Mayasabha Web Series Review: మయసభ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్, తన్య రవిచంద్రన్, భావన వజపండల్, చరిత వర్మ, శంకర్ మహంతి తదితరులు
దర్శకత్వం: దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్
నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష
బ్యానర్: హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌
మ్యూజిక్ ఢైరెక్టర్: శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రాఫర్: సురేష్ రగుతు, జానశేఖర్ వీఎస్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ఓటీటీ రిలీజ్: సోని లివ్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-08-07

చిత్తూరు జిల్లా నర్సిపల్లి గ్రామానికి చెందిన కాకర్ల కృష్ణమ నాయుడు అలియాస్ కేకేఎన్ (ఆది పినిశెట్టి) యూనివర్సిటీలో ఉన్నత చదువులు రాజకీయాల్లో రాణించాలనుకొంటాడు. కడప జిల్లాలోని పులిచెర్ల గ్రామానికి చెందిన ఫ్యాక్షనిస్టు బాంబుల శివారెడ్డి (శంకర్ మహంతి) కుమారుడైన ఎంఎస్ రామిరెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ (చైతన్యరావు) తన తండ్రి వ్యవహారాలను వ్యతిరేకిస్తూ వైద్య వృత్తిని ఎంచుకొంటాడు. ఈ ఇద్దరు తమ జీవితంలో ఒక భావోద్వేగ పరిస్థితుల్లో ఊగిసలాడుతున్న సమయంలో కలిసి ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న రాయపాటి చక్రధర్ రావు అలియాస్ ఆర్‌సీఆర్ (సాయికుమార్) తన సినీ జీవితానికి స్వస్తి చెప్పి వీర తెలుగు పార్టీని స్థాపిస్తాడు. తదనంతర పరిస్థితుల్లో కృష్ణమ నాయుడు, రామిరెడ్డి సిద్దాంతాల పరంగా బద్ద శత్రువులుగా మారిపోతారు.

Mayasabha Web Series Review

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కృష్ణమనాయుడు రాజకీయాలపై ఎందుకు ఆసక్తి పెంచుకొన్నాడు? ఫ్యాక్షన్ కుటుంబ నుంచి వచ్చిన రామిరెడ్డి తన తండ్రి ఫ్యాక్షన్ వ్యవహారాలను ఎందుకు వ్యతిరేకించాడు? కృష్ణమ నాయుడు లవ్ అఫైర్ ఎలా బ్రేక్ అయింది? పెద్దల్ని ఎదురించి తాను ప్రేమించిన మరదలిని రామిరెడ్డి ఎలా పెళ్లి చేసుకొన్నాడు? కృష్ణమ నాయుడు, రామిరెడ్డి ఎలా స్నేహితులయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి.. బలవంతంగా వేసక్టమి ఆపరేషన్లను చేయించాలని ఐరావతి బసు (దివ్య దత్తా) ఎందుకు నిర్ణయం తీసుకొన్నది. ప్రధాని ఐరావతి బసు నిర్ణయం కేకేఆర్, ఎంఎస్ఆర్‌ను ఎలా దగ్గరికి చేర్చింది. వైద్య వృత్తిని వదిలి రామిరెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? సినీ నటుడు, మామ రాయపాటి చక్రధర్ రావు పార్టీ పెట్టిన తర్వాత కేకేఆర్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయి? తన స్నేహితుడు కేకేఆర్‌కు రామిరెడ్డి సహకరించాడా? కేకేఆర్, రామిరెడ్డి శత్రువులుగా ఎలా మారారు? అనే ప్రశ్నలకు సమాధానమే మయసభ సినిమా కథ.

మయసభ కథ, స్టోరీలోని ట్విస్టులు చూస్తే.. తెలుగు రాజకీయాల్లో ముగ్గురు లెజెండరీ పోలిటిషియన్స్ కథ అనే విషయం స్పష్టంగా కనిపస్తుంది. కానీ దర్శకుడు దేవ కట్టా మాత్రం ఏ రాజకీయ నాయకుడి కథ కాదు.. తాను చూసిన ఓ ఫ్యామిలీ కథ మాత్రమే అంటూ తన వాదనలు వినిపించారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలను ఆధారంగా చేసుకొని వెబ్ సిరీస్‌గా తెరకెక్కించారనేది కాదనలేని వాస్తవం. అయితే ఈ వాదనలు, తర్కాలు పక్కన పెడితే.. దర్శకుడిగా దేవ కట్టా రాసుకొన్న స్క్రిప్టు హై స్టాండర్డ్‌లో ఉంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం. పిరియాడిక్ టచ్‌ను, మూడ్‌ను క్రియేట్ చేసిన విధానం వెబ్ సిరీస్‌ను నెక్ట్స్ రేంజ్‌లోకి తీసుకెళ్లిందనే చెప్పాలి.

గత 60 ఏళ్లుగా దేశంలోని రాజకీయ ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకొని మయసభను సృష్టించిన తీరు దేవ కట్టా విజన్‌కు అద్దం పట్టింది. ఫ్యామిలీ డ్రామాలను మిక్స్ చేసి పొలిటికల్ టచ్ ఉండే సినిమాలను రూపొందించడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకొన్నారు. ఈ సినిమాకు నటీనటుల ఎంపికతోనే సగం సక్సెస్ కొట్టాడని వెబ్ సిరీస్ చూస్తుంటే అర్ధమైంది. అయితే ఐరావతి బుసగా దివ్య దత్తా పాత్ర బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్ పూర్తిగా కనెక్ట్ కాలేకపోయిందనిపిస్తుంది. తెలుగు రాష్ట్రంలో గత రాజకీయ చరిత్ర తెలియకున్నా.. ఫ్రెండ్‌షిప్ ఆధారంగా సాగే ఫ్యామిలీ డ్రామాగా అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా రూపొందించడంలో దేవ కట్టా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ఎలాంటి పాత్రనైనా సులభంగా తన మార్క్ నటనతో మెప్పించగల నటుడు ఆది పినిశెట్టి.. కృష్ణమ నాయుడు పాత్రలో తన ఫెర్ఫార్మెన్స్‌తో మరోసారి విశ్వరూపం చూపించాడు. కీలక సన్నివేశాల్లో చూపించిన హావభావాలు, పాత్రకు సరిపడే యాటిట్యూడ్‌ను చక్కగా చూపించాడు. తనకు పోటీగా నటించిన రామిరెడ్డి క్యారెక్టర్‌‌ను రెచ్చగొట్టి చైతన్య నుంచి సూపర్ పెర్ఫార్మెన్స్‌ను రాబట్టడంలో తన వంతు సహకారం అందించాడు. ఈ వెబ్ సిరీస్‌లో అద్బుతమైన పెర్పార్మెన్స్‌తో చైతన్య రావు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా కనిపిస్తాడు. ఎవరూ ఊహించని విధంగా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. RCR పాత్రలో సాయికుమార్ చెలరేగిపోయి నటించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంత ఈ వెబ్ సిరీస్‌లో మణిహారంలో ముత్యాల మదిరిగా ఒదిగిపోయారు.

సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అత్యంత బలంగా నిలిచాయి. శక్తికాంత్ కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలిచాయి. సురేష్ రగుతు చిత్రీకరించిన సన్నివేశాలు చాలా రిచ్‌గా కనిపించాయి. రూరల్, అర్బన్ డ్రామాను మిక్స్ చేసి తెర మీద చూపించిన విధానం హైలెట్‌గా నిలిచింది. ప్రవీణ్ కేఎల్ ఎడిట్ చేసిన తీరు చూస్తే.. అనేక సవాళ్లను అధిగమించి ఉంటారనిపించింది. విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను పూర్తి స్థాయిలో హై స్టాండర్డ్‌లో నిర్మించారు.

తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పాలిటిక్స్, ఆయా రాజకీయ నేతల జీవితాల్లోని అంతర్గత అంశాలు, కుట్రలు, కుతంత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రాంతీయంగా ఆధిపత్య పోరాటం, అధికార దాహం, సామాజిక అంశాలు ఎన్నో కలబోసి రూపొందిన వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ చూస్తే 60 చరిత్రను ఓ గ్రంథంగా మలిచి అంధించినట్టు అనిపిస్తుంది. హిస్టరీకి ఎన్నో సాక్ష్యాలకు రూపంగా నిలుస్తుంది. పిరియాడిక్ మూడ్ కొత్త అనుభూతిని పంచుతుంది. సోని లివ్‌లో ప్రసారం అవుతున్నది. తగినంత సమయం కేటాయించి.. ఒకేసారి చూసేయండి.. స్వచ్ఛమైన తెలుగు కుటుంబ కథా చిత్రాన్ని చూసిన మంచి అనుభూతిని పొందుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X