Memu Copulam Web Series Review: మేము కాప్‌లం వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నాగబాబు కొణిదెల, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల, సిరి పార్వతి, రీతూ చౌదరీ, చరణ్ లక్కరాజు, అనంత్ ప్రభు, కమల్, శ్రీధర్ రెడ్డి తదితరులు
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు: బీవీఎస్ రవి, కౌముది కే నేమాని
ఎడిటర్: మైఖేల్ డీ సిల్వా
సినిమాటోగ్రాఫర్: కిషోర్ బోయిడపు
మ్యూజిక్: సాకేత్ కొమాండురి
బ్యానర్: రా ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ స్ట్రీమింగ్: జీ5
ఎపిసోడ్స్: 6
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్: 2026-05-22
గోదావరి జిల్లాలోని మహదేవపట్నం గ్రామ పెద్ద గజపతిరాజు (నాగబాబు) కోడి పందేలాను పరువు, ప్రతిష్టలుగా భావిస్తుంటాడు. కోడి పందేల్లా తన గౌరవాన్ని పెంచిన బాహుబలి రాజు అనే పందెం కోడి మరణించడంతో దాని స్థానంలో సలార్ రాజు అనే పందెం కోడిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు. సలార్ రాజ కూడా గజపతి రాజు పెట్టుకొన్న ఆశలకు అనుగుణంగానే 20 కిపైగా పోటీల్లో విజయం సాధించి ఆ ప్రాంతంలో తిరుగులేని పందెం కోడిగా పేరు సంపాదించుకొంటుంది. ఈ క్రమంలో కోడి పందాలు ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన విందు తర్వాత గజపతిరాజు ఇంటి నుంచి సలార్ రాజు కనిపించకుండా పోతుంది. తన ప్రత్యర్థులు మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలే సలార్ రాజు మాయం కావడానికి కారణమని అనుమానిస్తాడు. దాంతో సలార్ రాజు వెతికే పనిని ఎస్ఐ రవి సొటారి (రవితేజ నన్నిమల), కానిస్టేబుల్ మోహన్ సొటారి (గెటప్ శ్రీను)కు అప్పగిస్తారు.
పందెం కోడి బాహుబలి రాజు మరణం తర్వాత గజపతిరాజు పడిన ఆవేదన ఏంటి? సలార్ రాజు అనే పందెం కోడిని ఎలా పెంచారు? కోడి పందాల్లో గజపతి రాజు విజయంపై మహిపాల్, సుధాకర్ రెడ్డి ఎలాంటి ఈర్ష్యను పెంచుకొన్నారు? సలార్ రాజు మాయం కావడంతో గజపతిరాజు పరిస్థితి ఏమిటి? పోలీసులు రవి, మోహన్ తన దర్యాప్తును ఎలా కొనసాగించారు? సలార్ రాజును వెతికే క్రమంలో గ్రామస్థులు రక్తపు వాంతులు చేసుకోవడం, గంజాయి మాఫియా అంశాలతో ఈ కథకు సంబంధమేమిటి? అసలు సలార్ రాజును ఎవరు దొంగిలించారు? రవి, మోహన్ దర్యాప్తులో తెలిసిందేమిటి? గజపతిరాజు కూతురు సంఘవి (సిరి పార్వతి), ఆకాశ్ రె్డి (చరణ్ లక్కరాజు) లవ్ స్టోరి ఎలా సాగింది? రిపోర్టర్ మీనాక్షి (రితూ చౌదరీ), గిరి (కిరిటీ దామరాజు) ట్రాక్ ఎలా నడించింది? అనే ప్రశ్నలకు సమాధానమే మేము కాప్‌లమ్ (Memu Copulam) వెబ్ సిరీస్ కథ.

బాహుబలి రాజు మరణంతో వెబ్ సిరీస్ కొంత కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి కథ చెప్పడం మొదలవుతుంది. సలార్ రాజు విజయాలు, గజపతి రాజు దర్పాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథలోని క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం ఎక్కువగానే తీసుకొన్నారనిపిస్తుంది. కానీ సలార్ రాజు కనిపించకుండా పోయిన తర్వాత స్టోరీలో వేగం, కామెడీ, ఎమోషన్స్ ఎలివేట్ కావడం కనిపిస్తాయి. కనిపించకుండా పోయిన పందెం కోడిని పట్టుకోవడానికి కాప్స్ రవి, మోహన్ వెతకడం మొదలుపెట్టిన తర్వాత సిరీస్ వినోదాత్మకంగా మారుతుంది.
ఇక సింగిల్ పాయింట్‌తో సాగుతున్న కథలోకి చేతబడి, రక్తపు వాంతుల ఎపిసోడ్‌ను తీసుకొచ్చి స్టోరిని డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే ఆంధ్రాలో గంజాయి మాఫియా అంశాన్ని సోషల్ మెసేజ్ రూపంలో వాడుకోనే ప్రయత్నం బాగుంది. సలార్ రాజును దొంగిలించింది ఎవరనే విషయాన్ని క్లైమాక్స్‌లో సీరియస్ నోట్‌లో కాకుండా ఫన్నీగా ప్రజెంట్ చేయడం బాగుంది. కోడి పందాలను ప్రతిష్టగా భావించే రాజుల వంశం నేపథ్యంగా పందెం కోళ్లకు బాహబులి, సలార్, కల్కి అనే పేర్లతో ప్రభాస్‌ను గుర్తు చేశారు. వెబ్ సిరీస్ సరదాగా సాగినా.. సరైన క్రమంలో ఎమోషన్స్, వైవిధ్యం చూపించడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడనే చెప్పాలి. ఈ పాయింట్‌ను ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉన్నా.. ఆ ప్రయత్నంపై ఎందుకు దృష్టి సారించలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సంఘవి, ఆకాశ్ మధ్య లవ్ స్టోరిని ఇంకా బెటర్‌గా కథకు లింక్ చేయాల్సిందనిపిస్తుంది. అయితే వేసవి హాలీడేస్‌లో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే విధంగా క్లీన్‌గా ఈ సినిమాను రూపొందించారని చెప్పొచ్చు.
గ్రామ పెద్ద గజపతిరాజుగా నాగబాబు హుందాగా కనిపించారు. తన ఇమేజ్‌కు సరిపోయే పాత్రలో ఒదిగిపోయి నటించారు. గెటప్ శ్రీను, రవితేజ తమ పాత్రల ద్వారా ఫన్ జనరేట్ చేశారు. ఈ కథను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పాలి. రీతూ చౌదరీ, సిరీ పార్వతి గ్లామర్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో మెరిసారు. కిరిటీ, చరణ్‌తోపాటు ఈ చిత్రంలో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
ఈ వెబ్ సిరీస్‌లో సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఆర్ట్, సినిమాటోగ్రఫి డిపార్ట్‌మెంట్స్ బ్యాలన్స్‌తో పనిచేశాయనే ఫీలింగ్ కలుగుతుంది. గోదావరి పల్లె అందాలను కిషోర్ ఫీల్‌గుడ్‌గా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్‌కు పెద్దగా స్కోప్ లేని సిరీస్ కావడంతో సాకేత్ ఉన్నంతలో బెటర్‌గా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పర్వాలేదనిపించారు. మైఖేల్ డి సిల్లా ఇంకా కాస్త గట్టిగా కత్తెరను వాడాల్సింది. కొన్ని చోట్ల రిపీట్ సీన్లు, రొటీన్ సీన్ల కారణంగా సాగదీత కనిపించింది. రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి నిర్మాతగా మారి రూపొందించిన వెబ్ సిరీస్‌లో నిర్మాణ విలువలు బాగున్నాయి. సమ్మర్ వెకేషన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే.. కొత్త, కంటెంట్, జోనర్‌లో మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


Click it and Unblock the Notifications