twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాయం

    By Staff
    |

    Mayam
    చిత్రం: మాయం
    నటీనటులు: తుషార్‌కపూర్‌, ఆంత్రామా, తదితరులు
    సంగీతం: అజయ్‌ అతుల్‌, అమర్‌ మొహిలే
    స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌
    నిర్మాత: రాంగోపాల్‌వర్మ
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవాల్‌రామాన్‌

    రాంగోపాల్‌వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన అనువాద చిత్రం 'మాయం' పూర్థిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ లేదా థీమ్‌ మంచి ఐడియా కానీ, రెండు గంటలకుపైగా ఆ కథను పకడ్బందీగా నడిపించడంలో దర్శకుడు ప్రవాల్‌ రామాన్‌ విఫలమయ్యాడు. హీరో 'మాయం' అయి, తన కోరికను తీర్చుకోవడం అనేది ప్రధాన వస్తువు. నిజానికి ఈ 'మాయం' కావడం అనేది మనకు కొత్తేగానీ, హాలీవుడ్‌లో 'హాలో మ్యాన్‌', 'ఇన్‌విజిబుల్‌ మ్యాన్‌' లాంటి చిత్రాలు వచ్చాయి. వినోదానికి ఫుల్లుగా ఆస్కారం ఉన్న పాయింట్‌ ఇంది.

    అయితే, ఈ 'మాయం' సినిమాలో హీరో 'మాయం' అయ్యాకే, వినోదం కరవై, సినిమా బోర్‌ కొట్టడం ప్రారంభం అవుతుంది. 'మిస్టర్‌ ఇండియా' చిత్రంలో అనిల్‌కపూర్‌ 'మాయం' అయి, ముగాంబేను ఇరుకున పెట్టడమే ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక్కడ హీరో చేసే చేష్టలన్నీ పెద్దగా కొత్తగా అన్పించవు. మోస్తారు సినిమా ఇది. కోనవెంకట్‌, ప్రవాల్‌రామన్‌ కలిసి రాసిన ఈ స్క్రీన్‌ప్లేలో ఆదిలో చూపిన ఉత్సాహం, మధ్యలో వదిలేసినట్లు ఉన్నారు.

    తుషార్‌కపూర్‌ మాత్రం బాగా చేశాడు. అతని హానెస్ట్‌ నటనే ఈ సినిమాకు బలం.కథ: తుషార్‌ కపూర్‌ ఎందుకు పనికిరాని వాడు. అత ని ఉనికిని ఎవరూ పట్టించుకోరు. తుషార్‌ ఎదురింటి అమ్మాయి (ఆంత్రామాలి)ని ఇష్టపడుతాడు. ధనికురాలైన ఆంత్రా అమెరికా నుంచి తిరిగివచ్చిన తన బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు చేస్తూ ఉంటుంది. ఆంత్రాకు తుషార్‌ కన్నుకొట్టడం చూసిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అతన్ని అవమానపరుస్తాడు. జీవితంలో అవమానాలు ఎక్కువకావడంతో, 'దేవుడా..నన్ను మాయం చేయి..' అని వేడుకుంటాడు. దేవుడి నిజంగానే కరుణించి మాయం చేస్తాడు. ఇక అక్కడి నుంచి తుషార్‌ తన ప్రియురాలిని దక్కించుకోవడం, తనను అవమాన పర్చిన వారిని ఆటాడించడం వంటి పనులతో సాగుతుంది.

    ప్రధానంగా ఇది జిమ్‌ క్యారీ నటించిన 'బ్రూస్‌ ఆల్‌మైటీ' అనే కథ లైన్‌ను పోలి ఉంది. కాకపోతే, ఆ సినిమాలో 'మాయం' కావడం ఉండదు. వినోదానికి ఎంతో స్కోప్‌ ఉన్న ఈ సినిమాలో ప్రవాల్‌రామాన్‌, కోన వెంకట్‌లు కాస్తా స్క్రీన్‌ప్లే బాగా రాసుకోగలిగింటే, విజయవంతమై ఉండేవారు. అద్బుతమైన బైక్‌ చేజింగ్‌ వంటి ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్‌ పెట్రో ఫోటోగ్రఫీతో అద్భుతంగా ఉంది. వైడ్‌ యాంగిల్స్‌, ఛేజింగ్‌ దృశ్యాల చిత్రీకరణలో ఆయన చక్కటి ప్రతిభను కనబర్చాడు. అయితే, ఛేజింగ్‌ దృశ్యాలు అప్పుడు హీరోయిన్‌ చూస్తున్నప్పుడు, 'మాయం' అయిన హీరో కూడా ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కన్పించేలా చేయడం పెద్ద తప్పు. అలాగే, అద్దంలో హీరో కన్పించే దృశ్యాల్లో కన్సిస్టెన్సీ లేదు. పాటలు కేవలం ఆంత్రా 'ఎక్స్‌పోజింగ్‌' కోసమే పెట్టినట్లుగా ఉన్నాయి. ఫర్వాలేని సినిమా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X