Michael First Review: మైఖేల్ మూవీ ఫస్ట్ రివ్యూ

లెజెండరీ పాప్ సింగర్, స్వర్గీయ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael). మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు.

వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ క్రమంలో ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాకు లభించిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Michael Movie Review by Censor Board

మైఖేల్ సినిమా కథ విషయానికి వస్తే.. ది జాక్సన్ 5 (The Jackson 5) అంటే.. జాక్సన్ కుటుంబంలోని ఐదుగురు అన్నదమ్ముల మ్యూజిక్ జర్నీ. తండ్రి జో జాక్సన్ స్పూర్తితో ఐదుగురు జాక్సన్ బ్రదర్స్‌లోని జాకీ జాక్సన్, టిటో జాక్సన్, జెర్మైన్ జాక్సన్, మర్లాన్ జాక్సన్, మైఖేల్ జాక్సన్ 1964 సంవత్సరంలో ఇండియానాలోని గ్యారీ అనే ప్రదేశంలో మ్యూజిక్ బ్యాండ్‌ను ప్రారంభించారు. ఈ బ్యాండ్‌ను తండ్రి జో జాక్సన్ పర్యవేక్షించే వారు. 1960 నుంచి సాగిన వారి మ్యూజిక్ జర్నీ ఆధారంగా కొన్ని ముఖ్య సంఘటనలు ఆధారంగా చేసుకొని నిర్మించారు. పేరు, ఊరు లేకుండా ఈ ఐదుగురు అన్నదమ్ములు ప్రపంచ సంగీత ప్రపంచాన్ని ఎలా ఏలడానికి కష్టపడ్డారు? వారికి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వారు ఎదుర్కొన్న వర్ణ వివక్ష, జాతి వివక్ష సంఘటనలు వారిని ఎలా రాటుదేల్చాయి. వరల్డ్ మ్యూజిక్‌లో తమ పేరు మార్మోగేలా ఎలా ఎదిగారు? ప్రపంచ సంగీత ప్రియులను ఉర్రూతలూగించే విధంగా పాప్ దేవుడిగా మైఖేల్ జాక్సన్ ఎలా అవతరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్‌కు వందల కోట్లమంది అభిమానులు ఉన్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమాను అత్యంత టెక్నికల్‌గా, క్వాలిటీగా రూపొందించారు. ఈ మూవీని 2D, MX4D, ICE, IMAX 2D, DOLBY CINEMA 2D, 2D SCREEN X, 4DX ఫార్మాట్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 1900 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. కంటెంట్ పరంగా, టెక్నికల్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా రూపొందించారనే ఫీడ్ బ్యాక్ సెన్సార్ నుంచి వచ్చింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మైఖేల్ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డ్ ప్రతినిధులు, అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. చిత్ర యూనిట్ కొన్ని వివరణలు ఇవ్వడం, మరికొన్ని సవరణలు చేయడంతో ఎలాంటి వివాదాలు ఎదురు కాలేదు. ఈ సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లు నిండిన వారికి ఎలాంటి అనుమతులు, ఆంక్షలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

మైఖేల్ చిత్రం కథ పరిమితమైనది కావడం, పూర్తిస్థాయిలో ఆయన జీవితాన్ని తెరకెక్కించకపోవడం వల్ల నిడివి తక్కువగానే ఉంది. ఈ సినిమాను క్రీస్పీగా 2 గంటల 10 నిమిషాలు అంటే.. 130 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా వీక్షించిన తర్వాత చాలా ఎమోషనల్‌గా కంటెంట్ ఉంది. ప్రతీ ప్రేక్షకుడిని, ముఖ్యంగా మ్యూజిక్ లవర్‌ను కదిలించి వేస్తుందనే అభిప్రాయం సెన్సార్ నుంచి వచ్చిందనే విషయాన్ని చిత్ర యూనిట్ పంచుకొన్నది. మైఖేల్‌ను ఆరాధించే ప్రతీ ఒక్కరిని ఈ సినిమా భావోద్వేగానికి గురి చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర స్టోరీల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X