twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంసీఏ మూవీ రివ్యూ: ‘మిడిల్’ క్లాస్ అబ్బాయే..

    By Rajababu
    |

    Rating:
    3.0/5
    Star Cast: నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, నరేష్
    Director: వేణు శ్రీరాం

    Recommended Video

    ఎంసీఏ మూవీ పబ్లిక్ టాక్..!

    వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్ రాజు, నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఓ మై ఫ్రెండ్ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన వేణు శ్రీరాం ఈ చిత్రానికి దర్శకుడు. వదిన, మరిది మధ్య బంధం, అనుబంధాల కథతో తాజాగా ఎంసీఏను రూపొందించాడు వేణు శ్రీరాం. ఈ కథకు అందమైన ప్రేమ కథను జోడించాడు. మధ్య తరగతి కుటుంబ కథకు దేవీ శ్రీ ప్రసాద్ ఫీల్ గుడ్ మ్యూజిక్‌ను జత చేశారు. ఇన్ని పాజిటివ్ అంశాలకు దిల్ రాజు నిర్మాణ విలువలు తోడయ్యాయి. ఇలాంటి సానుకూల అంశాలతో ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో బలమైన అంశాలతో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ ఏమిటంటే..

    కథ ఏమిటంటే..

    నాని (నాని) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల అన్నయ్య (రాజీవ్ కనకాల) అతనికి సర్వస్వం. అన్నయ్య జీవితంలో జ్యోతి (భూమిక చావ్లా) భార్యగా ప్రవేశించడంతో కొంత వారి మధ్య దూరం పెరుగుతుంది. వదిన కారణంగానే అన్నయ్య దూరమయ్యాడనే ఫీలింగ్‌లో ఉంటాడు నాని. ఇంతలో అన్నయ్య ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది.

    క్లైమాక్స్‌కు జవాబు ఇళా

    క్లైమాక్స్‌కు జవాబు ఇళా

    వరంగల్‌లోనే పల్లవి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. తొలిచూపులోనే పల్లవి పెళ్లీ చేసుకొందామని ప్రపోజ్ చేస్తుంది. ఇలా కథ సాగుతున్న తరుణం శివశక్తి ట్రావెల్స్ యజమాని శివకు జ్యోతికి మధ్య వైరం కలుగుతుంది. ఆక్రమంలో జ్యోతిని శివ చంపబోతుండగా నాని అడ్డుకొంటాడు. కానీ ఎలాగైన జ్యోతిని చంపుతానని శివ శపథం చేస్తాడు. శివతో వైరం పెరుగడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితుల్లో వదినను ఎలా రక్షించుకొన్నాడు? తొలిచూపులోనే సాయి పల్లవి పెళ్లి ప్రపోజ్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటీ? ఏ ఉద్యోగం, పనిపాట లేకుండా తిరిగే నానికి పల్లవితో పెళ్లి కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర కథ.

    ఫస్టాఫ్‌లో కథ

    ఫస్టాఫ్‌లో కథ

    ఓ మై ఫ్రెండ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరాం మరో ఐదేళ్ల తర్వాత మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలలతో ఎంసీఏ కథను అల్లుకొన్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించించే నాని కథానాయకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. వదిన, మరిది మధ్య రిలేషన్స్‌ను కథకు జోడించాడు. వదిన కోసం మరిది, మరిది కోసం వదిన పడే ఆరాటంతో కథను నడిపించాడు. తొలి భాగంలో కథను ఆసక్తిగా నడిపిన దర్శకుడు.. రెండో భాగంలోకి వచ్చే సరికి తడబడినట్టు కనిపిస్తాడు.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    నాని, భూమిక, సాయి పల్లవి లాంటి బలమైన పాత్రల మధ్య దర్శకుడు కొంత నలిగిపోయాడనే చెప్పవచ్చు. అన్ని పాత్రల్లో సమతూకం పాటించడానికి నానా కష్టాలు పడి రెండో భాగంలో గందరగోళానికి గురయ్యాడనిపిస్తుంది. ఇక శివ విలన్ పాత్ర మధ్యలో అతికించినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ పాత్రకు విజయ్ లాంటి వ్యక్తి ఎంచుకోవడం కొంత మైనస్‌గానే ఉంటుంది. బలమైన విలన్ ఉంటే స్టోరీ ఫ్లేవర్ తగ్గుతుందనే భావనతో విలన్ పాత్రను అండర్ ప్లే చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా సెకండాఫ్‌లో రొటీన్ సీన్లు, బలహీనమైన కథనంతో అందరిని సంతృప్తి పరిచే శుభం కార్డు వేయడానికి నానా కష్టాలే పడ్డాడానే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.

    దర్శకుడు వేణు శ్రీరాం ప్రతిభ

    దర్శకుడు వేణు శ్రీరాం ప్రతిభ

    ఇక వేణు శ్రీరాం దర్శకత్వ ప్రతిభ గురించి తక్కువగా అంచనా వేయడానికి అవకాశమే ఉండదు. నాని, సాయి పల్లవి, భూమిక లాంటి నటుల నుంచి బ్యాలెన్స్‌గా నటనను రాబట్టుకొన్నారు. రెండో భాగంలో కథ గురించి కొంత మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎంసీఏ బ్లాక్‌బస్టరే అయి ఉండేదేమో. ఇక మధ్య తరగతి కుటుంబాలు, వారి పాట్లను చక్కగా తెరపై వివరించాడు. నాని, సాయి పల్లవి, భూమిక, నరేష్, పోసాని చేత మంచి డైలాగ్స్ పలికించేలా జాగ్రత్త పడ్డాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించుకొ తన వంతు ప్రయత్నమే చేశాడనిపిస్తుంది.

    మరోసారి నాని..

    మరోసారి నాని..

    ఇక నాని విషయానికి వస్తే మధ్య తరగతి యువకుడి పాత్రలు అతనికి కొట్టిన పిండే. అన్నయ్య అంటే చెప్పలేనంతగా ఇష్టపడే తమ్ముడిగా.. వదినపై ఈర్ష్య పడే మరిది.. అలాగే వదిన అంటే అమితంగా ఇష్టపడేవ వ్యక్తిగా, చాలా ఇష్టపడి ప్రేమించిన యువతిని రక్షించుకొనే ప్రియుడిగా, వదిన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించే ఓ దుష్టుడిని ఎదుర్కొనే యువకుడిగా చాలా రకాల ఫ్లేవర్ ఉన్న పాత్రను సమర్ధవంతంగా పోషించి మెప్పించాడు. ప్రతీ మధ్య తరగతి యువకుడి తనను చూసుకునే విధంగా ఆ పాత్రను మలిచేలా కృషి చేశాడు. నాని యాక్టింగ్ విషయానికి వస్తే ఆ పాత్రలో ఎలాంటి లోపాలు కనిపించవు. డ్యాన్సులు, ఫైట్లతో మెప్పించాడు.

    ఆకట్టుకొన్న సాయి పల్లవి

    ఆకట్టుకొన్న సాయి పల్లవి

    తెలుగులో సాయి పల్లవికి మరో మంచి పాత్ర లభించింది. పల్లవి పాత్రలో అల్లరి, చిలిపి పాత్రలో ఆకట్టుకొంటుంది. ఇక పాటల్లో డ్యాన్సులతో దుమ్ము దులిపేసింది. స్క్రీన్ మీద నానితో కలిసి ఉంటే ప్రేక్షకుడు సాయిపల్లవిని చూసేంతగా ఆకట్టుకొన్నది. గ్లామర్‌తో ఆలరించింది. కథ మొత్తం నాని, భూమిక మీద నడిచినా.. అవకాశం దొరికిన ప్రతీచోట ప్రేక్షకుడికి నటనతో, డ్యాన్స్‌తో మైమరిపిస్తుంది.

    భూమిక అదనపు ఆకర్షణ

    భూమిక అదనపు ఆకర్షణ

    యువకుడు, ఖుషీ, మిస్సమ్మ లాంటి చిత్రాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకొన్న భూమిక చావ్లా కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైంది. ఈసారి ఎంసీఏ చిత్రంలో హీరోయిన్‌గా కాకుండా బలమైన క్యారెక్టర్‌ పాత్రలో మళ్లీ భూమిక తెర మీద మెరిసింది. రవాణాశాఖలో ఉన్నత ఉద్యోగి పాత్రలో భూమిక హుందాగా కనిపించింది. వదినగా నానితో పోటాపోటిగా నటించింది. తన పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చింది. జ్యోతి పాత్రలో మళ్లీ తెలుగు తెరకు నిండైన నటి దొరికింది అని ఫీలింగ్‌ను కల్పించింది.

    మెప్పించిన నరేష్, రాజీవ్, పోసాని

    మెప్పించిన నరేష్, రాజీవ్, పోసాని

    ఎంసీఏ చిత్రంలో నానికి అన్నయ్యగా రాజీవ్ కనకాల, బాబాయ్ నరేష్, పిన్నిగా అమల, మామగా పోసాని కృష్ణమురళీ కనించారు. వీరంతా తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వస్తే బాబాయ్‌గా నరేష్ పాత్ర గుర్తుండిపోతుంది. పోసాని గెస్ట్ అప్పియరెన్స్‌లా కనిపించినా ఆ పాత్ర కథపై ప్రభావం చూపే పాత్ర అని చెప్పవచ్చు.

    ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ

    ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ

    కమెడియన్ గ్రూప్‌లో ప్రియదర్శి, జబర్దస్త్ రవి, వెన్నెల కిషోర్‌లు తమ హాస్యంతో అలరించాడు. నానికి ఫ్రెండ్స్‌గా నటించిన ప్రియదర్శి భారమైన డైలాగ్స్‌తోపాటు సున్నితమైన హాస్యాన్ని పండించాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానికిగా వెన్నెల రవి తనదైన శైలిలో మెపించాడు. వీరికి తోడుగా నాని కూడా తన మార్కు కామెడితో అలరించాడు.

    దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

    దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

    మ్యూజిక్ విషయానికి వస్తే దేవీ శ్రీ ప్రసాద్ మార్క్ ఎక్కడ కనిపించదు. ఫ్యామిలీ పార్టీ, ఏమండో నాని గారూ.. చిన్నిగారూ పాటల ద్వారా తన మార్కును చూపించేందుకు ప్రయత్నించాడు. డీఎస్పీ బాణీలు చాలా రొటీన్‌గా ఉండటం, సాయి పల్లవి డ్యాన్స్‌ల మాటున పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. కొత్తగా, ఏమైందో తెలియదు పాటలు మెలోడిగా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో ఆకట్టుకొన్నది.

    అందాలను ఒడిసిపట్టిన సమీర్

    అందాలను ఒడిసిపట్టిన సమీర్

    ఇక సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీకి పేరు పెట్టాల్సిన పనిలేదు. వరంగల్ పట్టణాన్ని, ఫోర్ట్ వరంగల్, వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను చాలా అందంగా సమీర్ రెడ్డి తన కెమెరాలో ఒడిసిపట్టుకొన్నారు. సినిమాలకు ఊటీ, మరెక్కడికో వెళ్లడం ఎందుకు అనే విధంగా వరంగల్, మెదక్ ప్రాంతాలను బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ.

    సాంకేతిక విభాగాల్లో

    సాంకేతిక విభాగాల్లో

    మిగిలిన సాంకేతిక విభాగాల్లో ప్రవీణ్ పూడి అందించిన ఎడిటింగ్, మధ్య తరగతి వాతావారణన్ని ప్రతిబింబించే విధంగా ఆర్ట్ వర్క్, సాయి పల్లవి లాంటి హీరోయిన్‌కు తగినట్టుగా కొరియోగ్రఫీ విభాగాలు నూటికి నూరు శాతం న్యాయం చేశాయి.

    దిల్ రాజు నిర్మాణ విలువలు

    దిల్ రాజు నిర్మాణ విలువలు

    సినీ నిర్మాణ రంగంలో దిల్ రాజు ఇటీవల కాలంలో రారాజుగా మారాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఐదు సక్సెస్‌లను సాధించాడు. ఆరో సక్సెస్‌తో 2017ను ముగించడానికి ఎంసీఏను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆయన నిర్మాణ విలువలు, ప్రమోషన్, ఇతర అంశాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఎంసీఏను తీర్చిదిద్దారు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    నాని, సాయి పల్లవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన వినోదాత్మక చిత్రం ఎంసీఏ. మధ్య తరగతి కుటుంబ కథా చిత్రానికి భూమిక అదనపు ఆకర్షణగా నిలిచారు. నానికి మల్టీప్లెక్స్, ఏ సెంటర్లలో మంచి మార్కెట్ ఉంది. ఇక బీ, సీ కేంద్రాల్లోని ప్రేక్షకులు ఆదరిస్తే ఈ చిత్రం సినిమా యూనిట్‌కి చక్కటి విజయం సొంతమవ్వడం ఖాయం.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నాని, సాయి పల్లవి, భూమిక యాక్టింగ్
    కథ
    నిర్మాణ విలువలు

    మైనస్ పాయింట్స్
    సెకండాఫ్‌
    కొత్తదనం లేని సంగీతం
    రొటీన్ సన్నివేశాలు, కథనం

    తెరవెనుక.. తెర ముందు

    తెరవెనుక.. తెర ముందు

    నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, నరేష్, ఆమని, రాజీవ్ కనకాల, ప్రియదర్శిని పులికొండ
    దర్శకత్వం: వేణు శ్రీరాం
    నిర్మాత: దిల్ రాజు
    సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
    సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
    ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    రిలీజ్ డేట్: 21 డిసెంబర్ 2017

    English summary
    Natural Star Nani starrer latest romantic and family entertainer movie ‘MCA’ (Middle Class Abbayi). Film released on 21st December. The film directed by Venu Sriram has already created lot of buzz. The film has Sai Pallavi as the female lead and this will be her second film in Tollywood after Sekhar Kammula’s Fidaa. After bunch of hits Dil Raju's came with this movie for another success in his kitty. In this occassion, Telugu Filmibeat brings a exclusive review for our Viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X