Meter Movie Review మ్యాటర్ లేని మీటర్.. కిరణ్ అబ్బవరం ఎలా చేశాడంటే?

Rating: 1.5/5

నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్ తదితరులు
దర్శకత్వం: రమేష్ కడూరి
నిర్మాతలు: చిరంజీవి ('మైత్రీ' చెర్రీ), హేమలత
మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫి: వెంకట్ సీ దిలీప్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్
రిలీజ్ డేట్: 2023-04-07

మీటర్ కథ ఏమిటంటే? : అంకితభావంతో పనిచేసే పోలీస్ ఆఫీసర్ కొడుకు అర్జున్ కల్యాణ్ (కిరణ్ అబ్బవరం). తనలాగే కొడుకు పోలీస్ ఉద్యోగం చేయాలని తండ్రి కోరుకొంటే.. అర్జున్ కల్యాణ్ మాత్రం పోలీస్ ఉద్యోగం అంటే అయిష్టంతో ఉంటాడు. కానీ అనుకోకుండా అర్జున్ కల్యాణ్ పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అయితే పోలీస్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయమని హోం మినిస్టర్, డీఐజీ వెంటపడుతాడు. కానీ ఓ దశలో పోలీస్ ఉద్యోగం కావాలని హోం మినిస్టర్‌ను అర్జున్ కల్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.

మీటర్ కథలో ట్విస్టులు : అర్జున్ కల్యాణ్‌కు పోలీస్ ఉద్యోగం అంటే ఎందుకు అయిష్టం. అర్జున్ కల్యాణ్‌కు అసలు పోలీసు ఉద్యోగం లభించిందా? సొంత తండ్రిని అర్జున్ కల్యాణ్ ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది? పోలీస్ ఉద్యోగం చేయకూడదని అనుకొన్న అర్జున్ కల్యాణ్ మళ్లీ పట్టుబట్టి ఆ ఉద్యోగం కావాలని ఎందుకు కోరుకొన్నాడు? హోం మినిస్టర్ (కాంటం బైరెడ్డి, డీఐజీ (వినయ్ వర్మ)లకు వ్యతిరేకంగా అర్జున్ కల్యాణ్ చేసిన పోరాటం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మీటర్ సినిమా కథ.

 Meter Movie Review

మీటర్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే? :రెగ్యులర్, రొటీన్, కమర్షియల్ అంశాలతో హీరో ఎలివేషన్ సీన్లు, మాస్ సన్నివేశాలతో మీటర్ మూస ధోరణిలో సాగుతుంది. అయితే భూతద్దం పెట్టినా ఎక్కడ కొత్తదనమే కనిపించదు. చాలా రొటీన్ పాత్రలు, రెగ్యులర్ కథనంతో విసుగుపుట్టించేలా సినిమా సాగుతుంది. సినిమా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు చూస్తే.. మూవీ భవిష్యత్ ఏమిటో సగటు ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతుంది. అయితే రొటీన్‌గా సాగుతున్న కథకు మంచి ట్విస్ట్ ఇచ్చి ఫస్టాఫ్‌ను ముగించడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా దర్శకుడు చేయడం కొంత సానుకూలంగా కనిపిస్తుంది.

మీటర్ సెకండాఫ్ గురించి: ఇక సెకండాఫ్‌పై పెరిగిన అంచనాలు మాత్రం కాసేపటికే ఆవిరి అయిపోతాయి. ఫస్టాఫ్‌లో పెట్టిన పాత చింతకాయ పచ్చడినే సెకండాఫ్‌లో పెట్టి మరింత బోర్ కొట్టించాడని చెప్పవచ్చు. అప్పటికప్పుడు జొప్పించిన ట్విస్టులు, పాతకాలం నాటి కథతో, హీరో ఇమేజ్‌కు మించిన భారీ సన్నివేశాలు, బడా హీరోకు సూటయ్యే బిల్డప్‌లతో దర్శకుడు రమేష్ కడూరి సాహసమే చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. టోటల్‌గా ఈ సినిమా సహనానికి ఓ పరీక్షలా మారిందనిపిస్తుంది.

 Meter Movie Review

కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్ గురించి: కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. మంచి కథ పడితే.. ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీస్తాడనే ఫీలింగ్ గత చిత్రాలు చెప్పాయి. అయితే ఒక హిట్టు.. నాలుగు ఫ్లాపులు అనే చందంగా ఆయన కెరీర్ ఊగిసలాడుతున్నది. అయితే ప్రతీ సినిమాలో తన పాత్రకు న్యాయం చేయడంలో కిరణ్ అబ్బవరం ప్రయత్న లోపం కనిపించదు. అయితే తనకు సూటయ్యే కథలను ఎంపిక చేసుకొంటే.. ఆదరించడానికి ప్రేక్షకులు ఉన్నారనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నాడనే విషయం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక మ్యాటర్ లేకుండా మీటర్ సినిమా చేసినట్టు కథ మొదలైన కొద్ది సేపటికే అర్ధమవుతుంది.

మీటర్‌లో సపోర్టింగ్ క్యారెక్టర్ల గురించి: మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. అతుల్య రవి మాత్రం పాటలకు తప్ప మరో పర్పస్ ఉన్నట్టు ఆమె పాత్రకు కనిపించదు. ఆటవిడుపుగా కనిపించే క్యారెక్టర్‌లో, ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్రలో అతుల్య రవి నటించిందని చెప్పవచ్చు. బైరెడ్డి పాత్రలో పవన్ ధనుష్‌ చాలా రొటీన్ పాత్ర. పోసాని, వినయ్ వర్మ, సప్తగిరి పాత్రలు పేకల్లో జోకర్లుగా కనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం పాత్ర తప్ప మరో పాత్ర బలంగా కనిపించదు.

 Meter Movie Review

మీటర్ టెక్నికల్‌గా ఎలా ఉందంటే? :
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కథలో పసలేనప్పడు సాంకేతిక నిపుణులు కూడా చేసేది ఏముండదనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ అంతంత మాత్రమే. పాత పాటలే మళ్లీ మళ్లీ రిపీట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అవసరం లేకున్నా సౌండ్ పెంచి రీరికార్డింగ్‌తో చిరాకు పుట్టించారనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఇతర విభాగాలు తమ పరిధి మేరకు ఒకే అనిపించాయి.

ఫైనల్‌గా మీటర్ ఎలా ఉందంటే?
కథ, కథనాలు, బలమైన పాత్రలు లేకుండా రెగ్యులర్, రొటీన్ మసాలలు దట్టించిన చిత్రం మీటర్. కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ.. అతడికి సరిపడే పాత్రలు కనిపించకపోవడంతో సినిమా తేలిపోయిందని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం అభిమానుల అంచనాలకు అభిరుచికి దూరంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. ఎలాంటి పాజిటివ్ అంశాలు లేని మీటర్ సినిమాను థియేటర్‌ వరకు వెళ్లి చూడాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పలేం. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరిస్తే.. కొంత మేరకు కమర్షియల్‌గా మీటర్‌కు గౌరవం దక్కే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X