Mension House Mallesh First Review: మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ ఫస్ట్ రివ్యూ
యువ హీరో శ్రీనాథ్ మాగంటి హీరోగా కామాక్షి భాస్కర్ల, గాయత్రి రమణ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మెన్షన్ హౌస్ మల్లేష్. మురళీధర్ గౌడ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సాయి ప్రసన్న కొండ్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బాలా సతీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.కనకమేడల ప్రొడక్షన్స్, ధీరజ్ సినిమాస్ బ్యానర్‌పై రాజేశ్ కుమార్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.
రొమాంటిక్, అడల్డ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీత, అమ్మముతు సినిమాటోగ్రాఫర్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా, వసుంధర రెడ్డి గొట్టం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించారు. మార్చి 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాపై వారు వెల్లడించిన అభిప్రాయాలు, సూచనలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా కథ విషయానికి వస్తే.. మల్లేషం గ్రామీణ ప్రాంత యువకుడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జులాయిగా తిరుగుతూ మెన్షన్ హౌస్ మద్యం తాగుతూ స్నేహితులతో జల్సాలు చేస్తుంటారు. పెళ్లి, కుటుంబం లాంటి బాధ్యతలు తెలియని మలేషం పెళ్లి చేసుకొంటాడు. అయితే ఫస్ట్ నైట్ సంసారపరమైన సమస్య బయటపడుతుంది. భార్యతో కాపురం విషయంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తన లైంగిక సమస్యను మల్లేషం ఎలా పరిష్కరించుకొన్నాడనేది ఈ సినిమా కథ.
మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా విషయానికి వస్తే..డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ, యూత్‌ను ఎట్రాక్ట్ చేసే సెటైర్లు, మద్యాన్ని ప్రోత్సహించే విధంగా కథ, టైటిల్ ఉండటంపై సెన్సార్ బోర్డు అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే వారు భారీగానే మార్పులు, చేర్పులు సూచించారు. జై బాలయ్య లాంటి డైలాగ్స్ బీప్స్ వేయాలని లేదా తొలగించాలని సూచించారు. అలాగే అడల్డ్ కంటెంట్‌ను వీలనైంత మేరకు కట్ చేయాలనే సూచనలు చేశారు. అయితే కంటెంట్ డిమాండ్ చేయడంతో వారు తమ సినిమాలోని సన్నివేశాల్లో స్వల్ప మార్పులకు అంగీకరించారు. కానీ సెన్సార్ ప్రతినిధులు సంతృప్తి చెందలేదనే విషయంతో ఈ సినిమాకు అభ్యంతరాలతో కూడిన సర్టిఫికెట్ జారీ చేశారు.
ఈ సినిమా విషయంలో కొంత మేరకు సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరించిందనే విషయం స్పష్టమైంది. ఈ సినిమాకు ఏ (A) సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే 18 ఏళ్లకుపై బడిన వారే ఈ సినిమాకు వీక్షించాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ మూవీ చూడటానికి అనుమతి లేదు అనేది ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ స్పష్టం చేసింది. ఇక ఈ మూవీ ట్రైలర్ కూడా ఏ రేంజ్‌లో అడల్డ్ కంటెంట్ ఉందో అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 2 గంటల 1 నిమిషం నిడివితో అంటే 121 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా గురించిన అప్ డేట్స్, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











