twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, తరుణ్ భాస్కర్
    Director: వినోద్ అనంతోజు

    ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో ఆనంద్ దేవరకొండ, యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ జంటగా యువ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం విడుదలకు ముందే మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన లభించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ కావాల్సిన చిత్రం లాక్‌డౌన్ కారణంగా నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ

    మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ

    రాఘవ (ఆనంద్ దేవరకొండ) తన తండ్రి (గోపరాజు రమణ), తల్లి (సురభి ప్రభావతి) నిర్వహించే హోటల్‌‌లో చేదోడువాదోడుగా ఉంటాడు. పల్లెలో హోటల్ వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో గుంటూరు టౌన్‌లో మరో హోటల్‌ను తెరువాలనుకొంటాడు. హోటల్‌ను తెరువడానికి తన కుటుంబానికి చెందిన పొలాన్ని తాను ప్రేమించిన సంధ్య (వర్ష బొల్లమ్మ) తండ్రికి అమ్మేయడం, ఆ తర్వాత వెంటనే దానికి ధరకు రెక్కలు వస్తాయి.

    మిడిల్ క్లాస్ మెలోడీస్ కథలో ట్విస్టులు

    మిడిల్ క్లాస్ మెలోడీస్ కథలో ట్విస్టులు

    గుంటూరులో హోటల్ ప్రారంభించడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తాను ప్రేమించిన సంధ్యను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? రాఘవ ప్రారంభించిన హోటల్‌ ఏ మేరకు కస్టమర్లను ఆకట్టుకొన్నది? హోటల్ వ్యాపారాన్ని గాడిలో పెట్టడానికి రాఘవ ఎలాంటి కష్టాలు పడ్డారు? తన కుటుంబానికి చెందిన పొలం వివాదం చివరకు ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానమే మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్ర కథ.

    మిడిల్ క్లాస్ మెలోడిస్ ఎలా ఉందంటే.

    మిడిల్ క్లాస్ మెలోడిస్ ఎలా ఉందంటే.

    తండ్రి చాదస్తాన్ని భరిస్తూ సొంత కాళ్లమీద ఎదగాలనే రాఘవ అనే యువకుడి కథతో సినిమా మొదలవుతుంది. పాత్రలను చకచకా పరిచయం చేయడం ద్వారా దర్శకుడు కథలో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. గుంటూరులో హోటల్ పెట్టడానికి పొలం అమ్మకం విషయంలో కొన్ని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. హోటల్ పెట్టడం ద్వారా ఎదురైన సమస్యలు, అలాగే తన ప్రియురాలికి వారి తల్లిదండ్రులు సంబంధాలు చూడటం లాంటి అంశాలు సినిమా రెండో భాగానికి కొంత బలాన్ని చేకూరుస్తాయి. చివర్లో తరుణ్ భాస్కర్ పాత్ర ఎంట్రీ ఇవ్వడం కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఓ చక్కటి అంశంతో కథను సుఖాంతం కావడం సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారుతుంది. అయితే కథలో బలమైన సన్నివేశాలు, లవ్ ట్రాక్‌లో కొత్తదనం కొరవడం సినిమా రొటీన్‌గా అనిపిస్తుంది. స్క్రిప్టు పరంగా మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే డెఫినెట్‌గా ఓ మంచి నేటివిటి చిత్రంగా మారి ఉండేదనే ఫీల్ కలుగుతుంది.

    దర్శకుడు వినోద్ ప్రతిభ

    దర్శకుడు వినోద్ ప్రతిభ

    గ్రామీణ ప్రాంతంలో ఉండే సహజత్వం ఉట్టి పడే పాయింట్‌ను దర్శకుడు వినోద్ ఎంచుకోవడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. కల్మషం లేని మట్టి మనుషుల పాత్రలను తెరపైన సజీవంగా చూపించేందుకు ప్రయత్నించిన తీరు అభినందనీయం. కథలో ఎమోషన్స్, హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్‌ను మరింత మెరుగ్గా తెరకెక్కించాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. నూతన దర్శకుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. కొత్త దర్శకుడిగా ఓ మంచి ప్రయత్నమే చేశాడనిపిస్తుంది. కథను చెప్పే విషయంలో ఎలాంటి తడబాటు కనిపించలేదు కానీ.. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ఎలిమెంట్స్ లేకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది. కొత్త నటీనటులతో రెండు గంటలపాటు ప్రేక్షకుడిని కథలో లీనం చేయడమే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

    ఆనంద్ దేవరకొండ మరింత మెచ్యురిటీగా

    ఆనంద్ దేవరకొండ మరింత మెచ్యురిటీగా

    ఆనంద్ దేవరకొండ నటన విషయానికి వస్తే మొదటి సినిమా కంటే మరింత మెచ్యురిటీ కనిపిస్తుంది. రాఘవ పాత్రలో ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో ఆనంద్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. కథకు తగినట్టు పక్కింటి కుర్రాడిగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. లవ్ ట్రాక్‌లో సున్నితమైన రొమాన్స్‌ను సహజంగా పలికించడంలో సఫలమయ్యాడు. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించాడు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పెషల్ ఎంట్రీతో సర్‌ప్రైజ్ ఇస్తాడు.

    వర్ష బొల్లమ్మ, ఇతర నటీనటుల గురించి

    వర్ష బొల్లమ్మ, ఇతర నటీనటుల గురించి

    ఇక వర్ష బొల్లమ్మ సంధ్యగా సహజమైన నటనను ప్రదర్శించింది. చాలా సన్నివేశాల్లో హావభావాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ముఖం చిన్న కోపం, చిరునవ్వు ప్రదర్శిస్తూ సంధ్య పాత్రకు న్యాయం చేసింది. తన పాత్రను తన శక్తిమేరకు బెటర్‌గా ఉండేలా నటించింది. ఇక గోపరాజు రమణ ఆనంద్ తండ్రిగా పోషించిన పాత్రను చూస్తే పల్లెటూరులో ఓ తండ్రిని గుర్తు చేస్తుంటాడు. మనుసులో ఏది తోస్తే దానిని ఫిల్టర్లు లేని పాత్రలో కనిపించి మెప్పించారు. పాత్ర స్వభావానికి తగినట్టు ఓ ఫ్లోలో ముందుకెళ్లినట్టు అనిపిస్తుంది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి తన పాత్రకు న్యాయం చేశారు. మిగితా పాత్రలో నటించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. రాఘవ స్నేహితుడు గోపాల్ (చైతన్య గరికపాటి), గౌతమి (దివ్య శ్రీపాద) తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    ఇక తెర వెనుక అంశాలకు వస్తే.. డైలాగ్స్ చాలా సహజసిద్ధంగా ఉన్నాయి. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె అందాలను చక్కగా తెరపైన చూపించారు. శ్రీకర్ అగస్తి మ్యూజిక్ సినిమాకు ఆకర్షణగా మారింది. రవితేజ ఎడిటింగ్ ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపించేలా ఉంది. భవ్య క్రియేషన్స్ స్థాయికి తగినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా విషయానికి వస్తే.. సింపుల్‌గా ఆకట్టుకొనే క్యూట్ స్టోరి. కమర్షియల్‌ విలువలకు కాస్త దూరంగా అత్యంత సహజసిద్ధంగా, పల్లెటూరు, మట్టి వాసన ప్రతిబింబించే కాన్సెప్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. సమాజంలో మన కళ్లముందు కదలాడే పాత్రలు స్పష్టంగా కనిపిస్తాయి. పాత్రలు మధ్య ప్రేక్షకుడు భాగమైనట్టు ఓ ఫీలింగ్ కలుగుతుంది. నటీనటులు ప్రతిభ, డైలాగ్స్ సినిమాకు బలంగా మారాయి. అసభ్యత, అశ్లీలత లేని క్లీన్ గ్రీన్ చిత్రమని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అంచనాలు లేకుండా మంచి గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాను కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.

    Recommended Video

    Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie
    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు


    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, తరుణ్ భాస్కర్, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, గోపరాజు రమణ తదితరులు
    దర్శకత్వం: వినోద్ అనంతోజు
    నిర్మాత: వీ ఆనంద్ ప్రసాద్
    కథ, డైలాగ్స్: జనార్ధన్ పసుమర్తి
    స్క్రీన్ ప్లే: వినోద్ అనంతోజు, జనార్ధన్ పసుమర్తి
    మ్యూజిక్: శ్రీకర్ అగస్తి, ఆర్ హెచ్ విక్రమ్
    సినిమాటోగ్రఫి: సన్ని కూరపాటి
    ఎడిటింగ్: రవితేజ గిరిజాల
    బ్యానర్: భవ్య క్రియేషన్
    రిలీజ్ డేట్: 2020-11-20
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

    English summary
    Middle Class Melodies is Tollywood's comedy drama film directed by debutante Vinod Ananthoju and starring Anand Devarakonda and Varsha Bollamma. The film is scheduled to be released on Amazon Prime Video on 20 November 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X