Mazaka Twitter Review: మజాకా తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, రీతూ వర్మ, అన్షు, రావు రమేష్ నటించిన తాజా చిత్రం మజాకా. ధమాకా లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.
బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివరాత్రి కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

మజాకా ప్రీమియర్ షో చూశాను. అన్షు, రావు రమేశ్ మధ్య సన్నివేశాల్లో ఫన్ అదిరింది. సందీప్ కిషన్, రీతూ మధ్య సీన్లలో సన్నివేశాలు బాగున్నాయి. బేబీ మా సాంగ్ బ్యూటీఫుల్‌గా ఉంది. ఫన్‌తో సినిమా బాగుంది. ఈ చూస్తుంటే బ్లాక్ బస్టర్ అవుతుందని ఫీలింగ్ కలుగుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మజాకా మూవీలో రావు రమేశ్, సందీప్ కిషన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకొన్నారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి ఎంగేజింగ్‌గా మజాకాను రూపొందించారు. సందీప్ కిషన్, రావు రమేష్ పెర్ఫార్మెన్స్ సాలిడ్‌గా ఉన్నాయి. ఇంపాక్ట్ చూపించే రోల్స్ చేసి రావు రమేశ్ తన టాలెంట్‌ను మరోసారి రుచి చూపించారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
శివరాత్రి పండుగ కానుకగా మజాకా రిలీజైంది. ఫస్టాఫ్ హిలేరియస్ కామెడీ ఉంది. సెకండాఫ్‌లో ఫన్, ఎమోషన్స్ పండాయి. ఈ చిత్రంలో నటీనటుల పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకొన్నాయి. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లెవెల్‌లో ఉన్నాయి. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సందీప్ కిషన్‌కు మరో హిట్ సినిమా అని ఓ నెటిజన్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
మజాకా సినిమా చూశాను. వేరే లెవెల్ కామెడీ ఉంది. ఫస్టాఫ్ చూసిన తర్వాత మూవీ బ్లాక్ బస్టర్ అనిపించింది. సెకండాఫ్ కోసం వేచి చూస్తున్నాను. అల్రెడీ సందీప్ కిషన్‌కు హిట్ పడిందనే అనిపిస్తున్నది అని నెటిజన్ పోస్టు పెట్టాడు.
రాయన్, భైరవకోన తర్వాత సందీప్ కిషన్ ఖాతాలో మరో హిట్ పడింది. మజాకా సినిమా బాగుంది. హైపర్ ఆది, రావు రమేష్ మధ్య వచ్చే సీన్లకు ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











