For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Merise Merise movie review.. శ్వేత అవస్థి గ్లామర్.. దినేష్ తేజ్ పెర్ఫార్మెన్స్‌ హైలెట్‌గా

  |

  Rating: 2.5/5

  టాలీవుడ్‌లో ప్రేమ కథలతో ఎన్నో సినిమాలు వచ్చిన ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్త కోణం ఉంటుంది. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొనే సాదాసీదా కథను అద్బుతంగా కథను చెప్పే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాంటి కోవలోనే పవన్ కుమార్ కే దర్శకుడిగా పరిచయం అవుతూ చెప్పిన సరికొత్త లవ్ స్టోరీ మెరిసే మెరిసే. ఆగస్టు 6న నేరుగా థియేటర్‌లో రిలీజ్ అవుతున్న చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. కథ, కథనాల గురించి తెలుసుకోవాల్సిందే.

  Merise Merise movie review and Rating

  సొంతగా ఎదగాలనే ప్రయత్నంలో స్టార్టప్ కంపెనీ ప్రారంభించి విఫలమైన యువకుడు సిద్దూ (దినేష్ తేజ్) నిరాశలో మునిగిపోతాడు. అయితే తల్లిదండ్రుల సూచన మేరకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడు. లండన్‌లో డాక్టర్‌గా పనిచేసే యువకుడితో ఎంగేజ్‌మెంట్ జరిగిన వెన్నెల (శ్వేతా అవస్థి)కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక ఉంటుంది. కాబోయే భర్త, అత్త కోరికలకు వ్యతిరేకంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ను వ్యాపారంగా ఎంచుకొంటుంది. ఆ క్రమంలో వెన్నెల, సిద్ధూ కలుసుకొంటారు. వారి పరిచయం ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వరకు వెళ్తుంది.

  Merise Merise movie review.. శ్వేత అవస్థి గ్లామర్.. దినేష్ తేజ్ పెర్ఫార్మెన్స్‌ హైలెట్‌గా

  Ippudu Kaaka Inkeppudu movie review: పెళ్లికి ముందే శృంగారంలో మునిగితే..

  ఫ్యాషన్ డిజైనర్‌ కావాలని కలలు కన్న వెన్నెల లక్ష్యం నెరవేరిందా? ఏ పరిస్థితుల్లో వెన్నెలతో సిద్ధూ పరిచయం జరిగింది. వారి పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? వారి పరిచయం ప్రేమకే పరిమితమైందా? లేక స్నేహం వరకే ఉందా? లండన్ డాక్టర్‌తో బ్రేకప్‌కు దారి తీసిన పరిస్థితులు ఏంటి? చివరకు లండన్ బాబుతో వెన్నెల జీవితాన్ని సరిపెట్టుకొందా? లేక సిద్ధూతో రిలేషన్‌కు ఎంత వరకు తీసుకెళ్లిందనే ప్రశ్నలకు సమాధానమే మెరిసే మెరిసే.

  Merise Merise movie review and Rating

  నిశ్చితార్థం జరిగిన అమ్మాయికి, జీవితంలో ఏమీ సాధించలేకపోయాననే నిరాశలో బతికే యువతీ, యువకుల ప్రేమకథ. కుటుంబ కట్టుబాట్లను ఎదురించి తన అస్థిత్వం కోసం అందర్నీ ఎదురించిన వెన్నెల.. బాల్యంలో మరణించిన తల్లితో ఉన్న ఎమోషనల్ బాండ్ కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడే కోణం ఈ సినిమాలో ఆకట్టుకొనే అంశం.

  దర్శకుడు పవన్ కుమార్ అనవసరపు ట్విస్టులకు పోకుండా, హంగులు ఆర్బాటాలకు దూరంగా నేరుగా, సింపుల్‌గా, ఫీల్‌గుడ్‌గా కథను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కథ, కథనాలు నింపాదిగా సాగడం కొంత వరకు సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. కానీ ఓ అమ్మాయిలోని ఎమోషనల్ కోణాన్ని ఆవిష్కరించే తపన దర్శకుడిలో కనిపిస్తుంది. అయితే దర్శకుడు కొత్త వాడైనా అనుభవం ఉన్న డైరెక్టర్‌గా సినిమాను డీల్ చేశారు. సన్నివేశాలను, కథలో ఎమోషన్స్ మరికొంత దట్టిస్తే శేఖర్ కమ్ముల అందించే కాఫీలాంటి సినిమా అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

  మెరిసే మెరిసే సినిమాలో ముఖ్యంగా వెన్నెల పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. పేరుకు తగినట్టే అందంగా, ఆకర్షణీయంగా శ్వేతా అవస్థి ఆలరిస్తుంది. అందంతోనే కాకుండా అభియనంతో కూడా ఆకట్టుకొన్నది. కీలక సన్నివేశాల్లో శ్వేతా అవస్థి నటన అద్భుతంగా ఉంది. ఇక హుషారు, ప్లే బ్యాక్ సినిమాతో పక్కింటి కుర్రాడిగా మెప్పించిన దినేష్ తేజ్ మరోసారి ఆకట్టుకొన్నాడు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే యువకుడిగా తెరపైన మెప్పించాడు. సౌమ్యంగా, ఎలాంటి అర్బాటాలు కనిపించకుండా డిజైన్ చేసిన పాత్రలో ఒదిగిపోయాడు. తన పాత్ర పరిధి మేరకు రాణించడాని చెప్పవచ్చు. మిగితా పాత్రల్లో సంజయ్ స్వరూప్, సంధ్యా జనక్, బిందు ఫర్వాలేదనిపించారు. హీరో, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు ప్రత్యేకంగా కనిపించారు.

  ఇక సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. అందుకు కారణం ప్రధానంగా సినిమాటోగ్రఫి అయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో కారణంగా చెప్పవచ్చు. నాగేశ్ బానెల్ ప్రతీ సన్నివేశాన్ని చాలా అందంగా చిత్రీకరించారు. పలు సన్నివేశాలను కార్తీక్ తన మ్యూజిక్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఎడిటర్‌కు ఇంకా చాలా పని ఉంది. సినిమాను 15 నుంచి 20 నిమిషాలు తగ్గిస్తే కథలో ఫీల్ పెరిగే అవకాశం ఉంది. హీరోయిన్‌ క్యాస్టూమ్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ విభాగం పనితీరు మరింత బాగుంది.

  ఇక కథ, నటీనటులు ఎంపికలో వెంకటేష్ కొత్తూరి టేస్ట్ బాగుంది. నిర్మాతగా అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచిని చెప్పాయి. ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు.

  అఖిల్ పై పోలండ్ బాలుడి ట్వీట్.. నాగార్జున రిప్లై..! | Filmibeat Telugu

  మెరిసే మెరిసే సినిమాను ఓవరాల్‌గా చూస్తే ఎలాంటి అశ్లీలత, క్రైమ్, అసభ్యత లేని క్లీన్ చిత్రంగా చెప్పవచ్చు. కథ, కథనాలు స్లోగా ఉండటం కాస్త ప్రతికూలంగా అనిపిస్తుంది. కాకపోతే శ్వేతా అవస్థి గ్లామర్, దినేష్ తేజ్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఫ్యామిలీతోపాటు యూత్‌కు చేరువైతే మెరిసే మెరిసే మంచి సక్సెస్‌ను అందుకోవడం ఖాయం.

  నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్థి, సంజయ్ స్వరూప్, గురు రాజా, సంధ్యా జనక్, బిందు, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు
  దర్శకత్వం: పవన్ కుమార్ కే
  నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
  సంగీతం: కార్తీక్ కొడకండ్ల
  సినిమాటోగ్రఫి: నాగేశ్ బానెల్
  ఎడిటర్: మహేష్ మేకల
  లిరిసిస్ట్: కృష్ణవేణి
  సింగర్స్: విజయ్ ప్రకాష్, చిన్మయి, లిప్సిక, అనురాగ్ కులకర్ణి
  పి.ఆర్‌.ఒ: సాయి స‌తీష్
  బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎల్‌ఎల్‌పి

  రిలీజ్ డేట్: 2021-08-06

  English summary
  Merise Merise movie hits the theatres on August 6, 2021. Dinesh Tej, Shweta Avasthi, Sanjay Swaroop and Gururaj Manepalli are lead pair. Directed by Pawan Kumar K.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X