twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగమార్తండ రంగంలోకి చిరు.. షటప్పైపోమని ఆర్డర్ వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

    |

    మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో సరయిన హిట్ కొట్టలేదు. చాలా కాలం నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న 'రంగమార్తాండ' పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు భాగం కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాలో భాగమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

    తెలుగు రీమేక్‌గా

    తెలుగు రీమేక్‌గా

    సూపర్ హిట్ మరాఠీ మూవీ 'నటసామ్రాట్‌'కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'రంగమార్తాండ'. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నా పాటేకర్ పోషించిన పాత్రని తెలుగు రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తుండగా ఆయనకు జంటగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. బ్రహ్మానందం మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, రాజశేఖర్ కుమార్తె శివాని, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

    డిసెంబర్ లో రిలీజ్

    డిసెంబర్ లో రిలీజ్

    మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ముగింపు దశలో ఉన్నది. తాజా సమాచారం మేరకు డిసెంబర్ లో 'రంగమార్తాండ' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే అనౌన్స్‌ అయిన ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ఒక్కటి తప్ప మరో అప్‌డేట్ రాలేదు. కరోనా టైమ్‌లో అయితే రంగమార్తండ గురించి ఎలాంటి వార్త రాకపోవటంతో ఈ సినిమా ఆగిపోయింది అని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

    మెగాస్టార్ వాయిస్ ఓవర్

    మెగాస్టార్ వాయిస్ ఓవర్

    ఆ మధ్య ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ అభిమాని ప్రశ్నిస్తే డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు .. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా ఇప్పుడు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

    మరో కలికితురాయి మెగా వాయిస్

    మరో కలికితురాయి మెగా వాయిస్

    ఈ విషయాన్ని స్వయంగా కృష్ణ వంశీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. చిరంజీవి వాయిస్ ఓవర్ చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటో షేర్ చేసిన కృష్ణవంశీ, మీ షరతులు లేని ప్రేమకు ధన్యవాదాలు రంగమార్తాండ ఆకాశంలో మరో కలికితురాయి మెగా వాయిస్ అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

    Recommended Video

    Megastar Chiranjeevi Special Interview with Natyam Movie Team
    షటప్పైపోమని ఆర్డర్

    షటప్పైపోమని ఆర్డర్

    ''ఈ సినిమా థీమ్ కోసం నేను రాసిన వచన కవిత్వం మెగాస్టార్ చిరంజీవి గారి నోట పలికింది.. ఎంతో శ్రద్ధగా పదం పదం చదివి అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆవాహన చేసుకుని మెగాస్టార్ పలికిన తీరు అత్యద్భుతం, ఒక నటుడి జీవితాన్ని ఆవిష్కరించే 'రంగమార్తాండ' సినిమాలో, మెగాస్టార్ లాంటి గొప్ప నటుడి గొంతు నా పదాలు పలకడం చాలా చాలా సంతోషంగా ఉంది.. రాసినప్పుడు దర్శకుడు Krishna Vamsi అభినందన నా రచనకు శాలువా కప్పినట్టైతే, చిరంజీవి గారు చెప్పడం గజమాల వేసి ఏనుగు అంబారీ ఎక్కినట్టుంది.

    ఇంత చెప్పిన నేను, మెగాస్టార్ చేతిలో ఉన్న కాగితాల్లో ఏం రాసానో కూడా చెప్పాలని ఉంది కానీ, సినిమా వచ్చేవరకు షటప్పైపోమని అన్నయ్య కృష్ణవంశీ గారి ఆర్డర్ కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆనందం మాత్రం పంచుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

    English summary
    Megastar chiranjeevi gave voice over for rangamarthanda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X