Miral Movie Review: ప్రేమిస్తే భరత్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మిరల్ సినిమా సమీక్ష

Rating:
2.5/5

నటీనటులు: ప్రేమిస్తే భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
దర్శకత్వం: ఎం శక్తివేల్
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్
సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా
ఎడిటర్: కలైవనన్ ఆర్
రిలీజ్ డేట్: 17-05-2024

తన బావను కాకుండా రమ (వాణి భోజన్) తాను ప్రేమించిన హరి (భరత్)‌ను పెళ్లి చేసుకొంటుంది. అయితే తమ ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో కూతురుపై తండ్రి (కేఎస్ రవికుమార్) గుర్రుగా ఉంటారు. అయితే తన భర్త చనిపోయినట్టు రమను పీడకలలు వెంటాడుతుంటాయి. దాంతో తమ గ్రామానికి వచ్చి అమ్మవారికి పూజలు చేయాలని రమ, హరిని పిలుస్తుంది.

Miral Review and Rating in Telugu  Premisthey Bharat shines in Emotional Role

అయితే పెళ్లి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు, కూతురిని తండ్రి ఎలా ట్రీట్ చేశాడు? గ్రామానికి వచ్చి పూజలు చేసిన తర్వాత రమ, హరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ పరిస్థితులను ఎలా హరి ఎదుర్కొన్నాడు. గ్రామం నుంచి పట్టణానికి వెళ్తుంటే.. దెయ్యాలు ఎలా వెంటాడాయి? అవి నిజంగా దెయ్యాలేనా? లేకా ఎవరైనా నాటకం ఆడారా? అనే ప్రశ్నలకు సమాధానం మిరల్ సినిమా కథ.

హారర్, ఘోస్ట్ ఎలిమెంట్స్‌ పాయింట్స్‌తో రాసుకొన్న కథ బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్ వరకు గజిబిజిగా ఉండే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కొంత గందరగోళానికి గురిచేస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కేవలం మూడు క్యారెక్టర్లు, ఒకే ప్లేస్‌లో కథను పరుగులు పెట్టించిన తీరు బాగుంది. అయితే క్లైమాక్స్ ట్విస్టు ఎమోషనల్‌గా ఆకట్టుకోలేకపోవడమే కాకుండా.. అప్పటి వరకు ఆడియెన్‌లో ఉండే ఫీల్‌ను చల్లారేలా చేసింది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ప్రేమిస్తే భరత్ ఓ ఎమోషనల్ పాత్రలో సినిమాను మొత్తం తన భుజాల మీద వేసుకొని నటించాడు. అడవిలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే సీన్ బాగా ఆకట్టుకొనేలా ఉంటుంది. భార్యకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకొనే క్యారెక్టర్‌లో మరోసారి మంచి నటనను ప్రదర్శించాడు. ఇక వాణి భోజన్ గ్లామర్‌కు ఆస్కారం లేని.. ఫెర్పార్మెన్స్ రోల్‌లో ఒదిగిపోయింది. కేఎస్ రవికుమార్, మాస్టర్ అంకిత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Miral Review and Rating in Telugu  Premisthey Bharat shines in Emotional Role

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ బాలా సన్నివేశాలను చిత్రీకరించిన తీరు.. అలాగే ఆ సీన్లలో హారర్ నింపిన తీరు బాగుంది. ప్రసాద్ ఎస్ఎన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత హారర్‌గా చూపించేలా చేసింది. సతీష్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కంటెంట్‌లో వెరైటీ లేకపోవడం వల్ల సినిమా కొంత సాగదీసినట్టు ఉండటం మైనస్. హరర్, ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X