Mirai Twitter Review: మిరాయ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్న హనుమాన్ తర్వాత యువ హీరో తేజా సజ్జా నటించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో మంచు మనోజ్ తొలిసారిగా విలన్‌గా కనిపించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రీయా సరన్ తల్లి పాత్రలో మొదటిసారి నటించారు. శ్రీరాముడు జీవితంతో ముడిపడి ఉన్న ఓ పాయింట్‌తో పురాణాలు, సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మించిన ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

ఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్‌ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముంబై, అమెరికాలో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనల తర్వాత ఈ మూవీపై నెటిజన్ల అభిప్రాయాలు, రివ్యూలు, ఫీడ్ బ్యాక్ గురించిన వివరాల్లోకి వెళితే..

Mirai Movie Twitter Review

మిరాయ్ సినిమా ఫస్టాఫ్‌ చూస్తే అద్బుతమైన దృశ్య కావ్యంగా ఉంది. కళ్లకు, మనసుకు పండుగలా కనిపిస్తుంది. సినిమా స్కేల్, విజువల్స్ బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ను పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విధ్వంసం సృష్టిస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్. తేజా తేజా మరో మంచి స్క్రిప్టును ఎంచుకొని భారీ సినిమాను అందించాడు. సినిమా చాలా స్లోగా మొదలై.. ఊహించని విధంగా పుంజుకొన్నది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సెకండాఫ్ యావరేజ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ గ్రేట్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలనిపించేంతగా చిత్రీకరించారు. జై శ్రీరామ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మిరాయ్, బాహుబలి కనెక్షన్ మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ వాయిస్ ఓవర్. రానా విజువల్స్ బ్రిల్లియెంట్‌గా ఉన్నాయి. బాహుబలి కెమిస్ట్రీ కనెక్ట్ చేయడం బాగుంది. టాలీవుడ్ గ్లోబల్ లెగసీని చాలా తెలివిగా ట్యాప్ చేశారు. మిరాయ్‌కు వచ్చే హైప్‌ను చూడటానికి ఎక్సైట్‌గా ఉంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.


మిరాయ్ సినిమా తెలుగు మూవీస్‌లో గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ఇప్పటి వరకు ఇలాంటి అనుభూతిని పొందలేదు. సెకండాఫ్‌లో 15 నిమిషాల కామెడీ తీసేస్తే.. ఈజీగా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఈ సినిమాతో తేజ సజ్జాను సూపర్ స్టార్‌ అని ప్రశంసించాల్సిందే.

మిరాయ్ చూసిన చాలా బాగుంది. మొదటి తొలి గంట పాస్ అయ్యేలా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండాఫ్ విజువల్ ట్రీట్. హరి గవ్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కార్తీక్ పెట్టిన ఫ్రేమ్స్ బాగున్నాయి. హనుమాన్ తర్వాత తేజ సజ్జా మరో హిట్‌తో ఫైర్‌తో వచ్చాడు. బ్లాక్ బస్టర్ వైబ్స్. ఇప్పడే మీ టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

మిరాయ్ సినిమా రిలీజ్‌కు ముందు తేజా సజ్జా ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. గొప్ప హృదయం ఉన్న ప్రభాస్ గారికి ఈ సినిమా చాలా స్పెషల్‌గా మార్చచారు. అందుకు ఎంతో రుణపడి ఉంటాను. ప్రారంభంలో వచ్చే రెబల్ స్టార్‌ను మీరు అసలు మిస్ కావొద్దు అని అన్నారు. దాంతో ఈ వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మిరాయ్ సినిమా గురించి తెలిసినప్పటి నుంచి నాకు ఆ మూవీపై ప్రత్యేకమైన అటెన్షన్ ఏర్పడింది. ట్రైలర్ అద్బుతంగా ఉంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూస్తున్నాను. మీరు పడిన కష్టానికి బ్రహ్మండమైన ఫలితం ఉండబోతుందని అర్ధమైంది. కార్తీక్ ఘట్టమనేనికి నా బెస్ట్ విషెస్ అని నాగచైతన్య ట్వీట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X