర్స్ ఆడే డ్రామాలు అన్నీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు అద్దం పట్టేలా ఉంది. యూత్‌కు కావాల్సిన అంశాలతో కేవలం మూడు పాత్రలతో రోడ్ జర్నీని కొనసాగించిన తీరు, తెరకెక్కించిన విధానం బాగుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నేటితరం అమ్మాయిల మనస్తత్వం తెలిపే పాత్రలో జ్ఞానేశ్వరి ఒదిగిపోయింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో తనకు తాను ఫెర్ఫార్మర్‌గా రుజువు చేసుకొనేందుకు ప్రయత్నించింది. నరేష్ అగస్త్య యూత్ ఫుల్ రోల్‌లో ఆకట్టుకొన్నాడు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో మెప్పించాడు. భావన హాట్ హాట్‌గా కనిపించింది. ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ పంట పడించే ప్రయత్నం చేశారు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.

మాయలో మూవీ టెక్నికల్ విషయాల్లోకి వెళితే.. రోడ్ జర్నీ జోనర్ కావడంతో అవుట్ డోర్ లోకేషన్లలో చిత్రీకరించిన సీన్లు క్లాసీగా ఉన్నాయి. మాయ వీ అందించిన విజువల్ బాగున్నాయి. కలర్ ప్యాటర్ కూడా బాగుంది. డెన్నీస్ నార్టన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అరుణ్ తచోత్, టించూ ఫిలిప్ ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. నిర్మాతలు షాలిని నంబూ, ఆర్కే నంబూ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇటీవల కాలంలో కంటెంట్‌తోపాటు బోల్డ్ ఎలిమెంట్స్ జోడించిన సినిమాలకు యూత్ నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఆ కోవలో లవ్, రిలేషన్‌షిప్, పెళ్లికి ముందే శృంగారం లాంటి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం మాయలో. కథలో కొత్తదనం లేకపోయినా.. స్టోరీ చెప్పిన విధానం బాగుంది. ఎమోషన్స్ ఇంకాస్త జొప్పిస్తే.. ఇంకా బెటర్‌గా ఉండేదనిపించింది. హీరో, హీరోయిన్ల బోల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్. యూత్ ఫుల్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











