Michael Twitter Review: మైఖేల్ మూవీ ట్విట్టర్ రివ్యూ
కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael). మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు.
వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

మైఖేల్ మూవీ చూడటం పూర్తయింది. మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించిన జాఫర్ జాక్సన్, కాల్మన్ డొమింగో అద్బుతమైన నటనను ప్రశంసించలేక ఉండలేకపోతున్నాను. తెర మీద మైఖేల్ జాక్సన్, ఆయన తండ్రిని చూస్తున్నామా? అనేంతగా నటించారు. విజువల్ పరంగా, మ్యూజిక్ పరంగా సూపర్ ఎంజాయ్‌బుల్, చాలా బాగుంది. మైఖేల్, ఆయన తండ్రి మధ్య వచ్చే విభేదాలు సినిమాకు బ్యూటీగా మారింది. కాస్మోటిక్ సర్జరీ తదితర అంశాలు సినిమాకు బలంగా మారాయి. ఆయన జీవితాన్ని 2 గంటల్లో చూపించడం కష్టమే అనిపించింది అంటూ సుదీర్ఘమైన రివ్యూను నెటిజన్ రాశారు.
మైఖేల్ మూవీని చూశాను. జాఫర్ జాక్సన్, కాల్మన్ డొమింగో ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. ఇంకా వారి పెర్ఫార్మెన్స్ నన్ను వెంటాడుతున్నది. ఈ సినిమాను రెండోసారి కూడా చూస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మైఖేల్ సినిమా చూసి నిరాశ చెందాను. పాఠ్యాంశంగా మాదిరిగా ఉన్న బయోపిక్‌లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. లెజెండరీ పాప్ సింగర్ జీవితాన్ని చెప్పే సమయంలో ఉండాల్సిన గ్రౌండ్ రియాలిటీ కనిపించలేదు. కానీ జాఫర్ జాక్సన్ ఎక్సలెంట్‌తో ఆకట్టుకొన్నాడు. తన మామ పాత్రలో అద్బుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. 80వ దశకంలోని మైఖేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కు మాత్రమే కనెక్ట్ అవుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మైఖేల్ సినిమా ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్స్ లాంటిది. మైఖేల్ జాక్సన్ జీవితం చాలా గొప్పది, సుదీర్ఘమైనది. ఆయన లైఫ్‌ను రెండు గంటల సినిమాలో చూపించడం కష్టం. కానీ ఈ సినిమా చూసినంత సేపు ఫన్‌గా ఫీలయ్యాను. మైఖేల్ జాక్సన్‌గా జాఫర్ జాక్సన్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు మతిపోయింది. ఈ సినిమా చూసినంత సేపు గొప్ప అనుభూతికి గురయ్యాను అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications