Men Too movie review మగాళ్లకు మహిళల వేధింపుల కథతో.. మెన్ టూ (#Mentoo) మూవీ ఎలా ఉందంటే?

Rating: 2/5

నటీనటులు: మౌర్య సిద్దవరం, కౌశిక్ ఘంటసాల, నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, ప్రియాంక శర్మ, రియా సుమన్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ జీ రెడ్డి
నిర్మాత: మౌర్య సిద్దవరం
సినిమాటోగ్రఫి: పీసీ మౌళి
మ్యూజిక్: ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్
ఎడిటర్: కార్తీక్ ఉన్నవ
నిర్మాత: మౌర్య సిద్ధవరం
రిలీజ్ డేట్: 2023-05-26

మహిళా మండలి అధ్యక్షురాలు (రోహిణి)ని వివాహం చేసుకొని వేధింపులకు గురైన భర్త (బ్రహ్మజీ) స్టాగ్స్ ఓన్లీ అనే పబ్‌ను నడుపుతుంటాడు. తమ జీవితంలో మహిళల చేత వేధింపులకు గురైన ఆదిత్య (నరేష్ అగస్త్య), సంజు (కౌశిక్ ఘంటసాల), మున్నా (మౌర్య సిద్దవరం), రాహుల్ (హర్ష చెముడు) లాంటి బాధితులు పబ్‌లో కష్టాలను చెప్పుకొంటూ ఉపశమనం పొందుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ అదే పబ్‌లో షాకింగ్ నిర్ణయం తీసుకొంటాడు.

Men Too Telugu movie review and Rating

మెకానిక్ మున్నా జీవితంలో మహిళ వల్ల ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? నేహా (ప్రియాంక శర్మ) వల్ల సంజూ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి. తారా (రియా సుమన్) వల్ల ఆది జీవితం ఎలా కష్టాల్లోపడింది. ఆఫీస్‌లో రాహుల్‌కు ఎదురైన కష్టాలు ఏమిటి? రాహుల్ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? భార్య నుంచి ఎలాంటి వేధింపులకు పబ్ ఓనర్ (బ్రహ్మాజీ) గురయ్యాడు. వీరందరి జీవితాలకు ఎలాంటి ముగింపు లభించిందనే ప్రశ్నలకు సమాధానమే మెన్ టూ (Men Too) సినిమా కథ.

బ్రహ్మాజీకి సంబంధించిన ఎపిసోడ్‌లో ఫన్‌తోపాటు సానుభూతి ఉంటుంది. రాహుల్ స్టోరిలో హృదయాన్ని హత్తుకొనే ఎమోషన్స్ ఉంటాయి. మున్నా, సంజూ, ఆదిత్య లైఫ్‌లో చోటు చేసుకొన్న అంశాలు ఎమోషనల్‌గాను, ఫీల్‌గుడ్‌గాను కనిపిస్తాయి. విభిన్నమైన కథలను, విలక్షణంగా ఉండే పాత్రలను దర్శకుడు కలిపి కథను నడిపించిన విధానం ఆకట్టుకొంటుంది. అయితే ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఎమోషన్స్ పండకపోవడం ఓ మైనస్. దాదాపు కథ మొత్తం పబ్‌లో నడిపించడం వల్ల ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. రాహుల్ ఎపిసోడ్ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. అలాగే బ్రహ్మాజీకి 20 లక్షల చెక్ ఇచ్చే సీన్ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

బ్రహ్మాజీ పూర్తిగా కామెడీకే పరిమితం కాకుండా ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకొన్నాడు. కథకు మూలంగా ఉండే పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీనే కాకుండా భావోద్వేగాన్ని కూడా పండించగలను అనే విషయాన్ని రాహుల్ పాత్రతో హర్ష నిరూపించుకొన్నాడు. నరేష్, కౌశిక్, మౌర్య తమ పాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. రియా సుమన్ పాత్ర తక్కువైనా ఎమోషనల్ ఉంది. ప్రియాంక శర్మ గ్లామర్ పరంగానే కాకుండా ఫెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నది. కమెడియన్ సుదర్శన్ పాత్ర పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది.

మెన్ టూ సినిమా విషయానికి వస్తే.. కథ, కథనాలపై మరింత కసరత్తు చేయాల్సి ఉండేదనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్లస్ పాయింట్. సినిమాను రిచ్‌గా తెరకెక్కించడంలో మౌర్య సిద్దవరం, దర్శకుడు శ్రీకాంత్ జీ రెడ్డి అనుసరించిన విధానం బాగుంది. కథలో ఎమోషన్స్ మరింత పండిచి ఉంటే సినిమా సరికొత్త జోనర్‌గా మరింత ఆకట్టుకొనేది. పీసీ మౌళి సినిమాటోగ్రఫి, ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ మ్యూజిక్, కార్తీక్ ఉన్నవ ఎడిటర్ బాగున్నాయి.

లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను బేస్ చేసుకొని రూపొందించిన చిత్రం మెన్ టూ. అయితే పాత్రల పరంగా, కథపరంగా పండాల్సిన ఎమోషన్స్ పండకపోవడం మైనస్. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ టోటల్ కథగా విస్తరించే క్రమంలో తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. పాత్రలు కూడా ఎక్కువ కావడంతో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. యూత్‌ఫుల్, హ్యుమన్ ఎమోషన్స్ ఆధారంగా రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి మెన్ టూ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X