Mirai Movie Review: మిరాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: తేజా సజ్జా, శ్రీయా సరన్, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతిబాబు, జయరాం, రాజేంద్రనాథ్, పవన్ చోప్రా, తంజా కెల్లర్ తదితరులు
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
మ్యూజిక్: గౌరా హరి
సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
డైలాగ్స్: మణిబాబు కరణం
ప్రొడక్షన్ డిజైనర్‌: శ్రీ నాగేంద్ర తంగల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2025-09-12

కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి విజయం సాధించిన తర్వాత తనలోని శక్తులను 9 గ్రంథాలుగా మార్చాడు. ఆ తొమ్మిది గ్రంథాలను చేజిక్కించుకొన్న వ్యక్తికి అమరత్వం లభిస్తుంది. అలాంటి అపూర్వమైన గ్రంథాలకు ప్రపంచాన్ని శాసించాలనే దుష్టబుద్ది కలిగిన మహావీర్ లామా (మంచు మనోజ్) కారణంగా ముప్పు ఏర్పడుతుంది. మనో నేత్రంతో ఆ ముప్పును పసిగట్టిన అంబికా దేవీ (శ్రీయా సరన్) తన ఆధీనంలో ఉన్న ఎనిమిది మంది గ్రంథ పరిరక్షకులను హెచ్చరిస్తుంది. అయితే తొమ్మిదో గ్రంథాన్ని రక్షించుకొనేందుకు అవసరమైన మిరాయ్ అనే ఆయుధాన్ని సాధించేందుకు తన సొంత కొడుకు వేద్ (శ్రీయా సరన్)ను త్యాగం చేస్తుంది. అనాథగా పెరిగిన వేదను విభ ( రితికా నాయక్) ఎందుకు వెతుక్కొంటూ వెళ్లింది.

Mirai Movie Review and Rating

అశోకుడు తనలోని శక్తులను 9 గ్రంథాలుగా ఎందుకు మార్చాడు? తొమ్మిది గ్రంథాలను చేజిక్కించుకొని అమరత్వాన్ని సాధించాలనే కోరిక మహావీర్‌కు ఎందుకు కలిగింది? పసిగుడ్డు వేద్‌ను అంబికా వదిలేయడం వెనుక కారణం ఏమిటి? అంబికా ఆధీనంలో ఎనిమిది గ్రంథాలు ఎందుకు ఉన్నాయి? మహావీర్ లామా దుష్టుడిగా మారి బ్లాక్ స్వార్డ్ పట్టేందుకు జరిగిన సంఘటన ఏమిటి? అనాధగా పెరిగిన వేద్‌ను వెతుక్కొంటూ విభ ఎందుకు వెళ్లింది? తన జన్మ రహస్యం తెలుసుకొన్న వేద్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? అసలు మిరాయ్ అంటే ఏమిటి? దానిని చేజిక్కించుకోవడానికి వేద్ ఏం చేశాడు? మహావీర్ దుష్ట ప్రయత్నాలను వేద్ ఎలా ఎదుర్కొన్నాడు? తన తల్లి త్యాగానికి, ఆమె తెగ కోసం ఎలాంటి సాహసాన్ని చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే మిరాయ్ సినిమా కథ.

అశోకుడు చేసిన కళింగ యుద్దం నాటి పాయింట్‌ను ఎంచుకొని సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రాసుకొన్న కథ, కథనాలు బాగున్నాయి. అయితే సింపుల్ కథకు టెక్నికల్ ఎలిమెంట్స్ జోడించి తెర మీద పవర్‌ఫుల్‌గా మార్చిన తీరుకు అభినందించాల్సిందే. కానీ అనుసరించిన కథనం బాగుంది.. కానీ మధ్యలో కామెడీ కోసం ప్రయత్నించి జొప్పించిన సీన్లు మాత్రం సినిమా ఫ్లోను, ఎమోషన్స్‌కు అడ్డు కట్ట వేశాయనే చెప్పాలి. దర్శకుడు కిషోర్ తిరుమల ట్రాక్ బాగుంది. కానీ ఈ సినిమాకు అవసరం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వెంకటేష్ మహాతో చేయించిన సీన్లు కథా వేగానికి బ్రేక్ వేయడమే కాకుండా సినిమాను కొంత పొల్యూట్ చేసిందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు కార్తీక్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఈ చిత్రంతో కొత్త వరల్డ్‌ను క్రియేట్ చేసిన తీరుకు ప్రశంసలు అందించాల్సిందే. సినిమాపై హైప్ పెంచడానికి, మరో మెట్టు ఎక్కించడానికి ప్రభాస్, రానాను వాడుకొన్న తీరు దర్శకుడిగా అతడి మార్కెటింగ్ విజన్‌కు అద్దం పట్టింది.

మిరాయ్ సినిమా హై నోట్‌తో ప్రారంభమైనప్పటికీ.. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువగానే సమయం తీసుకొన్నాడు. పాత్రల పరిచయం.. డిటేయిలిటీ కారణంగా కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు 20 నిమిషాల ముందు టేకాఫ్ తీసుకొన్న విధానం సినిమాను అమాంతం లేపేసింది. ఇక సెకండాఫ్‌లో అదే జోష్ కొనసాగుతుందనుకొంటే.. దర్శకుడు మళ్లీ వెంకటేష్ మహా లాంటి కథకు అవసరం లేని క్యారెక్టర్లను తీసుకొచ్చి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌ను డిస్ట్రబ్ చేశాడు. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి అనుసరించిన వీఎఫ్ఎక్స్, క్లైమాక్స్ డిజైన్ బ్యాలెన్స్ చేసింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలోని వేద్ పాత్ర హనుమాన్ సినిమాలోని క్యారెక్టర్‌కు ఎక్స్‌టెన్షన్‌గా అనిపిస్తుంది. కానీ వేద్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విధానం బాగుంది. వేద్‌గా తేజా సజ్జా లుక్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్లలోను, యాక్షన్ సీన్లలోను అదరగొట్టేశాడు. తన పాత్ర ద్వారా, ఇతర పాత్రల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టేందుకు చేసిన ఎఫర్ట్ బాగుంది. మహావీర పాత్రలో మంచు మనోజ్ క్రేజీగా ఉన్నాడు. తెరపైన డిఫరెంట్ లుక్, యాటిట్యూడ్‌తో సినిమాకు మరింత బలంగా మారాడు. మనోజ్‌లో కొత్త అవతారాన్ని చూసే ఛాన్స్ లభించింది. శ్రీయా సరన్ తన ఇమేజ్‌కు భిన్నంగా కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. అంతేకాకుండా సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు చేర్చే బాధ్యతను ఆమె తన భుజాలపైకి ఎత్తుకొన్నారు. ఇక ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పాటలకు, గ్లామర్‌కు పరిమితమవుతున్నారనే విమర్శలను తిప్పి కొట్టే విధంగా రితిక నాయక్ చేసిన విభ పాత్ర ఉంటుంది. యాక్టింగ్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నది.

టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫిని, స్క్రీన్ ప్లేను అందించి.. ఈ మూవీకి నెక్ట్స్ రేంజ్‌కు చేర్చాడు. సన్నివేశాలను స్క్రీన్ మీద పెయింటింగ్‌లా మార్చాడు. సినిమాను విజువల్ ట్రీట్‌గా అందించారు. ఇక ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్. హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉండేదనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. విశ్వ ప్రసాద్‌కు సినిమాపై ఉన్న తపన, అభిరుచి ఏమిటో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.

ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో పురాణాలను జోడించి సోషల్ ఎలిమెంట్స్‌తో స్క్రీన్ మీద చూపించిన దృశ్య కావ్యం. ఇతిహాసాలను ఈ జనరేషన్‌కు టచ్ చేసే విధంగా రూపొందించిన ఫుల్లీ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. కన్వినియెంట్‌ స్క్రీన్ ప్లేతో కథను కన్విన్సింగ్‌గా చెప్పడంలో దర్శకుడు కార్తీక్ సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ విజన్‌ను ఒక టీమ్‌గా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫుల్‌ఫిల్ చేశారు. స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నా లాజిక్‌లు వెతక్కుండా చూస్తే.. డెఫినెట్‌గా విజువల్ ట్రీట్. ఏలాంటి అనుమానాలు లేకుండా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకొంటే.. ఈ వారం మిరాయ్‌ని మీరు చూసే చిత్రాల జాబితాలో నిస్సందేహంగా చేర్చుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X