twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Michael Review ట్విస్టులు, ఎమోషన్స్‌తో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా.. సందీప్ కిషన్ ఎలా చేశారంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, అయ్యప్ప పీ శర్మ తదితరులు
    రచన, దర్శకత్వం: రంజిత్ జయకోడి
    నిర్మాత: శివ చెర్రీ, భరత్ చౌదరీ, పుస్కూరు రామ్మోహన్ రావు
    మ్యూజిక్: సామ్ సీఎస్
    ఎడిటింగ్: సత్యనారాయణ్
    సినిమాటోగ్రఫి: కిరణ్ కౌశిక్
    బ్యానర్: కరణ్ సీ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
    రిలీజ్ డేట్: 2023-02-03

    మైఖేల్ కథ ఏమిటంటే?

    మైఖేల్ కథ ఏమిటంటే?

    గురునాథ్‌, చారులత దంపతులు (గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ) ముంబైలో బలమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొంటారు. రథన్ (అనీష్ కురువిల్లా)కు గురునాథ్‌కు మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతుంటుంది. గురనాథ్‌పై రెండుసార్లు హత్య ప్రయత్నం జరుగగా మురికివాడలో నివసించే అబ్బాయి మైఖేల్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు.

    దాంతో అయితే తనపై జరిగిన హత్యా ప్రయత్నానికి కారణం రథన్ అనే విషయం తెలిసిన గురునాథ్.. రథన్‌ను, ఆయన కూతురు తీర (దివ్యాంశ కౌశిక్)ను చంపమని మైఖేల్‌ను ఆదేశిస్తాడు. వారిద్దరిని చంపడానికి వెళ్లిన మైఖేల్ మనసు మార్చుకొని రథన్, తీరను వదిలేస్తాడు.

    మైఖేల్ కథలో ట్విస్టులు

    మైఖేల్ కథలో ట్విస్టులు

    గురునాథ్‌పై గురుభక్తిని ప్రదర్శించే మైఖేల్ ఆయన ప్రత్యర్థులను ఎందుకు వదలేశాడు? రథన్, తీరను చంపకుండా వదిలేయడానికి కారణాలు ఏమిటి? తన ప్రత్యర్థి రథన్‌ను, తీరను చంపకుండా వదిలేసిన మైఖేల్‌పై గురునాథ్ ఎలా స్పందించాడు. తనకు జీవితాన్ని ప్రసాదించిన గురునాథ్‌కు వ్యతిరేకంగా మైఖేల్ ఎందుకు తిరుగుబాటు చేశాడు? తీరతో ప్రేమ వ్యవహారం , మైఖేల్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేసింది? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రల పరిధి ఏమిటి? మైఖేల్, గురునాథ్ మధ్య అధిపత్య పోరాటంలో చివరకు ఏం జరిగింది? గురునాథ్ కొడుకు వరుణ్ సందేశ్‌కు మైఖేల్‌కు మధ్య గొడవేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మైఖేల్ సినిమా కథ.

    ఫస్టాఫ్‌లో లవ్, ఎమోషనల్‌గా

    ఫస్టాఫ్‌లో లవ్, ఎమోషనల్‌గా

    గ్యాంగ్‌స్టర్ డ్రామా అనగానే.. ఒక సామాన్యుడు మాఫియా సామ్రాజ్యానికి గ్యాంగ్‌స్టర్‌గా మారడమనేది ఏ కథలోనైనా కామన్. అలాంటి కథలో కొత్తదనం ఏమిటి? ఎమోషన్స్ ఏ రేంజ్‌లో పండాయనే విషయంపైనే సినిమా ఆధారపడి ఉంటుంది. అయితే రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామాగానే మైఖేల్ సినిమా మొదలవుతుంది.

    అయితే క్యారెక్టర్ల మధ్యలో కాన్‌ఫ్లిక్ట్, సినిమా బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకు కొత్తగా ఆసక్తిని రేపుతాయి. గౌతమ్ వాసుదేవన్, అనసూయ మధ్య రిలేషన్‌లో ఓ ట్విస్టు కథకు మూలంగా కనిపిస్తుంది. రథన్‌గా అనీష్ కురువిల్లా మరో గ్యాంగ్‌స్టర్ పాత్ర ద్వారా కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆసక్తిగా ఆరంభించి.. కొత్తదనం చూపించేందుకు రంజిత్ ప్రయత్నించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో రెగ్యులర్ ప్యాటర్న్‌లో వెళ్లినా.. హీరో, హీరోయిన్ల లవ్ ఎపిసోడ్ కథను మలుపుతిప్పేందుకు కారణమవ్వడం ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

    విజయ్ సేతుపతి, వరలక్ష్మీ ఊపుతో

    విజయ్ సేతుపతి, వరలక్ష్మీ ఊపుతో

    మైఖేల్ సినిమా రెండో భాగం విషయానికి వస్తే.. రోటీన్‌గా సాగే గ్యాంగ్ వార్ మధ్యకు విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ల ఎంట్రీతో కథ, కథనాలు మారిపోయి.. మరోసారి ప్రేక్షకులకు ఊపు తెచ్చినట్టు అనిపిస్తాయి. కానీ ఆ ఊపు ఎక్కువ సేపు కొనసాగలేకపోవడంతో మళ్లీ తెరమీద ఎప్పటి ఆటే కనిపిస్తుంది. చివరల్లో గౌతమ్ వాసుదేవన్ క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్టు కొత్తగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు మైఖేల్ కథకు పలు సినిమాల కారణం అంటూ నిజాయితీని చాటుకోవడం ఈ సినిమాకు కొసమెరుపు.

    సందీప్ కిషన్ వన్ మ్యాన్ ఆర్మీగా

    సందీప్ కిషన్ వన్ మ్యాన్ ఆర్మీగా

    యువ హీరో సందీప్ కిషన్ ఎప్పటికప్పుడు కొత్తగా తనను తాను ప్రజెంట్ చేసుకొనే తీరు అందర్నీ ఆకట్టుకొంటుంది. మైఖేల్‌ విషయంలో కూడా కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచేందుకు ప్రయత్నించిన తీరు బాగానే ఉంది. కానీ కేజీఎఫ్ లాంటి సినిమాలో యష్‌ను చూసిన ప్రేక్షకులు మైఖేల్ క్యారెక్టర్‌లో ఆ పవర్ లేకపోవడం కొంత నిరాశను కలిగించేలా ఉంటుంది. కాకపోతే ఫెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్ డిఫరెంట్‌గా, కొత్తగా, సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశాడనే చెప్పవచ్చు. పాటలు, ఫైట్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. దివ్యాంశ కౌశిక్ హాట్ హాట్‌గా యూత్‌కు పిచ్చెక్కించే పాత్రలో కనిపించింది.

    ఇంటెన్స్ రోల్‌లో గౌతమ్ వాసుదేవన్

    ఇంటెన్స్ రోల్‌లో గౌతమ్ వాసుదేవన్

    మైఖేల్ సినిమాకు ప్రాణంగా నిలిచిన పాత్ర గౌతమ్ వాసుదేవన్ మీనన్. గ్యాంగ్‌స్టర్‌గా సినిమాను లీడ్ చేశాడనే చెప్పాలి. అనసూయ భరద్వాజ్ క్యారెక్టర్ విషయంలో ఏదో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాసేపు అతిథి పాత్రలతో వచ్చిన వరలక్ష్మీ, విజయ్ సేతుపతి సినిమాలో జోష్‌ను తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇక అయ్యప్ప శర్మ, అనీష్ కురువిల్లా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

    మ్యూజిక్, సినిమాటోగ్రఫి హైలెట్

    మ్యూజిక్, సినిమాటోగ్రఫి హైలెట్

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఫుల్ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇవ్వాల్సిందే. కిరణ్ కౌశిక్ సినిమాను అందంగా తీర్చిదిద్దారు. సన్నివేశాలను అద్బుతంగా చూపించారు. డిఫరెంట్ కలర్ టోన్‌తో సినిమా డిఫరెంట్‌గా మార్చారు. ఇక డైలాగ్ పార్ట్ అతిగా అనిపిస్తుంది. పేజీలకొద్ది డైలాగ్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసిందానిపిస్తుంది. సామ్ సీఎస్ అందించిన బీజీఎం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. సత్యనారాయణ్‌కు ఎడిటింగ్ పరంగా ఇంకా చాలా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    మాఫియా గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటం, పాత్రల మధ్య ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కిని చిత్రం మైఖేల్. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రదానంగా బలంగా కనిపిస్తాయి. అయితే కథలో వెరైటీ లేకపోవడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా అనిపిస్తుంది. సినిమా తొలి ఫ్రేమ్ చూడగానే కేజీఎఫ్‌ మూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫీల్ చివరి వరకు సాగడంతో మైఖేల్‌లో కొత్తదనం కనిపించదు. సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి మైఖేల్‌ కూడా నచ్చుతుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    సందీప్ కిషన్, గౌతమ్ మీనన్ పెర్ఫార్మెన్స్
    మ్యూజిక్, సినిమాటోగ్రఫి
    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండకపోవడం
    చాలా సినిమాల ప్రభావం

    English summary
    Young Hero Sandeep Kishan's latest movie is Michael. Varalaxmi Sarathkumar, Vijay Sethupati, Gautham Vasudev Menon, Anasuya are in lead roles. This movie hits the theatres on Feb 3rd. Here is the Telugu filmibeat's exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X