twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెర్సల్ (అదిరింది) మూవీ రివ్యూ: విజయ్ పెర్ఫార్మెన్స్

    మెర్సల్ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. విడుదలకు ముందు అనేక వివాదాల్లో చిక్కుకున్న మెర్సల్ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 19న ప్

    By Rajababu
    |

    Rating:
    3.0/5
    Star Cast: విజయ్, నిత్యా మీనన్, సమంత, కాజల్, ఎస్ జే సూర్య
    Director: అట్లీ

    Recommended Video

    Mersal Movie Review : మెర్సల్ మూవీ రివ్యూ

    తెరీ చిత్రం తర్వాత దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్, ఇలయ దళపతి విజయ్ నటించిన చిత్రం మెర్సల్. ఈ చిత్రం తెలుగులో అదిరింది పేరుతో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. తెరీ తర్వాత విజయ్ నటించిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెర్సల్ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు.

    విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. విడుదలకు ముందు అనేక వివాదాల్లో చిక్కుకున్న మెర్సల్ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ ఆరంభం ఇలా..

    కథ ఆరంభం ఇలా..

    డాక్టర్ మారన్ (విజయ్) నిస్వార్థపరంగా వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాడు. కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తుంటాడు. వెట్రి (విజయ్) పాపులర్ మెజిషియన్. డాక్టర్ మారన్ అందించిన అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ దేశం అవార్డు ప్రకటిస్తుంది. ప్యారిస్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకొంటాడు. అదే సమయంలో వెట్రీ మ్యాజిక్ ప్రదర్శన ప్యారిస్‌లో జరుగుతుంది. మ్యాజిక్ ప్రదర్శనలో భాగంగా ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్‌ను వెట్రీ చంపి పగ తీర్చుకొంటాడు. డాక్టర్‌ను చంపిన వెట్రీ కూడా మారన్ మాదిరిగా ఉండటంతో మారన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.

    సినిమా ముగింపు

    సినిమా ముగింపు

    మారన్ అరెస్ట్‌ను చూసి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన డేనియల్ (ఎస్‌జే సూర్య) కంగుతింటాడు. ఆ తర్వాత మారన్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. మారన్‌ను డేనియల్ ఎందుకు చంపాలనుకొంటాడు? మారన్‌ను చూసి భయపడాల్సిన అవసరం డేనియల్ ఎందుకు ఏర్పడింది. ఇక ఈ కథకు కాజల్ అగర్వాల్, సమంత, నిత్యమీనన్ ఏ విధంగా తోడ్పాడ్డాడు అనే విషయాలకు సమాధానమే మెర్సల్ చిత్రం.

     ఫస్టాఫ్‌లో కథ

    ఫస్టాఫ్‌లో కథ

    సేవ కోసం కాకుండా పక్కా బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై దర్శకుడు సంధించిన సినీ విమర్శనాస్త్రం మెర్సల్ చిత్రం. వైద్య రంగంలో జరిగే కమీషన్ల దందా, ప్రైవేట్ హాస్పిటల్స్ దందాను దర్శకుడు అట్లీ కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ రకమైన కథకు హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలను బలంగా రాసుకోన్నాడు. సినిమా తొలి భాగంలో యాక్సిడెంట్ గురైన ఓ బాలిక ఎపిసోడ్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేతగా ఉంది. డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు చేసే దుర్మార్గాలను పచ్చిగా చూపించాడు. విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ సన్నివేశాలు తెరపై అద్భుతంగా ఉంటాయి. ప్రతీ పది నిమిషాలకు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి.

    సెకండాఫ్‌లో..

    సెకండాఫ్‌లో..

    ఓ గ్రామ పెద్ద వెట్రి మారన్ (విజయ్) కథ ఫ్లాష్ బ్యాక్‌తో ఆరంభమవుతుంది. పేదల కోసం పరితపించే వెట్రీ మారన్ క్యారెక్టర్ చక్కగా డిజైన్ చేశాడు. ఇక వెట్రీ మారన్ భార్య (నిత్యమీనన్) నటన సెకండాఫ్‌కు ప్రాణం పోసింది. గర్భవతి అయిన నిత్య మీనన్ వైద్యుల దుర్మార్గానికి గురై ప్రాణాలు కోల్పోయే ఎపిసోడ్ సినిమాకు హైలెట్. వెట్రీ మారన్ చనిపోయే ఎపిసోడ్‌లో యాక్షన్ పార్ట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఎమోషనల్‌గా సాగే కథలో ప్రతీ సన్నివేశం సినిమాను మరో మెట్టును ఎక్కించే విధంగా ఉన్నాయి. చక్కటి స్క్రీన్ ప్లేతో దర్శకుడు తన ప్రతిభ ఆకట్టుకునేలా ఉంటుంది.

    దర్శకుడు అట్లీ గురించి..

    దర్శకుడు అట్లీ గురించి..

    వెట్రి మారన్, వెట్రి, మారన్ అనే మూడు పాత్రలతో దర్శకుడు అట్లి మ్యాజిక్ చేశాడు. సామాజిక సమస్యకు కమర్షియల్ హంగులను చేర్చి సినిమాను పరుగులు పెట్టించడంలో నూటికి నూరు పాళ్ల సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా మొదటి భాగంలో వెట్రి, మారన్ క్యారెక్టర్లను నడిపించిన తీరు ప్రేక్షకులను అలరించేలా ఉంది. జీఎస్టీ అమలులో ప్రభుత్వాల తీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను రాసుకోని మెప్పించిన తీరు అట్లీ టాలెంట్‌కు అద్దం పట్టింది. కథలో కొన్ని లాజిక్కులు మిస్ అయినా అవేమీ పెద్దగా కనిపించవు.

    విజయ్ పెర్ఫార్మెన్స్

    విజయ్ పెర్ఫార్మెన్స్

    వెట్రి, మారన్, వెట్రి మారన్ అనే మూడు పాత్రల్లో విజయ్ జీవించాడనే చెప్పవచ్చు. మూడు విభిన్నమైన పాత్రలను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడు. బాధ్యతాయుతమైన డాక్టర్‌గా, మ్యాజిక్ మ్యాన్‌గా, ప్రజా సంక్షేమం కోసం పోరాడే గ్రామ పెద్ద పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. మాస్ ప్రేక్షకులతోపాటు, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మెప్పించే రీతిలో విజయ్ నటన ఉంటుంది. క్లైమాక్స్‌లో జీఎస్టీ వ్యతిరేకిస్తూ విజయ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

    పొలిటికల్ సెటైర్లు

    పొలిటికల్ సెటైర్లు

    ప్రధాని, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుంటే ప్రభుత్వ దవాఖానల పరిస్థితి మారుతుందా? వారంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకొంటే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది అనే డైలాగ్.. అలాగే సింగపూర్‌లో వైద్యంలో జీఎస్టీ 7 శాతమే ఉంది. అయితే మెడిసిన్స్ ఉచితంగా అందిస్తారు. కానీ మనదేశంలో జీఎస్టీ 28 శాతం, అదనంగా మెడిసిన్స్ పన్ను కూడా విధిస్తున్నారు. ఇదేలా పేదవారికి మేలు చేస్తుంది. ప్రజలకు హానీ చేసే మద్యంపై ప్రభుత్వం ఎందుకు పన్ను విధించదు అని ప్రశ్నించే తీరు ప్రజల స్పందన అద్భుతంగా ఉంది.

    నిత్య మీనన్ యాక్టింగ్

    నిత్య మీనన్ యాక్టింగ్

    వెట్రీమారన్ భార్య నిత్యామీనన్ ఎప్పటిలానే నటనతో వీర విహారం చేసింది. పంజాబీ యువతిగా నిత్య కనిపిస్తుంది. ప్రసవ సమయంలో నిత్య మీనన్ యాక్టింగ్ పీక్స్ చేరింది. తనకు లభించిన పాత్రకు నిత్య మీనన్ మరోసారి పూర్తి న్యాయం చేకూర్చింది. కాజల్, సమంత పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల కేవలం వారు పాటలకే పరిమితయ్యారు.

    ఎస్‌జే సూర్య నట విశ్వరూపం

    ఎస్‌జే సూర్య నట విశ్వరూపం

    మెర్సల్ చిత్రంలో ఎస్ జే సూర్య ప్రధాన ప్రతినాయకుడిగా నటించాడు. డేనియల్ పాత్రలో క్రూరమైన విలనిజాన్ని ప్రదర్శించాడు. తనదైన శైలిలో మరోసారి నట విశ్వరూపం ప్రదర్శించాడు. దక్షిణాదిలో విలనిజం చేయాంటే నన్ను మించినోడు లేడు అనే విధంగా ఎస్ జే సూర్య కనిపించాడు. స్పైడర్ తర్వాత ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎస్ జే సూర్యకు మరింత పేరు తెచ్చిపెడుతుంది.

     పవర్ ఫుల్‌గా విజయేంద్ర ప్రసాద్

    పవర్ ఫుల్‌గా విజయేంద్ర ప్రసాద్

    మెర్సల్ చిత్రానికి బాహుబలి ఫేం విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎంజీఆర్, రజనీకాంత్ సినిమాల మాదిరిగానే ప్రజాదరణను చూరగొనే విధంగా కథ రచించాడు. సెకండాఫ్‌లో చెత్తకుప్పలో పడిన పసికందు సీన్ బాహుబలిలో చిన్నపిల్లాడి ఎపిసోడ్‌ను గుర్తు తెస్తుంది. చత్రపతి, విక్రమార్కుడు లాంటి మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు అందించిన విజయేంద్ర ప్రసాద్ మారోసారి తన మార్కును బలంగా చూపించాడు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    విజయ్ స్నేహితుడిగా వడివేలు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సత్యరాజ్ నటించారు. వడివేలు ఎప్పడిలానే తనదైన శైలిలో కామెడీని పండించి అదనపు ఆకర్షణగా మారాడు. సత్యరాజ్ రోల్ కీలకమైనప్పటికీ.. ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించలేకపోయింది.

    రెహ్మాన్ మ్యూజిక్

    రెహ్మాన్ మ్యూజిక్

    ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. కీలక సన్నివేశాలలో రెహ్మాన్ రీరికార్డింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. భావోద్వేగ సన్నివేశాలకు రెహ్మాన్ మ్యూజిక్ ప్రాణం పోసింది. పాటలు ప్రేక్షకులను ఆలరించేలా ఉన్నాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

    ముగింపుగా..

    ముగింపుగా..

    అదిరింది మెడికల్ మాఫియాపై సంధించిన సినీ విమర్శనాస్త్రం. పగ, ప్రతీకారం అంశాలతో దర్శకుడు అట్లీ అద్భుతంగా తెరకెక్కించాడు. సామాజిక సమస్యను ఎలుగెత్తి చూపుతూ చేసిన ప్రయత్నం బ్రహ్మండంగా ఉంది అని చెప్పవచ్చు.

    ప్లస్, మైనస్ పాయింట్స్

    ప్లస్, మైనస్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్
    విజయ్, నిత్యా మీనన్, సూర్య నటన
    అట్లీ డైరెక్షన్
    విజయేంద్రప్రసాద్ స్క్రీన్ ప్లే

    నెగిటివ్ పాయింట్స్
    కథ రొటీన్‌గా ఉండటం

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు: విజయ్, నిత్యా మీనన్, సమంత, కాజల్, సత్యరాజ్, వడివేలు, ఎస్ జే సూర్య తదితరులు
    దర్శకత్వం: అట్లీ
    నిర్మాతలు: ఎన్ రామస్వామి, హేమా రుక్మిణి, ఆర్ మహేంద్రన్, హెచ్ మురళి
    కథ, స్కీన్‌ప్లే: అట్లీ, కేవీ విజయేంద్ర ప్రసాద్
    మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
    సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు
    బడ్జెట్: 130 కోట్లు
    రిలీజ్: 18 అక్టోబర్ 2017

    English summary
    Director Atlee, Hero Vijay combination again strike in south with Mersal. Now there come with lapses in Medical and Health system. In this movie Vijay potrayed tree roles effectively. Samantha, Kajal, Nitya menon are in lead pair to Vijay. This movie released on 19 October in Tamil Version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X