Mazaka Movie Review: మజాకా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు, మురళీ శర్మ, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: నక్కిన త్రినాథరావు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
నిర్మాత: రాజేశ్ దండ, అనీల్ సుంకర, ఉమేష్ భన్సాల్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫి: నిజార్ షఫీ
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్
రిలీజ్ డేట్: 2025-02-26

తండ్రి కొడుకులైన వెంకట రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) ఇంట్లో ఆడ దిక్కు లేకుండా బతుకుతుంటారు. తన కొడుకుకు పెళ్లి చేస్తే ఇల్లు ఆడ పిల్లతో కళకళలాడుతుందని రమణ భావించి.. మ్యారేజ్ ప్రయత్నాల్లో ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. దాంతో కొందరు ముందు రమణను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తారు. అలాంటి సమయంలో సంపన్నురాలైన అమ్మాయి యశోద (అన్షు)ను చూసి వెంకట రమణ ప్రేమలో పడుతాడు. అదే సమయంలో మీరాను చూసి తొలి చూపులోనే కృష్ణ ప్రేమలో పడుతాడు. వారిద్దరూ పెళ్లి ప్రయత్నాలు చేయడంతో వారికి వివాహం జరపడానికి ఒకే అంటారు. కానీ ఓ కండిషన్ పెట్టడం ద్వారా రమణ, కృష్ణ పెళ్లికి భార్గవ్ వర్మ (మురళీ శర్మ) మోకాలు అడ్డుతాడు.

Mazaka Movie Review in Telugu

ఆడ దిక్కు లేకుండా వెంకట రమణ, కృష్ణ ఇద్దరు ఒంటరిగా ఎందుకు బతుకుతుంటారు? కృష్ణకు అమ్మాయిని ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతుంటారు? ప్రేమలో పడిన రమణకు, కృష్ణ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? యశోద, మీరాకు భార్గవ్ వర్మకు ఉన్న సంబంధం ఏమిటి? రమణకు యశోదను, కృష్ణకు మీరాను ఇవ్వడానికి ఒప్పకొన్న తర్వాత భార్గవ్ వర్మ పెట్టిన కండిషన్లు ఏమిటి? భార్గవ్ వర్మ పెట్టిన కండిషన్‌ను రమణ, కృష్ణ ఏ విధంగా సాల్వ్ చేశారు? తమకు ఇష్టమైన వారిని ఎలా పెళ్లి చేసుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే మజాకా సినిమా కథ.

ఇంట్లో ఆడ వాసన లేకుండా బతుకుతున్న తండ్రి, కొడుకులకు ఏనాటికైనా ఫ్యామిలీ ఫోటో చూసుకోవాలనే ఆరాటాన్ని పాయింట్‌గా చేసుకొని ప్రసన్నకుమార్ బెజవాడ రాసుకొన్న కథ బాగానే ఉంది. కాకపోతే సన్నివేశాలుగా విస్తరించే క్రమంలో లాజిక్‌లు మరిచిపోయి.. అత్యుత్సాహం ప్రదర్శించారనిపిస్తుంది. మంచి పాయింట్ చుట్టూ కామెడీ, ఎమోషన్స్ రాసుకొనే స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో సీన్లు చాలా తేలిపోయాయి. కొన్ని సీన్లు మంచి హాస్యాన్ని పండిస్తే.. మరికొన్ని సీన్లు బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నం చేశారా? అనిపిస్తుంది.

Mazaka Movie Review in Telugu

ఇక సెకండాఫ్‌లో కాళ్ల గజ్జెల సీన్ మంచి ఎమోషన్ పండించింది. అలాంటి సీన్లు కనుక మరికొన్ని పండి ఉంటే.. సినిమా కథ మరింత భావోద్వేగంగా మారి ఉండేదనిపిస్తుంది. ఈ సినిమాలో మురళీ శర్మ క్యారెక్టరైజేషన్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి, ఆయన కాంబినేషన్‌లో సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయనే చెప్పాలి. స్టోరీ డెస్టినేషన్ ఏమిటో ఆడియెన్స్‌కు ఇంటర్వెల్‌లోనే తెలిసినప్పుడు.. దర్శకుడు ఎంత బాగా చివరి వరకు కథ, సన్నివేశాలను మలిచాడనే విషయం పైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు కాస్త తడబాటుకు గురవ్వడం ఫలితంపై కాస్త ప్రభావం చూపించిందనే చెప్పాలి.

వెంకట రమణగా రావు రమేశ్, కృష్ణగా సందీప్ కిషన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇప్పటి వరకు రావు రమేశ్‌ను ఓ నటుడిగా చూసిన ప్రేక్షకులు.. మరో కోణంలో అంటే మాస్ ఎలిమెంట్స్‌తో అతడిని చూసే అవకాశం కలిగిందని చెప్పాలి. మాస్, కామెడీ సీన్లను బాగా ఆయన పండించారు. రీతూ వర్మ, అన్షు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. గ్లామర్, ఎమోషన్స్‌ను బాగా పండించారు. మురళీ శర్మ ఈ సినిమాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. మరోసారి తన క్యారెక్టర్‌తో కామెడీని, నటన ప్రతిభను చాటుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

Mazaka Movie Review in Telugu

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, కొరియోగ్రఫి, ఎడిటింగ్ లాంటి విభాగాలు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించాయి. పాటల్లో డ్యాన్సులు బాగున్నప్పటికీ.. ఆ సాంగ్స్ క్యాచీగా లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, నిజార్ షఫీ సినిమాటోగ్రఫి బాగుంది. రాజేశ్ దండ, అనిల్ సుంకర అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

కామెడీ, ఫ్యామిలీ వాల్యూస్ పాయింట్‌తో మజాకా సినిమాను రూపొందించారు. అయితే ఆ దిశగా బలమైన కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు లోపించడం వల్ల సినిమాలోని కొన్ని సీన్లు తేలిపోయాయని అనిపిస్తుంది. కొన్ని చోట్ల మంచి హాస్యాన్ని పండిస్తే.. మరికొన్ని సన్నివేశాలు పేలవంగా ఉండటంతో వల్ల సినిమాకు ఉండే పర్పస్ దెబ్బ తీసిందనే ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్స్ వెతక్కుండా, అంచనాలు పెట్టుకోకుండా చూస్తే.. సినిమాను ఎంజాయ్ చేయడానికి అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆస్వాదించడానికి వెళితే.. మంచి కాలక్షేపంగా ఈ సినిమా ఉంటుంది.

More from Filmibeat

Read more about: mazaka sandeep kishan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X